మార్కెట్లోకి ‘మోవెంటోఎనర్జీ’ కీటకనాశిని
సాక్షి, గుంటూరు : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బేయర్ క్రాప్ సైన్స్ అంతర్జాతీయ ప్రమాణాలు, నూతన సాంకేతిక పరిశోధనలతో రూపొందించిన కీటకనాశిని ‘మోవెంటో ఎనర్జీ’ ఉత్పాదనను సోమవారం మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సౌత్ బిజినెస్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.మోహనరావు మాట్లాడుతూ 1863లో జర్మనీలో స్థాపించిన బేయర్ కంపెనీ ఎన్నో విశిష్ట ఉత్పాదనలను సుమారు 165 దేశాలలో కోట్లాది మంది రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు.
సౌత్ కోస్టల్ డివిజినల్ మేనేజర్ ఎస్.నరసయ్య మాట్లాడుతూ నూతనంగా విడుదల చేసిన మోవెంటో ఎనర్జీ ఒక అద్భుతమైన క్రిమిసంహారిణి అని తెలిపారు. క్రాప్ మేనేజర్ పి.శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ మోవెంటో ఎనర్జీ మొక్కలోని ప్రసరణ ద్వారా అనేక రకాల రసంపీల్చు పురుగులను నియంత్రిస్తుందన్నారు.
ప్రొడక్ట్ మేనేజర్ అరింధమ్ ముఖర్జీ మాట్లాడుతూ.. ఈ మందు కూరగాయల పంటలు, పత్తి పంటలో రసంపీల్చు పురుగులను దీర్ఘకాలంగా నియంత్రించడమే కాకుండా పూర్తి రక్షణ ఇచ్చేందుకు చిగురు నుంచి వేరు వరకు వ్యాపించి ఉంటుందని పేర్కొన్నారు. లాం ఫారం పత్తి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.చెంగారెడ్డి మాట్లాడుతూ దేశ రైతాంగానికి నూతన పరిశోధన ఫలాలను అందించడంలో బేయర్ కంపెనీ ముందుంటుందని చెప్పారు.