కొనుగోలు చేసిన డ్రోన్లను పరీక్షిస్తున్న సర్వేయర్లు, అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేను మరింత వేగవంతం చేయనుంది. ఇందు కోసం కొత్తగా మరో 10 డ్రోన్లు కొనుగోలు చేసింది. విటాల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి టెండర్ల ద్వారా సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ ఈ డ్రోన్లు కొనుగోలు చేసింది. ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియా, కొన్ని ప్రైవేటు డ్రోన్ ఏజెన్సీలను నియమించుకుని సర్వే చేయిస్తోంది.
సర్వేను వేగంగా జరిపేందుకు గతంలో సర్వే శాఖ సొంతంగా 20 డ్రోన్లు కొనుగోలు చేసింది. ఇప్పుడు మరో 10 డ్రోన్లు సమకూర్చుకుంది. వీటి కోసం 20 మంది సర్వేయర్లకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చింది. ప్రభుత్వ సర్వేయర్లనే సర్టిఫైడ్ డ్రోన్ పైలట్లుగా తయారు చేసింది. ఇలా ప్రభుత్వ డ్రోన్లను ప్రభుత్వ సర్వేయర్లే నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి.
సర్వే ఆఫ్ ఇండియా, ప్రైవేటు ఏజెన్సీల డ్రోన్లతో సమానంగా రాష్ట్ర సర్వే శాఖ డ్రోన్లు కూడా ఇప్పుడు కీలకంగా పని చేస్తున్నాయి. రోజుకు 100 నుంచి 150 చదరపు కిలోమీటర్లలో డ్రోన్ ఫ్లై చేస్తూ సర్వే చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. శీతాకాలం కావడంతో వాతావరణం అనుకూలంగా ఉంటుందని, సర్వే వేగంగా చేయవచ్చని సర్వే సెటిల్మెంట్ శాఖ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment