Shriram Capital
-
హోల్డింగ్ కంపెనీగా శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్
చెన్నై: శ్రీరామ్ గ్రూపు హోల్డింగ్ కంపెనీగా ఇప్పటి వరకు ఉన్న శ్రీరామ్ క్యాపిటల్ లిమిటెడ్‌తోపాటు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్.. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్‌లో విలీనం కానున్నట్టు శ్రీరామ్ గ్రూపు ప్రకటించింది. శ్రీరామ్ క్యాపిటల్‌కు హోల్డింగ్ కంపెనీ అయిన శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ (చెన్నై) ప్రైవేటు లిమిటెడ్.. విలీనానంతర కంపెనీకి ప్రమోటర్‌గా మారుతుందని, ఫైనాన్షియల్, బీమా సేవలన్నీ దీని కింద ఉంటాయని ప్రకటించింది. శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్(ఎస్ఎఫ్వీపీఎల్)కు సహ యజమానులుగా శ్రీరామ్ ఓనర్షిప్ ట్రస్ట్, దక్షిణాఫ్రికాకు చెందిన సన్లామ్ గ్రూపు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ఎస్ఎఫ్వీపీఎల్కు వైస్ చైర్మన్, ఎండీగా శ్రీరామ్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డీవీ రవి వ్యవహరిస్తారు. శ్రీరామ్ క్యాపిటల్ సీఎఫ్‌వో శుభశ్రీ శ్రీరామ్, నోవాక్ టెక్నాలజీ డైరెక్టర్, సీఈవో ఎన్ఎస్ నంద కిషోర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ల బాధ్యతలు చేపడతారని శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ ప్రకటించింది. -
మరో మెగా విలీనం రద్దు
ముంబై : ఇటీవలే టెలికాం కంపెనీలు ఆర్‌కామ్-ఎయిర్‌సెల్ విలీనం కథ కంచికి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మెగా విలీనం కూడా రద్దయింది. అది ఐడీఎఫ్సీ బ్యాంకు, శ్రీరామ్ క్యాపిటల్ విలీనం. నాలుగు నెలల చర్చల అనంతరం కూడా ఇరు వైపుల నుంచి వాల్యుయేషన్ పరంగా ఆమోదయోగ్యంగా లేరని ఈ విషయం తెలిసిన ముగ్గురు అధికారులు చెప్పారు. ఈ విలీన చర్చలు రద్దయినట్టు త్వరలోనే ప్రకటన వస్తుందని తెలిపారు. వాటాదారుల సంతోషంగా లేరు. రెగ్యులేటరీ సంతోషంగా లేదు. ఈ సమయంలో ఎలాంటి మంచి జరుగదు అని ఓ వ్యక్తి చెప్పారు. ఇది చాలా కిష్టమైన డీల్ అని, నిరాశలో ఉన్న ఒకరు లేదా ఇద్దరు మైనార్టీ వాటాదారులు ఈ చర్చ ప్రక్రియలో పాల్గొన్నారని పేర్కొన్నారు. జూలై తొలివారం నుంచి ఇరు కంపెనీలు ఎక్స్‌క్లూజివ్‌గా చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండు విలీనమైన అతిపెద్ద బ్యాంకుగా, ఇన్సూరెన్స్ బిజినెస్‌గా ఎదగాలని ప్రయత్నం చేశాయి. ఇరు గ్రూప్‌లు అక్టోబర్ 5ను డెడ్‌లైన్‌గా విధించుకున్నాయి. కానీ అప్పటికీ ఇరు గ్రూప్‌లు ఓ ఏకగ్రీవ నిర్ణయానికి రాలేకపోయాయి. స్టేక్ వాల్యుయేషన్ విషయంలో ఇరు కంపెనీలకు చెడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు 2014లో బ్యాంకింగ్ లైసెన్సు వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ బ్యాంకు అంత బలమైన డిపాజిట్ బేస్‌ను నిర్వహించలేకపోతుంది. ఇరు సంస్థలు విలీన చర్చలు ప్రారంభించే ముందు 'పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి'' అంటూ ఐడీఎఫ్సీ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ లాల్ అన్నారు. -
ఐదు పబ్లిక్ ఇష్యూలకు సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: పిరమల్ ఎంటర్ప్రైజెస్ తాజాగా మరో పెట్టుబడి నిర్ణయాన్ని తీసుకుంది. శ్రీరాం క్యాపిటల్‌లో 20% వాటాను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ. 2,014 కోట్లను వెచ్చించనున్నట్లు వెల్లడించిం ది. తద్వారా ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలో విస్తరించేందుకు వీలు చిక్కుతుందని కంపెనీ చైర్మన్ అజయ్ పిరమల్ చెప్పారు. శ్రీరాం క్యాపిటల్‌తో భాగస్వామ్యం ద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూరుతుందన్నారు. గత నాలుగు దశాబ్దాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారానే కంపెనీ వృద్ధి బాటలో సాగిందని శ్రీరాం గ్రూప్ వ్యవస్థాపకులు ఆర్.త్యాగరాజన్ పేర్కొన్నారు. దీంతో తమ ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్ భారీ వృద్ధిని అందుకుంటుందని తెలిపారు. గ్రూప్‌లోని శ్రీరాం ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, శ్రీరాం సిటీ యూని యన్ ఫైనాన్స్ సంస్థలకు హోల్డింగ్ కంపెనీగా శ్రీరాం క్యాపిటల్ వ్యవహరిస్తోంది. గతేడాదిలో కూడా పిరమల్ శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌లో 9.9% వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 1,636 కోట్లను చెల్లించింది. కాగా, ఈ నెల మొదట్లో వొడాఫోన్ ఇండియాలోగల 11% వాటాను యూకే మాతృ సంస్థ వొడాఫోన్‌కు రూ. 8,900 కోట్లకు విక్రయించింది. బీఎస్ఈలో పిరమల్ ఎంటర్ప్రైజెస్ షేరు 1% లాభంతో రూ. 602 వద్ద నిలవగా, శ్రీరాం సిటీ యూనియన్ 1% బలపడి రూ. 1,215 వద్ద, శ్రీరాం ట్రాన్స్పోర్ట్ షేరు 3% ఎగసి రూ. 747 వద్ద ముగిశాయి.