డ్రోన్ల తయారీలో ఉన్న ఏస్టోరియా ఏయిరోస్పేస్ సంస్థ ఎండ్ టూ ఎండ్ డ్రోన్ ఆపరేషన్ సర్వీసులు అందించేందుకు స్కైడెక్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫామ్‌గా ఉంటూ డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ (డీఏఏఎస్, దాస్)గా స్కైడెక్ సంస్థ సేవలు అందివ్వనుంది. సర్వేయింగ్, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ ఇన్‌స్పెక‌్షన్స్, సర్వేయలెన్స్, సెక్యూరిటీ రంగాల్లో స్కైడెక్ సేవలు అందివ్వనుంది.
డ్రోన్ ఫ్లైట్స్ షెడ్యూలింగ్, డేటా ప్రాసెస్, విజువలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అనాలిసిస్ తదితర సమాచారాన్ని స్కైడెక్ అందిస్తుంది. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన విధానపరమైన నిర్ణయాలతో దేశంలో డ్రోన్ సర్వీసులకు డిమాండ్ పెరగనుందన్నారు ఏస్టోరియా కో ఫౌండర్ నీల్ మెహతా. డ్రోన్లకు సంబంధించి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఆపరేషన్ సొల్యూషన్స్ వంటి సేవలు అందిస్తామన్నారు. ఏస్టోరియా సంస్థ జియోప్లాట్‌ఫామ్ లిమిటెడ్‌కి సబ్సిడరీగా ఉంది. కాగా జియో రిలయన్స్ గ్రూపులో మేజర్ సబ్సిడరీ కంపెనీగా అందరికి సుపరిచితమే.
Comments
Please login to add a commentAdd a comment