Lands Re survey
-
రీసర్వేతో ఎంతో మేలు
తాడేపల్లి రూరల్: భూముల రీసర్వే వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందని, రాష్ట్రంలో అన్నిచోట్లా ఈ కార్యక్రమం పూర్తయితే ఎటువంటి భూ సమస్యలు ఉండవని రైతులంతా ముక్తకంఠంతో తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి భూ రికార్డులను మార్చేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చరిత్రలో తొలిసారి భూ రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనివల్ల రైతులకు ఇబ్బందులు తప్పాయని కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ జోషికి స్పష్టం చేశారు. రీసర్వేను పైలట్ ప్రాజెక్ట్‌గా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడిలో చేపట్టగా.. దీనివల్ల రైతులకు ఏమేరకు మేలు కలిగిందనే విషయాలను తెలుసుకునేందుకు గురువారం కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్) సెక్రటరీ మనోజ్ జోషి చింతలపూడి గ్రామంలో గురువారం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సర్వేయర్ రావాలంటే ఎన్నో ఏళ్లు పట్టేది మనోజ్ జోషి రైతులను వివిధ ప్రశ్నలు అడగ్గా.. కలెక్టర్ నాగలక్ష్మి తెలుగులో అనువాదం చేశారు. గతంలో పొలం గట్ల గొడవలు, విస్తీర్ణంలో తేడాలు, సర్వే నంబర్లలో తేడాలు ఉండేవి కదా అని మనోజ్ జోషి ప్రశ్నించగా.. గతంలో సర్వేయర్ పొలానికి వచ్చి సర్వే చేయాలంటే ఏళ్ల తరబడి సమయం పట్టేదని రైతులు వివరించారు. రీసర్వేను తమ గ్రామంలోనే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా.. సర్వేలో ఒకటి, రెండు సెంట్లు పెరగడం, తగ్గడం జరిగాయని, దానివల్ల పెద్దగా నష్టం లేదని రైతులు చెప్పారు. తమ పొలాలకు సంబంధించిన పక్కా డాక్యుమెంట్లు తమ చేతికి అందాయన్నారు. తాతతండ్రుల కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నామని, కానీ.. పొలాలకు సంబంధించి ఎటువంటి పాస్‌పుస్తకాలు, డాక్యుమెంట్లు లేవని చెప్పారు. దాంతో బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు నిరాకరించేవారని, రీ సర్వే కార్యక్రమం పూర్తయ్యాక డాక్యుమెంట్లు అందడంతో తాము బ్యాంకుల ద్వారా రుణాలు అందుకున్నామని వివరించారు.ఇళ్లకు, స్థలాలకు సైతం దస్తావేజులొచ్చాయిగ్రామంలో ఇళ్ల సర్వే గురించి కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి ప్రశ్నించగా.. తాతలు, తండ్రుల నుంచి ఆస్తి పంచుకున్నా అందరి దగ్గర ఒకే డాక్యుమెంట్ ఉండేదని గ్రామస్తులు చెప్పారు. రీసర్వే పూర్తయ్యాక ఎవరి దస్తావేజులు వారికి అందజేశారని, వాటివల్ల పిల్లల చదువులు, ఇతర అవసరాల నిమిత్తం బ్యాంకు రుణాలు పొందే అవకాశం కలిగిందని వెల్లడించారు. అనంతరం సర్వే సిబ్బంది నుంచి ఎలా సర్వే చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చింతలపూడి గ్రామంలో మొత్తం 931 ఎకరాలకు సంబంధించి 757 మంది రైతులు, 41.93 సెంట్ల ఇళ్ల స్థలాలకు సంబంధించి 450 మంది లబ్దిదారుల భూములకు రీ సర్వే కార్యక్రమం చేపట్టారు. ప్రతి రైతుకు సంబంధించిన భూమి విస్తీర్ణం, హద్దులను నిర్ణయించి పాస్‌బుక్‌లు అందజేశామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. -
రీ సర్వేపై చంద్రబాబు యూటర్న్
సాక్షి, అమరావతి: వందేళ్ల తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన భూముల రీ సర్వేపై నానా యాగీ చేసి, దాన్ని రద్దు చేస్తామంటూ చిందులేసిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు దిగొచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ బాటలోకి వచ్చారు. భూముల రీసర్వే చేపట్టే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తామంటూ కేంద్రం ప్రకటించింది. తద్వారా రీ సర్వే సక్రమమేనని తేల్చి చెప్పింది. దీంతో చంద్రబాబు దిగిరాక తప్పలేదు. రీ సర్వేపై స్టడీ చేస్తున్నామంటూ శాసన సభలో సన్నాయి నొక్కులు నొక్కారు. 9 రోజుల కిందట తాను తూర్పారబట్టిన కార్యక్రమాన్ని ఈరోజు తానే భుజాలకెత్తుకొనే ప్రయత్నం చేశారు. దీంతో సభలో సభ్యులంతా ఆశ్చర్యపోయారు.రాష్ట్రంలో గత వందేళ్లుగా భూముల సమగ్ర సర్వే జరగలేదు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా అనేక వివాదాలు నెలకొనడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం పేరుతో రీ సర్వే చేపట్టి, భూ యజమానులను వివాదాల నుంచి బయటపడేసి, వారి భూములకు రక్షణ కల్పించింది. ఇదే చంద్రబాబుకు నచ్చలేదు. రీసర్వేను ఓ అనాలోచితన నిర్ణయమంటూ చిందులు తొక్కారు. ఈ నెల 15న భూ, సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల సమయంలో రాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నా హయాంలో కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోవడంతో ముందుకు వెళ్లలేదు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రీసర్వే తలపెట్టి విఫలమైంది. కానీ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం పేరుతో అనాలోచితంగా రీ సర్వే చేపట్టింది. ఇది విఫల ప్రయత్నమే. ఇకపై భూ యజమానులు వచ్చి వారి హద్దులు నిర్ణయించమని కోరితే తప్ప ఎవ్వరికీ సర్వే చేసే ప్రసక్తి లేదు’ అంటూ ఆరోజు సీఎం చంద్రబాబు హుంకరించారు. అయితే, భూముల రీ సర్వే చేపట్టే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రయోజనాలు, రాయితీలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించింది. దీనిద్వారా రీసర్వే మంచి కార్యక్రమమేనని తేల్చిచెప్పింది. దీంతో బాబు ప్రభుత్వం కంగుతింది. వెంటనే సర్దుబాటు చర్యలు ప్రారంభించింది. బుధవారం చంద్రబాబు అసెంబ్లీలో ‘గత ప్రభుత్వం రీసర్వే మొత్తాన్ని సెటిల్మెంట్ కోసం చేసింది. డబ్బులైతే ఖర్చుపెట్టింది కానీ, వివాదాలు పెంచేశారు. రీ సర్వేను హోల్డ్ చేశాం. స్టే చేశాం. ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతే చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చాం’ అంటూ చెప్పుకొచ్చారు. -
రెవె'న్యూ' విధానాలతో భూ హక్కు
సాహసోపేత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవిన్యూ సంస్కరణలు, కొత్త కార్యక్రమాలతో ఇటు ప్రజలు, అటు ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా భూముల విలువ అనూహ్యంగా పెరిగిపోవడంతో పేద రైతుల తల రాత మారిపోతోంది. ఎందుకూ పనికి రావనుకున్న భూములకు సైతం మంచి ధరలు కళ్లెదుటే కనిపిస్తుండటంతో అసైన్డ్ రైతుల పంట పండింది. ‘కొనుగోళ్లు – అమ్మకాలు – రిజిస్ట్రేషన్లు’ చక్రం ద్వారా లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు ఇకపై మరింతగా ఊపందుకోనున్నాయి. తద్వారా రాష్ట్రంలో సంపద సృష్టి ఏమేరకు జరిగిందన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీటన్నింటికీ తోడు ఇన్నాళ్లూ అనుభవంలో ఉన్నప్పటికీ రికార్డు పరంగా హక్కు లేని భూమికి ఇప్పుడు ‘ఇది నా భూమి’ అని సంతృప్తిగా చెప్పుకునే పరిస్థితిని రైతులకు కలిగించింది. సాక్షి, అమరావతి : వివాదాలు, సమస్యలు, ఎడతెగని జాప్యంతో కునారిల్లిన రెవెన్యూ శాఖను వైఎస్ జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో సమూలంగా మార్చేసింది. ఆ వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు మార్గం చూపింది. సర్టిఫికెట్లు పొందడాన్ని సులభతరం చేయడం దగ్గర నుంచి కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన నిషేధిత భూముల చిక్కు ముడులు విప్పడం, సాహసోపేతమైన రీతిలో అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా లక్షలాది రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపింది. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తొలిసారి భూముల రీ సర్వేను చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని ప్రాంతాల అభిప్రాయాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఒక కొత్త స్వరూపాన్ని ఇచ్చింది. మొత్తంగా నాలుగేళ్లలో రెవెన్యూ శాఖలో చోటుచేసుకున్న మార్పులు ఇలా ఉన్నాయి. మహా యజ్ఞంలా భూముల రీ సర్వే ► అస్తవ్యస్థంగా మారిన భూముల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సాహసోపేతంగా భూముల రీ సర్వే చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. బ్రిటీష్ కాలం నాటి భూముల రికార్డుల స్థానంలో ఆధునిక డిజిటల్ భూ రికార్డులను అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు జరగని విధంగా మొత్తం భూ విస్తీర్ణాన్ని కొలిచే బృహత్తర కార్యక్రమం ఇది. ఇందుకోసం ఏకంగా 14,630 మంది సర్వేయర్లను నియమించడం ఒక రికార్డు. ► రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా భూ యజమానులకు స్పష్టమైన హక్కు కల్పించడం, అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా భూముల హద్దులను గుర్తించి.. ఆ భూమికి రక్షణ కల్పించడమే ధ్యేయంగా రీ సర్వే అత్యంత ఆధునిక రీతిలో సాగుతోంది. అత్యంత సంక్లిష్టమైన ఈ సర్వే తొలి దశలో 2 వేల గ్రామాల్లో అన్ని దశల్లోనూ పూర్తి కాగా, మరో 2 వేల గ్రామాల్లో త్వరలో పూర్తవనుంది. ప్రతి మూడు నెలలకు 2 వేల గ్రామాల చొప్పున సర్వే పూర్తికానుంది. ► సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటి వరకు 4.80 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. 16.55 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. 8.70 లక్షల భూ కమతాలకు సంబంధించి ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు తయారయ్యాయి. రైతులకు శ్రమ లేకుండా, వారి డబ్బు ఖర్చు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎంతో క్లిష్టమైన ఈ పనుల్ని పూర్తి చేసింది. ► ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. తొలిసారి భూముల హద్దులను నిర్ధారించి, భూ రక్ష సర్వే రాళ్లను రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో పాతుతున్నారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లోని భూములను కూడా తొలిసారి సర్వే చేసి, ఇళ్ల యజమానులకు ఓనర్షిప్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి దళితవాడకు శ్మశాన వాటిక రాష్ట్రంలోని దళిత వాడలకు శ్మశాన వాటిక సమస్య లేకుండా చేసేందుకు ఆ దిశగా నడుం బిగించింది. శ్మశాన వాటికలు లేని దళిత వాడలను గుర్తించి, వెంటనే ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని 1,700 గ్రామాల్లో 1050.08 ఎకరాల భూమిని శ్మశాన వాటికలకు కేటాయించింది. సుదీర్ఘకాలం తర్వాత భూ పంపిణీ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం తర్వాత నిరుపేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 23 జిల్లాల్లో 50 వేల ఎకరాలను అర్హులైన పేదలకు పంచనున్నారు. 46 వేల మందికి భూములివ్వడానికి ఎంపిక చేయగా, అందులో ఎక్కువ మంది దళితులే. వ్యవసాయ కూలీలుగా, ఇతర పనులు చేసుకుంటూ జీవించే వారిని ప్రభుత్వం రైతులుగా మార్చనుంది. రాష్ట్రంలో 2013 తర్వాత మళ్లీ భూ పంపిణీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ► అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడంతో లక్షలాది మంది దళిత, పేద రైతుల ఆర్థిక స్థితి ఒక్కసారిగా పెరిగిపోయింది. అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత అసైన్దారులు లేకపోతే వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు లభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ► తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలని అసైన్డ్ రైతులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత హక్కుదారులు వారికి అవసరమైనప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించింది. దీనివల్ల తమ భూములపై హక్కులు లేని 15,21,160 మంది పేద దళిత, ఇతర పేద వర్గాల రైతులకు సంబంధించిన 27,41,698 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. ‘ఇక ఇది నా భూమి’ అని ఆ రైతులు గర్వంగా చెప్పుకునే పరిస్థితి కల్పించింది. ► ఇన్ని లక్షల ఎకరాల లావాదేవీలు మార్కెట్లోకి రావడంతో ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. విలువ లేని పేద రైతుల భూమికి విలువ పెంచడంతోపాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే నిర్ణయంగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. కొత్త జిల్లాల కల సాకారం ► ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా, 51 రెవెన్యూ డివిజన్లను 77 డివిజన్లుగా పునర్వ్యవస్థీకరించింది. జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని విభజన పూర్తి చేసింది. ► పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్‌ను రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసింది. పరిపాలనా వికేంద్రీకరణ, భౌగోళిక అనుకూలతలతోపాటు ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ► ప్రతి జిల్లాకు అక్కడి పరిస్థితులను బట్టి పేరు పెట్టి, ఆయా ప్రాంతాల ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. గత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ను విస్మరిస్తే.. ఆయన జన్మించిన కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన గౌరవాన్ని నిలబెట్టింది. 1.68 లక్షల సర్వీసు ఈనాం భూములకు విముక్తి గ్రామాల్లో కుల వృత్తుల వారికి ఇచ్చిన ఈనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు. 1,68,604 ఎకరాల ఈనాం భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నారు. లంక భూములకు డి పట్టాలు అనేక సంవత్సరాలుగా అపరిష్కృత సమస్యగా ఉన్న లంక భూములకు డీకేటీ పట్టాలిస్తున్నారు. 8 జిల్లాల్లో ఉన్న కృష్ణా, గోదావరి లంకల్లోని 9,062 ఎకరాలకు సంబంధించిన 19,176 మంది రైతులకు పట్టాలు దక్కనున్నాయి. మూడు కేటగిరీల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న రైతులు తమకు పట్టాలు ఇవ్వాలని కోరుతుండడంతో వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సి కేటగిరీలోని కొన్ని భూములకు ఐదేళ్ల లీజుకు ఇవ్వనుంది. చుక్కల భూముల సమస్యకు పరిష్కారం ► అత్యంత వివాదాస్పదమై ఏళ్ల తరబడి లక్షలాది మంది రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన చుక్కల భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సునాయాసంగా పరిష్కరించింది. 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22 ఏ (1) ఇ) నుంచి ఒకేసారి తొలగించి చరిత్ర సృష్టించింది. ► చుక్కల భూములుగా ఆర్‌ఎస్‌ఆర్‌లో రికార్డు చేసిన భూములు ప్రభుత్వానికి చెందినవా, ప్రైవేటు పట్టాదారులవా అనే అంశాన్ని గత ప్రభుత్వం ఖరారు చేయకుండా నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. ఆ రికార్డులన్నింటినీ పరిశీలించి చుక్కల భూములకు విముక్తి కల్పించింది. ఈ నిర్ణయం వల్ల 1,07,134 మంది రైతులకు వారి భూములపై శాశ్వత హక్కులు లభించాయి. షరతులు గల పట్టా భూములపై తొలగిన ఆంక్షలు ► చుక్కల భూముల తరహాలోనే సమస్యాత్మకంగా తయారైన షరతులు గల పట్టా భూములకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. 33 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ఆ రైతులకు మేలు చేకూర్చింది. ► బ్రిటీష్ హయాం నుంచి రైతుల చేతుల్లో ఉన్న భూములను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 22ఏ కేటగిరీలో పెట్టగా, అలా పెట్టడం అన్యాయమని భావించి నిబంధనల ప్రకారమే వాటిని ఆ జాబితా నుంచి ఈ ప్రభుత్వం తీసివేసింది. ► ఇలా ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసివేశారు. 2022 అక్టోబర్ 20న అవనిగడ్డలో బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి కొందరికి పట్టాలిచ్చారు. అనాదీనం, ఖాళీ కాలమ్ భూముల సమస్యకు చెక్ అనాదీనం, ఖాళీ కాలమ్ భూములను చుక్కల భూముల చట్టం పరిధిలోకి తీసుకువచ్చి, వాటిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు సంబంధించిన 35 నుంచి 40 వేల మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందారు. సాదాబైనామా కేసుల పరిష్కారం గతంలో భూముల లావాదేవీలను తెల్ల కాగితాల మీద రాసుకోవడం, నోటి మాటగా జరిగిన భూముల లావాదేవీల (సాదాబైనామా విధానం) సమస్యకు పరిష్కారం చూపింది. ఒక నిర్ధిష్ట విధానాన్ని రూపొందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించింది. మ్యుటేషన్లలో పారదర్శకత ► మ్యుటేషన్ల పేరుతో జరిగే అక్రమాలకు ముగింపు పలికేలా ప్రభుత్వం అనేక మార్పులు చేపట్టింది. ఇష్టానుసారం మ్యుటేషన్లు చేయడాన్ని నిలిపివేసి, పట్టాదారుకు నోటీసు ఇచ్చి, విచారణ జరిగిన తర్వాతే రెవెన్యూ రికార్డులో మార్పు జరిగేలా సాఫ్ట్‌వేర్‌ను మార్చారు. దీంతో కరెక్షన్ పేరుతో జరిగే మ్యుటేషన్లు నిలిచిపోయాయి. ► మ్యుటేషన్లు తిరస్కరించే అధికారాన్ని తహశీల్దార్లకు తీసివేసి ఆర్డీఓలకు అప్పగించడంతో ఇబ్బందులు తగ్గిపోయాయి. రిజిస్ట్రేషన్‌కు ముందే సర్వే నంబర్ సబ్ డివిజన్ చేసుకునే విధానాన్ని ప్రవేశ పెట్టడంతో డబుల్ రిజిస్ట్రేషన్లు తగ్గాయి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఆటో మ్యుటేషన్ విధానాన్ని తీసుకువస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. సర్టిఫికెట్ల జారీ సులభతరం ► ప్రజలకు అవసరమైన ముఖ్యమైన సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వైఎస్ జగన్ ప్రభుత్వం సులభతరం చేసింది. సర్టిఫికెట్లు జారీ చేయడానికి దరఖాస్తులు తీసుకునే గ్రామ, వార్డు సచివాలయం, మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ వెబ్ అప్లికేషన్, కాల్ సెంటర్ వంటి వ్యవస్థలన్నింటికీ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి వాటి ప్రకారమే పని చేయిస్తోంది. ► హౌస్ హోల్డ్ డేటా బేస్‌లో ఉన్న కుటుంబానికి వెంటనే ఫ్యామిలి మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడం, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ గతంలో జారీ అయి ఉంటే ప్రస్తుత తహశీల్దార్ డిజిటల్ సంతకం, ప్రస్తుత తేదీతో మళ్లీ వెంటనే ఇవ్వడం లాంటి అనేక మార్పులు తీసుకువచ్చి అమలు చేస్తోంది. ఆస్తిని సంపదగా మార్చే ప్రక్రియ ముమ్మరం భూములకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలు ఏదైతే జరగాలని చెబుతున్నారో.. అలాంటి మార్పులన్నీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయి. ఎక్కడైనా సరే ఆస్తిని సంపదగా మార్చుకున్న దేశాలు అభివృద్ధి చెందుతాయి. ఆస్తి సంపదగా మారాలంటే అడ్డంకులను ప్రభుత్వమే తొలగించాలి. ఆ పని ఏపీ ప్రభుత్వం చేస్తోంది. భూ హక్కులకు భద్రత కల్పించడం, సరిహద్దుల స్పష్టత, అమ్మకాలు–కొనుగోళ్లను సులభం చేయడం, ఆంక్షలను తొలగించడం, మంచి భూ పరిపాలన యంత్రాంగాన్ని తయారు చేయడం ప్రధానమైనవి. ఏపీ ప్రభుత్వం ఈ పనులన్నీ చేస్తోంది. అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తేయడం, చుక్కల భూములు, అనా«దీనం భూములపైనా ఆంక్షలు తొలగించడం ఇందులో భాగమే. రిజిస్ట్రేషన్ ప్రక్రియ గ్రామ స్థాయికి రావడం పెద్ద మార్పు. ఇలా ఆస్తిని సంపదగా మార్చే ప్రక్రియలో ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేసింది. తద్వారా వేల కోట్ల సంపద ఆవిష్కృతమైంది. – ఎం.సునీల్‌కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ -
రోల్‌మోడల్‌గా మన ‘రీ సర్వే’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల రీ సర్వే ప్రాజెక్టు విజయవంతమవడంతో వివిధ రాష్ట్రాలు దాన్ని బెస్ట్ ప్రాక్టీస్‌గా తీసుకుంటున్నాయి. తాజాగా పుదుచ్చేరి ప్రభుత్వం ఏపీ రీసర్వేపై తమ రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించింది. డైరెక్టరేట్ ఆఫ్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగాధికారులతో భూమి రికార్డులకు సంబంధించిన అంశాలపై సోమవారం ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో హైబ్రిడ్ టెక్నాలజీతో ఆధునిక భూముల సర్వే అనే అంశంపై ఏపీ ప్రభుత్వం తరఫున సర్వే సెటిల్మెంట్ శాఖలో పనిచేస్తున్న సర్వే అకాడమీ వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్వీఎస్ఎన్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డ్రోన్లు, విమానాలతో ఆధునిక రీతిలో రాష్ట్రంలోని 1.25 చదరపు కిలోమీటర్ల ఏరియాలో రీ సర్వే జరుగుతున్న విధానం, ఇప్పటికే 2 వేల గ్రామాల్లో విజయవంతంగా రీ సర్వే పూర్తి చేసి ఆ గ్రామాలకు సంబంధించిన డిజిటల్ రికార్డులు అందుబాటులోకి తేవడం, అక్షాంశాలు, రేఖాంశాలతో రైతుల హద్దులు నిర్ధారించడం.. వారి భూముల్లో హద్దురాళ్లు పాతడం, 7 లక్షల మందికిపైగా రైతులకు హక్కు పత్రాలు పంపిణీ, 20 వేలకుపైగా భూ వివాదాలను పరిష్కరించడం వంటి పలు అంశాలను ఆయన ఈ వర్క్‌షాప్‌లో వివరించారు. దేశ చరిత్రలో బ్రిటీష్ ప్రభుత్వం తర్వాత తొలిసారి భూములను రీ సర్వే చేయడం వల్ల ఎదురైన సవాళ్లు, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లిన విధానం, ప్రతి భూ కమతానికి ఆధార్ నంబర్లా విశిష్ట సంఖ్యను కేటాయించడం వంటి విషయాలను విశ్లేషించి చెప్పారు. రీ సర్వే ద్వారా రైతులకు వారి భూములపై స్పష్టమైన హక్కులు కల్పించడమేకాకుండా రాళ్లు పాతడం ద్వారా రక్షణ కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో జరుగుతున్న భూముల రీ సర్వే దేశానికే మోడల్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదని, ఏ రాష్ట్రమైనా భూమి రికార్డుల నిర్వహణ, రీ సర్వేలో కచ్చితంగా ఏపీ వైపు చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఆధునిక టెక్నాలజీ, రికార్డుల నిర్వహణలో బెస్ట్ మోడల్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కి చెందిన బీఎన్ యుగంధర్ సెంటర్ ఫర్ రూరల్ స్టడీస్ (బీఎన్వై–సీఆర్ఎస్) ఆధ్వర్యంలో ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రీసోర్సెస్లు వివిధ రాష్ట్రాల్లో భూ పరిపాలన, నిర్వహణకు సంబంధించిన అంశాలపై వివిధ రాష్ట్రాలకు శిక్షణ ఇవ్వడం, విధానపరమైన సిఫారసులు చేసే బాధ్యతను(బీఎన్వై–సీఆర్ఎస్)కి అప్పగించింది. ఈ సెంటర్ ఏపీలో రీసర్వేను బెస్ట్ ప్రాక్టిస్‌గా గుర్తించడమేకాకుండా ఇందుకు వినియోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ, రికార్డుల నిర్వహణలో బెస్ట్ మోడల్‌గా సిఫారసు చేస్తోంది. అందులో భాగంగానే పలు రాష్ట్రాలకు భూముల వ్యవహారాలపై అవగాహన, రీ సర్వే గురించి శిక్షణ ఇచ్చేందుకు ఏపీ అధికారులను ఆహ్వానిస్తోంది. గత నెలలో ఉత్తరాఖండ్ అధికారులకు డెహ్రాడూన్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఇలాగే ఏపీ అధికారులతో ప్రజెంటేషన్ ఇప్పించగా, తాజాగా పుదుచ్చేరి వర్క్‌షాప్‌లోనూ ఏపీ రీ సర్వేను ఒక టాపిక్‌గా పెట్టి దానిపై అవగాహన కల్పించింది. -
రీ సర్వేలో సర్కారు స్పీడు
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వేతో కొత్త చరిత్రను లిఖిస్తున్న ప్రభుత్వం మరో రికార్డు సృష్టించింది. తొలి విడత రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో సరిహద్దు రాళ్లు పాతే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. వ్యవసాయ భూముల సరిహద్దులను చూపుతూ రాళ్లు వేసినప్పుడు మాత్రమే సమగ్ర భూ సర్వే పూర్తయినట్లని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేయటంతో సర్వే శాఖ వేగంగా దాన్ని పూర్తి చేసింది. గత నెలాఖరుకి 13 లక్షల రాళ్లు పాతిన యంత్రాంగం ఆ తర్వాత 20 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 12.80 లక్షలకుపైగా రాళ్లు పాతి, కొత్త రికార్డు సృష్టించింది. ఈ నెల 20వ తేదీకల్లా 2 వేల గ్రామాల్లో రాళ్లు పాతే పని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా మూడు రోజుల ముందే ఆ పని పూర్తి చేశారు. ఇందుకోసం సర్వే శాఖ వెయ్యి రోవర్లను సమకూర్చుకొంది. మరికొన్నింటిని అద్దెకు తీసుకొంది. రోజుకు సగటున 40 నుంచి 50 వేల రాళ్లను పాతారు. 2 వేల గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తి రాష్ట్రంలోని 17 వేలకుపైగా గ్రామాలకుగాను తొలి విడతగా 2 వేల గ్రామాల్లో రీ సర్వే అన్ని దశలు పూర్తయింది. ఈ గ్రామాలకు కొత్త రెవెన్యూ రికార్డులు (ఆర్ఓఆర్) సైతం తయారయ్యాయి. ఆ గ్రామాలకు చెందిన 7.50 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలను జారీ చేశారు. చివరిగా రైతుల భూముల సరిహద్దుల్లో సర్వే రాళ్లు పాతడం కూడా పూర్తి చేయడం ద్వారా ఈ 2 వేల గ్రామాలను రీసర్వే మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దారు. ఖర్చంతా ప్రభుత్వానిదే సాధారణంగా రైతులు భూమిని సర్వే చేయించుకుని రాళ్లు పాతించడం పెద్ద ప్రయాస. ఖర్చు ఎక్కువ. అయితే, ప్రభుత్వం రైతులపై పైసా కూడా భారం పడకుండా మొత్తం తానే భరించింది. సర్వే పూర్తి చేసి ఉచితంగా రాళ్లు పాతి రైతులకు భూములు అప్పగించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇందుకోసం అవసరమైన రాళ్లను కోట్ల ఖర్చుతో తయారు చేయించింది. రాళ్ల తయారీకి ప్రత్యేకంగా యూనిట్లు పెట్టి మరీ అవసరమైన సైజుల్లో రాళ్లను తయారు చేసింది. 25 లక్షలకు పైగా రాళ్లు సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో మొత్తం 25 లక్షలకు పైగా రాళ్లను పాతారు. మూడు గ్రామాలు కలిసే చోట (ట్రై జంక్షన్) ఏ క్లాస్ పెద్ద రాళ్లు 6,970 పాతారు. ప్రతి భూకమతం హద్దుల్లో బి క్లాస్ చిన్న రాళ్లు 25.73 లక్షలు పాతారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని 354 గ్రామాల హద్దుల్లో 4.48 లక్షల రాళ్లు పాతారు. విజయనగరం జిల్లాలో 179 గ్రామాల్లో 2.48 లక్షలు, పల్నాడు జిల్లాలో 70 గ్రామాల్లో 2.08 లక్షలు, కాకినాడ జిల్లాలో 121 గ్రామాల్లో 1.86 లక్షలు, చిత్తూరు జిల్లాలోని 134 గ్రామాల్లో 1.44 లక్షల రాళ్లు పాతారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా గ్రానైట్, శాండ్ స్టోన్, లైమ్ స్టోన్, నాప రాళ్లను వినియోగించారు. 70 శాతానికిపైగా గ్రానైట్ రాళ్లనే పాతారు. -
‘చుక్కల’ చిక్కుల్లేవ్!
సాక్షి, అమరావతి: భూముల చరిత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో విప్లవాత్మక ముందడుగు వేసింది. రాష్ట్రంలో దశాబ్దాలుగా స్తంభించిపోయిన చుక్కల భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది. ఒకేసారి 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి రైతన్నలకు ఊరట కల్పించింది. రెవెన్యూ శాఖ నిర్వహించిన సుమోటో వెరిఫికేషన్ ద్వారా రికార్డులన్నింటినీ పూర్తిగా పరిశీలించి చుక్కల నుంచి విముక్తి కల్పించింది. ‘‘22 ఏ (1) ఇ’’ నుంచి తొలగిస్తూ ఇప్పటికే 10 జిల్లాలకు సంబంధించిన జీవోలు జారీ కాగా మిగతావి త్వరలో వెలువడనున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 43 వేల ఎకరాల చుక్కల భూములకు విముక్తి లభించింది. ఈ భూములను రైతులు ఇక స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. వాటిపై రుణాలు పొందేందుకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లక్షల మంది రైతు కుటుంబాల్లో మానసిక వేదనను తొలగిస్తూ చుక్కల భూములకు విముక్తి కల్పించిన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో ఈ నెలలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూముల సమస్యలపై స్పెషల్ ఫోకస్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీర్ఘకాలంగా పేరుకుపోయిన భూముల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా అన్ని భూములను రీ సర్వే చేస్తోంది. షరతుల గల పట్టా భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడంతో కృష్ణా జిల్లా అవనిగడ్డలో 18 వేల ఎకరాలకు సంబంధించి రైతులకు మేలు జరిగింది. అనాధీనం, ఖాళీ కాలమ్ భూముల సమస్యను పరిష్కరించేందుకు చట్టాన్ని మార్చింది. కృష్ణా, గోదావరి డెల్టాలోని లంక భూములకు డి పట్టాలిచ్చేందుకు నిబంధనలను సవరించింది. అదే క్రమంలో చుక్కల భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తోంది. నిషేధిత ఆస్తుల జాబితాలోని 22 ఏ (1) ఇ నుంచి చుక్కల భూములను తొలగించింది. నిబంధనలకు అనుగుణంగా ఆ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలని తొలుత జిల్లా కలెక్టర్లను ఆదేశించినా వివాదాలు, దళారుల కారణంగా అడుగు ముందుకు పడకపోవడంతో ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. 1.81 లక్షల సర్వే నెంబర్ల రీ–వెరిఫికేషన్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్రంలో చుక్కల భూములన్నింటినీ సుమోటోగా రీ వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు 2022 ఆగస్టు 22, 25వ తేదీల్లో జిల్లా కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ రెండు సర్క్యులర్లు జారీ చేశారు. చుక్కల భూములు కాకపోయినప్పటికీ 1908 రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22–ఏ (1)ఇ కింద నమోదు చేసిన భూములతోపాటు అసలు నిషేధిత జాబితాలో చేర్చకూడని వాటిని 22 ఏలో పొందుపరచిన కేసులపై ఒక నిర్ణయానికి రావాలని ఆదేశించారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా చుక్కల భూముల పేరుతో ఉన్న 4.06 లక్షల ఎకరాలను రెవెన్యూ యంత్రాంగం సుమోటోగా రీ వెరిఫికేషన్ చేసింది. ఆర్డీవోలు, తహశీల్దార్లు 1.81 లక్షల సర్వే నెంబర్లలోని 4.06 లక్షలపైగా ఎకరాలకు సంబంధించిన భూములను రీ వెరిఫికేషన్ చేశారు. రైతుల వద్ద ఉన్న డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డులు, రెవెన్యూ శాఖ నిర్వహించే 10 (1) అకౌంట్, రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఆ భూములకు సంబంధించి ఏవైనా కోర్టు ఉత్తర్వులుంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. 2017లో చుక్కల భూముల చట్టం వచ్చే నాటికి ఆ భూమి 11 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం సంబంధిత రైతు ఆధీనంలో ఉందో లేదో పరిశీలించారు. ఆర్ఎస్ఆర్ (రీ–సెటిల్మెంట్ రిజిష్టర్)లోని 16వ కాలమ్‌లో చుక్కల భూమిగా నిర్దేశించే కాలమ్‌ను పరిశీలించారు. వీటి ప్రకారం రికార్డుల్లో పేరు ఉన్నట్లు ధృవీకరించుకోవడంతోపాటు 11 ఏళ్లుగా సంబంధిత రైతు ఆధీనంలో భూమి ఉంటే 22 (ఏ)1 ఇ నుంచి తొలగించారు. అలాగే చుక్కల భూముల కేటగిరీ కిందకు రావని గుర్తించిన భూములను నిబంధనల ప్రకారం ఏ కేటగిరీలో చేర్చాలో అందులో (22ఏ (1) చేర్చారు. రైతులకు సర్వ హక్కులు నిషేధిత జాబితాలో ఉండడంతో ఈ భూముల రిజిస్ట్రేషన్లను ఇన్నాళ్లూ నిలిపివేశారు. పంట రుణాలు కూడా రావడంలేదు. తమ సమస్యను పరిష్కరించాలని రైతులు అధికారుల చుట్టూ తిరగడమే కానీ ఇన్నాళ్లూ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సమస్యలన్నింటికీ తెర దించుతూ చుక్కల భూముల సమస్యకు సీఎం వైఎస్ జగన్ ముగింపు పలికారు. రాష్ట్ర చరిత్రలో లక్షల ఎకరాల భూములకు విముక్తి కల్పించడం ఇదే తొలిసారి. ప్రణాళిక ప్రకారం చుక్కల భూముల సమస్యను పరిష్కరించి వాటికి విముక్తి కలిగించి లక్షల మంది రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. దీనిద్వారా సంబంధిత రైతులకు తమ భూములపై సర్వ హక్కులు లభిస్తాయి. 15 ఏళ్ల అవస్థలు తీరాయి.. గ్రామంలో పూర్వీకులు నుంచి వచ్చిన 2.50 ఎకరాలు భూమిని 15 ఏళ్ల క్రితం రెడ్ మార్క్‌లో పెట్టారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి అడిగితే చుక్కల భూమిగా నమోదైందని చెప్పారు. అప్పటి నుంచి పొలం అమ్ముకోవాలంటే రిజిస్టర్ కాకపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నా. సమస్య పరిష్కరించాలని చాలాసార్లు అధికారులకు అర్జీలిచ్చినా స్పందన లేదు. సీఎం జగన్ ప్రభుత్వం మా సమస్యను ఇంత సులభంగా పరిష్కరిస్తుందని అనుకోలేదు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. – జానపాటి అవులయ్య, వేములకోట, మార్కాపురం మండలం, ప్రకాశం జిల్లా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.. 18 ఏళ్ల క్రితం సర్వే నెంబర్ 432–3, 4లో 2.30 ఎకరాల భూమి కొన్నాం. అప్పటి నుంచి అందులో సాగు చేసుకుంటున్నాం. 2015లో ఆ భూమికి సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకుంటే చుక్కల భూమిగా నమోదైందని చెప్పారు. దీంతో విక్రయించేందుకు, బ్యాంకు రుణం పొందేందుకు వీలు లేకుండా పోయింది. ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. ఇన్నాళ్లకు మా భూమిని చుక్కల నుంచి తప్పించినట్లు చెప్పారు. మేం కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించారు. ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం – నల్లగొర్ల మస్తానయ్య, మహిమలూరు, ఆత్మకూరు మండలం, నెల్లూరు జిల్లా చుక్కల భూములంటే? ఆంగ్లేయుల హయాంలో నిర్వహించిన రీ సర్వేలో కొందరు భూ యజమానులు సర్వేకు ముందుకు రాకపోవడం, భూమి ఎవరిదో నిర్థారించలేకపోవడంతో ఆర్ఎస్ఆర్–1లోని పట్టాదార్ కాలమ్, రిమార్క్స్ కాలమ్‌లో మూడు చుక్కలు పెట్టి వదిలేశారు. శిస్తు కట్ట లేని రైతులు సర్వేకు విముఖత చూపడంతో ఆ భూములు ఎవరివో రికార్డుల్లో నమోదు కాలేదు. ఇక ఆ తర్వాత మళ్లీ సర్వే జరగలేదు. రికార్డులు అలా చుక్కలతోనే ఉండడంతో వాటిని చుక్కల భూములుగా వ్యవహరిస్తున్నారు. -
AP: భూ వివాదాలకు చెక్
సాక్షి, రాజమహేంద్రవరం: భూ వివాదాల శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్ జగనన్న భూహక్కు, భూరక్ష’ పథకం కింద మూడు దశల్లో భూముల సమగ్ర సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. తద్వారా భూ సంబంధిత సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా తొలి దశ సర్వే ప్రక్రియను అధికార యంత్రాంగం చేపట్టింది. అప్పట్లో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి, శాశ్వత భూహక్కు పత్రాలు సైతం పంపిణీ చేసింది. ప్రస్తుతం రెండో దశ సర్వే జిల్లాలో యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. రెండో దశ 50 శాతం పూర్తి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 272 గ్రామాల పరిధిలోని 16,52,706 ఎకరాల్లో వివిధ దశల్లో రీసర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. తొలి దశలో 44 గ్రామాల్లోని 64,336 ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. రెండో దశలో జిల్లా వ్యాప్తంగా 17 గ్రామాలను ఎంపిక చేశారు. మొత్తం 47,189.2 ఎకరాల రీసర్వేకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 10 గ్రామాల్లోని 22,223.91 ఎకరాల్లో సర్వే పూర్తి చేసి, సుమారు 50 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. మిగిలిన 7 గ్రామాల పరిధిలోని 24,965.78 ఎకరాల్లో సైతం త్వరితగతిన పూర్తి చేయనున్నారు. ఈ నెలాఖరుకు లక్ష్యాన్ని అధిగమించాల్సి ఉండగా.. కొన్ని సమస్యల కారణంగా మార్చి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. పకడ్బందీగా.. రెండో దశ రీసర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భూములు, నివాస గృహాలు, వీధులు, ప్రైవేటు భూములు, పరిశ్రమలు.. ఇలా గ్రామానికి చెందిన మొత్తం విస్తీర్ణాన్ని సర్వే చేస్తున్నారు. తొలుత గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్ పూర్తి చేస్తున్నారు. సర్వే చేస్తున్న గ్రామానికి పొరుగున ఉన్న వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతి గట్టూ తిరిగి సరిహద్దులు నిర్ధారిస్తున్నారు. ఫలితంగా సమయం అవుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రీసర్వేలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్ నెట్వర్క్ సాయంతో ఈ ప్రక్రియ సాగుతోంది. చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద కమతాల వరకూ ప్రతీది నమోదు చేస్తున్నారు. డ్రోన్లను రంగంలోకి దింపి సర్వేలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. మొదటి రెండు దశల్లో ఇప్పటి వరకూ 1,474.629 చదరపు కిలోమీటర్ల మేర డ్రోన్లతో సర్వే నిర్వహించారు. హద్దు రాళ్లు సర్వే పూర్తయిన రెవెన్యూ గ్రామాల పరిధిలో ఫ్రీజోన్ యాక్టివిటీస్ కింద భూముల హద్దులకు సంప్రదాయ పద్ధతిలో సున్నం మార్కింగ్ చేపట్టారు. రాళ్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. రెండో దశలో 15,113 రాళ్లు పాతాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ 5,522 రాళ్లు పాతారు. కొలిక్కి వస్తున్న వివాదాలు ఈ సర్వే పుణ్యమా అని దశాబ్ద కాలం నాటి భూ వివాదాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. దశాబ్దం క్రితం నిర్వహించిన సర్వేలో 5 శాతం అలవెన్సు అమలు చేశారు. అప్పట్లో చైన్లతో కొలతలు వేయడంతో అటూ ఇటూ భూ విస్తీర్ణంలో 5 % సరిహద్దులు నిర్ణయించారు. ఈ క్రమంలో రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి, భూమి మీద ఉన్న విస్తీర్ణానికి తేడాలు రావడంతో కొందరు రైతులు వాగ్వాదాలకు దిగుతున్నారు. 1906లో నిర్వహించిన సర్వే ఆధారంగా ప్రస్తుతం భూ సంబంధిత లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఒకే సర్వే నంబరుపై పలుమార్లు లావాదేవీలు జరిగాయి. వారసులు పంచుకోవడం, బహుమతిగా ఇవ్వడం, క్రయవిక్రయాలు జరిగినా అందుకు అనుగుణంగా భూమి మీద సబ్ డివిజన్ జరగకపోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. పత్రాల మీద లావాదేవీలు జరిగినా క్షేత్ర స్థాయిలో సర్వే చేయకుండానే నోషనల్ ఖాతాల వల్ల అనేక సమస్యలు మొదలయ్యాయి. తప్పుడు సర్వే నంబర్లతో భూములు రిజిస్ట్రేషన్ కావడం, రిజిస్ట్రేషన్ అయిన భూమికి, వాస్తవంగా భూమి మీద ఉన్న విస్తీర్ణానికి తేడాలు ఉండటం, నిషేధిత భూములు రిజిస్ట్రేషన్ చేయడం వంటి కారణాలతో రెవెన్యూ సమస్యలు నిత్యకృతమయ్యాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం రీసర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాం. వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి, ప్రక్రియ పర్యవేక్షిస్తున్నా. ఎలాంటి లోటుపాట్లకూ తావు లేకుండా పకడ్బందీగా సర్వే చేస్తున్నాం. రెండో దశలో ఇప్పటికే 50 శాతం లక్ష్యాలను అధిగమించాం. మిగిలిన వాటిని సైతం త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం. నిజమైన హక్కుదారుకు న్యాయం చేయాలన్నదే లక్ష్యంగా పని చేస్తున్నాం. – ఎన్.తేజ్‌భరత్, జాయింట్ కలెక్టర్ లక్ష్యాలను అధిగమిస్తాం రెండో దశ రీసర్వే ప్రక్రియ వేగంగా చేపడుతున్నాం. వివాదాల పరిష్కారానికి సలహాలు ఇస్తున్నాం. ఇప్పటికే జిల్లాలోని 22,223.91 ఎకరాల్లో పూర్తి చేశాం. మిగిలినది సైతం త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. – పి.లక్ష్మణరావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జిల్లా అధికారి -
గ్రామస్థాయికి భూముల సర్వే సేవలు
సాక్షి, అమరావతి: భూముల సర్వే సేవలను మండలస్థాయి నుంచి గ్రామస్థాయికి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మండల సర్వేయర్ల చేతిలో ఉన్న ఎఫ్ లైన్ పిటిషన్ల (సరిహద్దు వివాదాలు, హద్దులు–విస్తీర్ణంలో తేడాలు వంటివాటిపై వచ్చే దరఖాస్తులు) బాధ్యతను గ్రామ సర్వేయర్లకు అప్పగించింది. రీ సర్వే నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం ఆ కార్యక్రమం మరింత వేగం పుంజుకోవడానికి, సాధారణంగా సర్వే వ్యవహారాల్లో జరిగే జాప్యాన్ని నివారించడానికి ఎంతో దోహదపడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో తమ భూమికి సంబంధించి హద్దుల్లో ఏమైనా తేడాలు వచ్చినా, విస్తీర్ణంలో తప్పులు చోటుచేసుకున్నా, ఇతరత్రా తమ భూమి గురించి అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్నా భూ యజమానులు సర్వేకోసం దరఖాస్తు చేసుకుంటారు. దీనిని రెవెన్యూ పరిభాషలో ఎఫ్ లైన్ పిటిషన్‌గా పిలుస్తారు. ఇప్పటివరకు ఈ సర్వే బాధ్యతను మండల సర్వేయర్లు నిర్వర్తించేవారు. మండలానికి ఒక్కరే సర్వేయర్ ఉండడం, పిటిషన్లు కుప్పలుతెప్పలుగా వస్తుండడంతో సర్వే తీవ్ర జాప్యమవుతుండేది. భూముల రీ సర్వే సందర్భంగా ఎఫ్ లైన్ పిటిషన్లలో జాప్యాన్ని గుర్తించారు. ఇకపై పిటిషన్లు నేరుగా గ్రామ సర్వేయర్ల లాగిన్‌కు... ఈ నేపథ్యంలో ఆ బాధ్యతను మండల సర్వేయర్ల నుంచి గ్రామ సర్వేయర్లకు బదలాయించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల వెబ్సైట్ ద్వారా వచ్చే ఎఫ్ లైన్ దరఖాస్తులు ఇకపై నేరుగా గ్రామ సర్వేయర్ లాగిన్‌కు చేరతాయి. సర్వేకు నోటీసులు జారీచేయడం, సర్వే నిర్వహించడం, ఆ వివరాలతో నివేదిక తయారు చేసి డిప్యూటీ తహసీల్దార్‌కు పంపడం వంటి పనులన్నీ ఇకపై గ్రామ సర్వేయర్లే చేస్తారు. డిప్యూటీ తహసీల్దార్ ఆ నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డిప్యూటీ తహసీల్దార్ డిజిటల్ లాగిన్ నుంచే సర్వే ఎండార్స్మెంట్ జనరేట్ అవుతుంది. గ్రామ సర్వేయర్లు నిర్వహించే సర్వేపై మండల సర్వేయర్లు మొదటి అప్పిలేట్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఎఫ్ లైన్ పిటిషన్‌తో నిర్వహించే సర్వే సమయాన్ని కూడా 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించారు. ప్రజల చెంతకే.. భూముల సర్వే సేవలు ప్రజలకు చేరువకావడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఉండే మండల సర్వేయర్ల వద్దకు భూయజమానులు వెళ్లాల్సి ఉండేది. ఇకనుంచి తమ గ్రామంలోని సచివాలయంలో పనిచేసే సర్వేయర్లే ఈ పని చేయనున్నారు. దీనిద్వారా సర్వేలో జాప్యం తగ్గడంతోపాటు భూయజమానులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగే పని తప్పుతుంది. భూముల రీ సర్వే సందర్భంగా వచ్చే ఎఫ్ లైన్ పిటిషన్లపైనా ప్రత్యేకదృష్టి పెట్టనున్నారు. ఈ పిటిషన్లను ఇష్టానుసారం తిరస్కరించకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తిరస్కరించిన దరఖాస్తుల్ని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారుల స్థాయిలో పూర్తిగా పరిశీలించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ ఆదేశాలిచ్చారు. -
మరింత వేగంగా రీ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేను మరింత వేగవంతం చేయనుంది. ఇందు కోసం కొత్తగా మరో 10 డ్రోన్లు కొనుగోలు చేసింది. విటాల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి టెండర్ల ద్వారా సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ ఈ డ్రోన్లు కొనుగోలు చేసింది. ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియా, కొన్ని ప్రైవేటు డ్రోన్ ఏజెన్సీలను నియమించుకుని సర్వే చేయిస్తోంది. సర్వేను వేగంగా జరిపేందుకు గతంలో సర్వే శాఖ సొంతంగా 20 డ్రోన్లు కొనుగోలు చేసింది. ఇప్పుడు మరో 10 డ్రోన్లు సమకూర్చుకుంది. వీటి కోసం 20 మంది సర్వేయర్లకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చింది. ప్రభుత్వ సర్వేయర్లనే సర్టిఫైడ్ డ్రోన్ పైలట్లుగా తయారు చేసింది. ఇలా ప్రభుత్వ డ్రోన్లను ప్రభుత్వ సర్వేయర్లే నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. సర్వే ఆఫ్ ఇండియా, ప్రైవేటు ఏజెన్సీల డ్రోన్లతో సమానంగా రాష్ట్ర సర్వే శాఖ డ్రోన్లు కూడా ఇప్పుడు కీలకంగా పని చేస్తున్నాయి. రోజుకు 100 నుంచి 150 చదరపు కిలోమీటర్లలో డ్రోన్ ఫ్లై చేస్తూ సర్వే చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. శీతాకాలం కావడంతో వాతావరణం అనుకూలంగా ఉంటుందని, సర్వే వేగంగా చేయవచ్చని సర్వే సెటిల్మెంట్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
రీ సర్వేలో కీలకంగా సర్వేయర్ల సైన్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన భూముల రీ సర్వేలో గ్రామ సర్వేయర్లు, వార్డు ప్లానింగ్ సెక్రటరీలు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ప్రభుత్వం చురుకైన యువకులకు అన్ని రకాల శిక్షణ ఇప్పించి, వారి ద్వారా ప్రాజెక్టును పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 17,460 రెవెన్యూ గ్రామాలు, 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోని 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న భూములు, ఇళ్లు, ఇతర స్థిరాస్తులను రీ సర్వే చేసి యజమానులకు హక్కు పత్రాలు ఇస్తున్నారు. దీనివల్ల లక్షల్లో పేరుకుపోయిన భూ వివాదాలు పరిష్కారమవుతాయి. అస్తవ్యస్తంగా ఉన్న భూమి రికార్డుల స్వచ్ఛీకరణ జరిగి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వస్తాయి. తొలి విడతగా 2 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయి 8 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు ఇచ్చారు. మిగతా ప్రాంతాల్లో కూడా రీసర్వే విజయవంతంగా జరుగుతోంది. గ్రామ సర్వేయర్లతో కొత్త తరం సమగ్ర రీ సర్వే కోసం వేలాది మంది సర్వేయర్లు అవసరం. ఈ కార్యక్రమం మొదలు పెట్టే నాటికి మండల సర్వేయర్లు మాత్రమే ఉండేవాళ్లు. అదీ కొన్ని మండలాల్లోనే ఉన్నారు. చాలా మండలాల్లో సర్వేయర్లు లేక ఇబ్బంది కలిగేది. ఆ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ సమగ్ర సర్వేకి అక్కరకు వచ్చింది. సచివాలయాల్లో 11,600 మందికిపైగా సర్వేయర్లు నియమితులయ్యారు. పట్టణ ప్రాంతాల్లోని వార్డు సచివాలయాల్లో వార్డు ప్లానింగ్ సెక్రటరీలు 3,300 మందిని ప్రభుత్వం నియమించింది. మొత్తంగా ఈ 14,900 మందిని సమగ్ర సర్వేలో ప్రభుత్వం వినియోగిస్తోంది. వీరందరికీ శిక్షణ ఇచ్చింది ప్రతి రెవెన్యూ డివిజన్ నుంచి ఇద్దరు మండల సర్వేయర్లు, ముగ్గురు గ్రామ సర్వేయర్లను బృందాలుగా ఏర్పాటు చేసి మొత్తం 275 బృందాలకు తొలి దశలో శిక్షణ ఇచ్చింది. వారిద్వారా వివిధ డివిజన్లలోని సర్వేయర్లు, ఇతర ఉద్యోగులకు శిక్షణ ఇప్పించింది. వారిలో 70 శాతం మంది సివిల్ ఇంజినీరింగ్ పట్టభద్రులు కావడంతో సర్వే అంశాలను తేలిగ్గా ఆకళింపు చేసుకున్నారు. ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా కరోనా సమయంలోనూ ఏడాదిన్నరలో 11,187 మందికి శిక్షణ ఇచ్చింది. గ్రామ సర్వేయర్లకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన మూడు రకాల డిపార్ట్మెంటల్ పరీక్షల్లో 94 శాతం మంది ఉత్తీర్ణులవడానికి ఈ శిక్షణ ఉపయోగపడింది. శిక్షణ ఇలా తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్వే అకాడమీ ద్వారా సర్వే సెటిల్మెంట్ శాఖ వీరికి శిక్షణ ఇచ్చింది. ఒక ప్రణాళిక ప్రకారం భూ సర్వేకి సంబంధించి 50కి పైగా అంశాల్లో శిక్షణ ఇచ్చింది. సంప్రదాయ సర్వే విధానాలకు ఆధునిక టెక్నాలజీని జోడించి సిలబస్ రూపొందించింది. కీలకమైన డ్రోన్ పైలట్ సర్వే, డ్రోన్ డెస్టినేషన్ సర్వే కోసం జిల్లాల్లో డ్రోన్ పైలట్, కో పైలట్లు గ్రామ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా మండలాల వారీగా మిగిలిన వారికి ఇవే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 679 మండలాల్లోనూ మండలానికో డ్రోన్ సర్వే ట్రైౖనర్‌ను నియమించారు. వీరి ద్వారానే ప్రస్తుతం డ్రోన్ సర్వే జరుగుతోంది. రీసర్వే విజయవంతంగా జరగడానికి గ్రామ సర్వేయర్లే కారణం సర్వే అకాడమీ ద్వారా ఆధునిక, సాంకేతిక అంశాలపై శిక్షణ ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అవసరమయ్యేలా సంప్రదాయ, ఆధునిక, క్షేత్ర స్థాయి ప్రత్యక్ష సర్వే విధానాలపై శిక్షణ ఇచ్చాం. దీని ఫలితంగా రీ సర్వే విజయవంతంగా జరుగుతోంది. – సీహెచ్వీఎస్ఎన్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్, ఏపీ సర్వే అకాడమీ -
వివాదాస్పద భూమినే.. వివాద రిజిస్టర్లో ఉంచాలి
సాక్షి, అమరావతి: ఏదైనా భూమికి సంబంధించి వివాదం తలెత్తితే.. ఆ భూమిని మాత్రమే వివాద రిజిస్టర్లో ఉంచాలని రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి సంబంధించిన సర్వే నంబర్ మొత్తాన్ని వివాద రిజిస్టర్లో నమోదు చేయొద్దని ఆదేశించింది. ఉదాహరణకు ఒక సర్వే నంబర్లో 10 ఎకరాల భూమి ముగ్గురి పేరు మీద ఉండి.. వారు సబ్ డివిజన్ చేసుకోకుండా దాన్ని సాగు చేస్తున్నారనుకుందాం. వారిలో ఒకరి పేరు మీద ఉన్న భూమిపై వివాదం ఏర్పడితే మొత్తం ఆ సర్వే నంబర్ అంతటినీ వెబ్‌ల్యాండ్‌లోని వివాద రిజిస్టర్లో పెడుతున్నారు. దీంతో వివాదం లేని ఇద్దరి భూమి కూడా వివాదంలోకి వెళ్తోంది. గ్రామాల్లో ఇలాంటి కేసులు చాలా ఉండడంతో రైతులు, భూ యజమానుల నుంచి ఎన్నో ఏళ్లుగా ఆందోళన వ్యక్తమవుతోంది. రీ సర్వే జరుగుతున్న క్రమంలోనూ దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటాల పంపకాలు, అమ్మకాలు, కొనుగోళ్ల తర్వాత సబ్ డివిజన్ చేసుకోకపోవడంతో ఈ సమస్య ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సబ్ డివిజన్ జరగకుండా ఉన్న భూమికి సంబంధించి.. వివాదం ఏర్పడిన భూమి పోర్షన్ వరకే వివాద రిజిస్టర్లో చేర్చాలని, డిజిటల్ సిగ్నేచర్ తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే మొత్తం సర్వే నంబర్‌ను వివాద రిజిస్టర్లో పెట్టిన కేసులపై తహశీల్దార్లు వెంటనే స్పందించి.. పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. కలెక్టర్లు కూడా దీనిపై ఆర్డీఓలు, తహశీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చి అమలయ్యేలా చూడాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. -
ఆరు నెలలు.. 4 వేల గ్రామాలు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మే నెలాఖరు నాటికి మరో 4 వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తి చేసి భూ హక్కు పత్రాలను జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్, సర్వే, సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ కమిషనర్ సిద్ధార్థజైన్, ఇతర అధికారులతో ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించి లక్ష్యాలను నిర్దేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్దేశించిన విధంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి 2 వేల గ్రామాలు, మే నాటికి మరో 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి భూ హక్కు పత్రాలు జారీ చేయాలని కలెక్టర్లకు నిర్దేశించారు. ఇటీవలే 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి 8 లక్షల మంది భూయజమానులకు హక్కు పత్రాలు జారీ చేసే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో వచ్చే 6 నెలల్లో 4 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాలు జారీ చేసేందుకు అధికారులు చర్యటు చేపట్టారు. తక్షణ పరిష్కారమే లక్ష్యంగా రీ సర్వే చేసే క్రమంలో జారీ చేసే నోటీసుల ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో బైపాస్ చేయకూడదని కలెక్టర్లకు సీసీఎల్ఏ సాయిప్రసాద్ స్పష్టం చేశారు. నోటీసులు జారీ చేసే ప్రక్రియలో గ్రామ కార్యదర్శి, వీఆర్వో సహా గ్రామ సచివాలయ బృందం మొత్తం భాగస్వామ్యం కావాలని సూచించారు. సరైన సమాచారం లేని కారణంగా భూ హక్కు పత్రాలు జారీ కాని కేసులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పట్టాదారు మృతి చెందడం, ఖాతా నంబర్, పాత సర్వే నంబర్ తప్పుకావడం, విస్తీర్ణం సరిపోకపోవడం వంటి కారణాలతో ఆగిపోయిన పత్రాల జారీ కోసం వెంటనే చర్యలు తీసుకుని పత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే జారీ చేసిన భూ హక్కు పత్రాల్లో దొర్లిన తప్పుల్ని సరిచేసే వెబ్‌ల్యాండ్–2 వ్యవస్థ ఈ నెల రెండో వారానికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తుది ఆర్ఓఆర్లో కూడా తప్పుల్ని సరి చేసుకునేందుకు ఉన్న అవకాశాల గురించి ప్రజలకు తెలిసేలా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతినెలా రీ సర్వేపై తహసీల్దార్లు, మొబైల్ మెజిస్ట్రేట్లు, ఇతర రెవెన్యూ అధికారులకు కలెక్టర్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ముఖ్యమైన అంశాలను వివరించాలని ఆదేశించారు. వచ్చే 2, 3 నెలల్లో రాష్ట్రంలోని 17,460 గ్రామాల్లోనూ రికార్డుల స్వచ్ఛీకరణను పూర్తి చేయాలని సూచించారు. -
రైతుల హక్కుకు మరింత భద్రత
రైతులు సబ్ డివిజన్‌కు దరఖాస్తు చేసుకుంటే, ఆ పని ఎప్పటికి అవుతుంది? వారు ఎంత శ్రమ పడాలి? ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరగాలి? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పటి దాకా నిర్దిష్ట సమాధానం లేదు. ఇకపై భూముల రీ సర్వే ద్వారా ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎవరైనా చెబుతారు. సాక్షి, అమరావతి: వంద కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా 92 వేల మంది రైతుల పేర్లు భూముల రీ సర్వే ద్వారా కొత్తగా రెవెన్యూ రికార్డుల్లో నమోదయ్యాయి. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా వచ్చిన ఫలితమిది. భూమి వారిదైనా, ఆ భూమిని వారే సాగు చేసుకుంటున్నప్పటకీ రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటి వరకు వారి పేర్లు లేవు. ఇలాంటి 92 వేల మంది అడక్కుండానే, వారి భూములను ప్రభుత్వం రీ సర్వే చేసి, వారి పేర్లను రికార్డుల్లోకి ఎక్కించింది. ఆ భూముల్లో హద్దు రాళ్లు పాతించి, భూ హక్కు పత్రాలిచ్చింది. రీ సర్వే ఎందుకని ప్రశ్నిస్తున్న వారికి ఇదే చక్కటి సమాధానం. మామూలుగా అయితే ఇది సాధ్యమా? సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో 2 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. 4.3 లక్షల సబ్ డివిజన్లు జరిగాయి. అంటే సుమారు 6.5 లక్షల రెవెన్యూ అంశాలు పరిష్కారమయ్యాయి. ఇవి కాకుండా ఈ గ్రామాల్లో 10 వేలకు పైగా వివాదాలను మొబైల్ మెజిస్ట్రేట్లు పరిష్కరించారు. అలాంటిది 17 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తయితే లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా 47,276 చదరపు కిలోమీటర్ల మేర సర్వే చేశారు. 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశలు పూర్తయింది. అందులో 1,835 గ్రామాలకు సంబంధించిన 7,29,381 మంది రైతుల భూ హక్కు పత్రాలు జారీ అయ్యాయి. అడుగడుగునా రైతుల భాగస్వామ్యం సర్వే పూర్తయి ఆర్ఓఆర్ జారీ అయ్యాక కూడా తప్పులుంటే రైతులు అప్పీల్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. – జి.సాయిప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్, -
రీ సర్వేతో భూ సమస్యలకు చెక్
భూ రికార్డులు సరిగా లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో చూస్తున్నాం. 80–90 శాతం సివిల్ కేసులన్నీ కేవలం భూ వివాదాలవే. మనం కష్టపడి సంపాదించిన ఆస్తిని మన పిల్లలకు ఇవ్వాలనుకుంటాం. తీరా మన పిల్లలకు ఇచ్చే సమయానికి గద్దల్లా వేరెవరో తస్కరిస్తే.. ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచించడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను పూర్తిగా మార్చేందుకే సమగ్ర భూ సర్వే దిశగా వేగంగా అడుగులు వేశాం. తద్వారా ఎలాంటి సివిల్ వివాదాలకు, లంచాలకు, కబ్జాలకు తావు లేకుండా చేస్తాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రైతుల భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అలుపెరగకుండా, ఖర్చుకు వెనకాడకుండా, అత్యంత సాంకేతికంగా, శాస్త్రీయ పద్ధతిలో భూముల రీసర్వే చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. తద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. భూముల రీ సర్వేను 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని, సర్వే పూర్తయితే తమ భూముల విషయంలో రైతులు ధైర్యంగా ఉండవచ్చని, అక్రమాలకు అవకాశమే ఉండదని స్పష్టం చేశారు. సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పని చేస్తుందని, గత మూడున్నరేళ్ల కాలంలో విప్లవాత్మక మార్పులు ఎన్నో తీసుకొచ్చామని చెప్పారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చేపట్టారు. అక్కడే రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం భూముల సమగ్ర రీ సర్వే, భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం మొదలైందన్నారు. రాష్ట్రంలో 17,584 రెవెన్యూ గ్రామాలుంటే.. అందులో తొలి దశలో 2 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయడమే కాకుండా 7,92,238 మంది రైతుల భూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేసి, భూ హక్కు పత్రాలను అందజేసే భారీ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. మరో 15 రోజుల్లో మొదటి దశలోని 2 వేల గ్రామాల రైతులందరికీ భూ హక్కు పత్రాలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నరసన్నపేట బహిరంగ సభకు హాజరైన జనసందోహంలోని ఓ భాగం దశల వారీగా భూ హక్కు పత్రాలు ► 2023 ఫిబ్రవరి నాటికి రెండో దశ పూర్తి చేస్తాం. అంటే మరో నాలుగు నెలల్లో ఇంకో నాలుగు వేల గ్రామాలకు సంబంధించిన రైతులందరికీ వాళ్ల భూ హక్కు పత్రాలు వాళ్ల చేతుల్లో పెడతాం. ఆ తర్వాత మరో నాలుగు నెలల్లో మూడో దశలో ఆరు వేల గ్రామాల్లో, పట్టణాల్లో సర్వే పూర్తి చేసి, భూ యజమానులకు 2023 మే నాటికి భూ హక్కు పత్రాలు అందజేస్తాం. ► 2023 ఆగస్టు నాటికి మరో 9 వేల గ్రామాలు, పట్టణాలకు సంబంధించి సర్వే పూర్తి చేస్తాం. ఐదో దశలో మిగతా గ్రామాలు, పట్టణాలతో కలిపి మొత్తంగా 17,584 రెవెన్యూ గ్రామాల్లో, పట్టణాల్లో భూములన్నింటినీ సమగ్ర సర్వే చేసి, రికార్డులను ప్రక్షాళన చేసి.. 2023 డిసెంబర్ నాటికి భూ హక్కు పత్రాలను అందజేస్తాం. ప్రతి కమతానికి యూనిక్ నంబర్ ► ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా భూములన్నింటినీ పూర్తిగా కొలతలు వేసి అది ఎక్కడుందో.. లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా మార్కింగ్ చేయడమే కాకుండా ప్రతి ఒక కమతానికి ఒక నిర్దిష్టమైన యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను ఈ సర్వే ద్వారా ఇస్తారు. ప్రతి కమతానికి డిజిటల్‌గా, ఫిజికల్‌గా దాన్ని నిర్ణయించి, క్యూ ఆర్ కోడ్‌తో ల్యాండ్ మ్యాపింగ్ చేస్తాం. ► ఆ భూమికి సరిహద్దు రాళ్లు కూడా పెడుతున్నాం. ఆ తర్వాత రైతుకు ప్రభుత్వ పరంగా సర్వ హక్కులతో కూడిన భూ హక్కు పత్రాలను ప్రక్షాళన చేసి వారి చేతికి ఇవ్వబోతున్నాం. దీంతో తమ భూములను ఎవరైనా ఆక్రమించుకుంటారనే భయం పూర్తిగా తొలగిపోతుంది. డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి. లంచాలకు అవకాశం లేకుండా పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. ఇదంతా మహా యజ్ఞంలా సాగుతోంది. ► భూ కమతం ఒక సర్వే నంబర్ కింద ఉండి, కాలక్రమంలో విభజన జరిగినా.. మారినా కూడా సర్వే రికార్డులు అప్డేట్ కాకపోవడం వల్ల వస్తున్న వివాదాలన్నింటికి పూర్తిగా చెక్ పెట్టినట్లు అవుతుంది. జానెడు భూమిలో కూడా తప్పు జరగకుండా.. ► జానెడు భూమిలో కూడా తప్పు జరగకుండా సర్వే చేయిస్తున్నాం. 10,185 మంది గ్రామ సర్వేయర్లు (గ్రామ, వార్డు సచివాలయాల్లో కలిపి 13,849 మంది), 3,664 వార్డు ప్లానింగ్ సెక్రటరీలు, రూ.1000 కోట్ల వ్యయం, 4,500 సర్వే బృందాలు, ఎయిర్ క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, 80 డ్రోన్లు, 2 వేల గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ అంటే జీఎన్ఎస్ఎస్ రోవర్లను వినియోగిస్తున్నాం. వీటితో పాటు ప్రత్యేకంగా 75 కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ బేస్‌లు అంటే కోర్స్ బేస్‌లు ఏర్పాటు చేశాం. ► రాష్ట్ర వ్యాప్తంగా 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో 1.07 కోట్ల మంది రైతులు, 2.47 కోట్ల సర్వే నంబర్లకు సంబంధించి 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూముల్లో సర్వే జరుగుతుంది. మరో 13,371 గ్రామ కమతాల్లో 85 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, 123 పట్టణ ప్రాంతాల్లో 40 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు సంబంధించి కూడా సర్వే జరుగుతుంది. ► సర్వే చేయడమే కాకుండా ఆ భూములకు సంబంధించిన సబ్ డివిజన్లు, మ్యుటేషన్లు, ఇతర సమస్యల పరిష్కారం, యాజమాన్య పత్రాల జారీ వంటి కార్యక్రమాలన్నీ గతంలో ఎన్నడూ, ఎక్కడా జరగని విధంగా ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సేవలు కూడా గ్రామ సచివాలయాల్లోనే జరిగేలా మార్పులు తీసుకొస్తున్నాం. ► ఇక మీదట సరిహద్దులు మార్కింగ్ చేసి, ఫీల్డ్ లైన్ దరఖాస్తులన్నీ 15 రోజుల టైమ్ ఇచ్చి కచ్చితంగా పూర్తి చేయాలి. పట్టా సబ్‌డివిజన్, మ్యుటేషన్ దరఖాస్తులన్నీ 30 రోజుల్లో పరిష్కారమయ్యేలా ఎల్‌ఓపీలు తీసుకొచ్చాం. దీనివల్ల ఎవరూ లంచాలడిగే పరిస్థితి ఉండదు. మ్యుటేషన్ సేవలను ఉచితంగా అందిస్తాం. ఇప్పటిదాకా సర్వే జరిగిందిలా.. ► 100 ఏళ్ల తర్వాత చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో 17వేలకు పై చిలుకు రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో 47,276 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికే డ్రోన్ ఫ్లయింగ్ పూర్తయ్యింది. ఈ రోజు (బుధవారం) వరకు 2 వేల గ్రామాల్లో సమగ్ర రీసర్వేతో పాటు భూ పట్టాల ప్రక్షాళన, మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ మేరకు రైతులకు 7,92,238 భూ హక్కు పత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరో 15 రోజుల పాటు ఈ 2 వేల గ్రామాల్లో వీటి పంపిణీ జరుగుతుంది. ► రీ సర్వే వల్ల ఈ 9 నెలల్లోనే 4 వేల గ్రామాల్లో 4.3 లక్షల సబ్ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లకు సంబంధించిన సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. గతంలో సంవత్సరానికి 35 వేల సబ్ డివిజన్ల దరఖాస్తులు మాత్రమే వచ్చేవి. కేవలం 21 వేలు మాత్రమే సబ్ డివిజన్ జరిగేవి. ఈ లెక్కన ఏటా 21 వేలు మాత్రమే సబ్ డివిజన్లు జరిగే పరిస్థితి నుంచి.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కేవలం 9 నెలల్లోనే 4.3 లక్షల సబ్ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లు పూర్తి చేసుకున్న మెరుగైన స్థితికి వచ్చాం. ఈ ప్రక్రియలో రూ.30 కోట్ల విలువైన సేవలను వారి చేతిలో ఉచితంగా పెట్టినట్టు అవుతోంది. ఈ మార్పులను ప్రజలు ఒక్కసారి గమనించాలి. మూడేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు ► అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం. 1.3 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున 2 లక్షల 60 వేల మందిని నియమించాం. వలంటీర్లు ప్రతి ఒక్కరినీ చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ► 13 నుంచి 26 జిల్లాలు చేశాం. కుప్పంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 25 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో రాజధాని ఉండటం వల్ల జరిగే మంచికన్నా.. మూడు ప్రాంతాలు కూడా బాగుపడే విధంగా మూడు రాజధానుల్ని ఏర్పాటు చేస్తున్నాం. ► రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. వీటికి అదనంగా మరో 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. ► గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, పాఠశాలల్లో, హాస్టళ్లలో నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ లైబ్రరీలు, మహిళలకు భద్రత కల్పించేలా ‘దిశ’ యాప్, దిశ పోలీస్స్టేషన్లు ఇలా ఎన్నో అమలు చేస్తున్నాం. ► ఇచ్ఛాపురం, పలాస ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలతో బాధపడే ప్రజలు మన కళ్లెదుటే కన్పించేవారు. పాలకులు, వారితో పాటు దత్తపుత్రుడి వేషంలో సినిమా యాక్టరూ వచ్చేవారు. ఐదేళ్లు పరిపాలన చేశారు. అయినా ఇచ్ఛాపురం, పలాసలో ఉన్న కిడ్నీ పేషెంట్లు వారికి గుర్తుకు రాలేదు. ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి కాగానే ఆ ప్రాంతాల్లో రూ.765 కోట్లతో సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి, కిడ్నీ సమస్యలకు పూర్తి పరిష్కారం చూపించేలా అడుగులు వేశాడు. దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. రూ.50 కోట్లతో రీసెర్చ్ ఆస్పత్రిని కడుతున్నాం. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. కిడ్నీ పేషెంట్లకు రూ.10 వేల వరకు పింఛన్ ఇస్తున్నాం. ► ఇంతకుముందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కేవలం 295 మాత్రమే ఉండేవి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 11 వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాలన్నింటినీ కూడా భూములు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా మార్చే ప్రక్రియకు మన ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ శాఖ పరంగా గ్రేడ్–3 విలేజ్ సర్వేయర్లను గ్రేడ్–2గా రీ డిజిగ్నేట్ చేయనున్నాం. ► ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ కుటుంబంతోనే సిక్కోలు ప్రగతి శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసింది వైఎస్ కుటుంబమే. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి.. వందేళ్ల నుంచి ఉన్న భూ సంబంధిత సమస్యలకు రీ సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గత ప్రభుత్వం జిల్లాకు ఏమీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత 23 కేంద్ర సంస్థలు వస్తే ఒక్కటి కూడా శ్రీకాకుళంలో పెట్టలేదు. సీఎం జగన్ వంశధార రిజర్వాయర్‌కు రూ.700 కోట్ల నిధులిచ్చి, ఉద్దానం ప్రాంతంలో తాగునీరు అందించే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కిడ్నీ రోగులను అన్ని విధాలా ఆదుకుంటున్నారు. వంశధార ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సీఎం వైఎస్ జగన్.. ఒడిశా వెళ్లి అక్కడి సీఎంను కలిశారు. గత 15 ఏళ్లలో ఈ పని ఎవరూ చేయలేదు. తెలంగాణలో వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్‌లో ఉండే చంద్రబాబుకు విశాఖ పాలన రాజధాని కావడం ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన ఇక్కడకు వచ్చి అదే మాట చెబితే ప్రజలే తగిన సమాధానమిస్తారు. – ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ శాఖ మంత్రి ఆనందంగా ఉంది మా గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తయ్యింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా భూ హక్కు పత్రాలు వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎప్పుడూ మేం ఇలాంటివి చూడలేదు. ఈ సర్వేతో భూ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. – రౌతు పోలయ్య, సంతలక్ష్మీపురం, పోలాకి మండలం నా చేతికి హక్కు పత్రం నాకు కరగాం పంచాయతీలో 40 సెంట్ల భూమి ఉంది. నోషనల్ ఖాతాలో ఉండిపోవడంతో ఇన్నాళ్లూ పాస్ బుక్ రాలేదు. ఎలాంటి హక్కులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు గ్రామంలో రీ సర్వే పూర్తయింది. నోషనల్ ఖాతాల్లో ఉన్న భూమిని నా పేరున మార్చి భూ హక్కు పత్రం ఇచ్చారు. ఇది ఈ రోజు సీఎం చేతుల మీదుగా తీసుకోవడం ఆనందంగా ఉంది. – పాగోటి దమయంతి, కంబకాయ, నరసన్నపేట మండలం వేగంగా రిజిస్ట్రేషన్ నా ఇంటి స్థలాన్ని కరగాం సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాను. ఇతరుల వద్ద కొనుగోలు చేసిన ఈ స్థలం రిజిస్ట్రేషన్ నరసన్నపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేయించేందుకు ప్రయత్నించాను. అయితే గ్రామ సచివాలయంలో కూడా చేస్తారని తెలియడంతో అక్కడికే వెళ్లి చేయించుకున్నాను. వివరాలన్నీ తెలుసుకుని శ్రమ లేకుండా, అదనపు ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ పత్రాలు సీఎం చేతుల మీదుగా ఈ రోజు తీసుకున్నాను. ఆనందంగా ఉంది. – వెలమల శ్రీదేవి, నారాయణవలస, నరసన్నపేట మండలం -
1,940 గ్రామాల్లో రీ సర్వే పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూరక్ష, శాశ్వత భూహక్కు పేరుతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న భూముల రీ సర్వే 1,940 గ్రామాల్లో పూర్తయింది. ఈ గ్రామాల్లో 17 లక్షల 25 వేల 690 ఎకరాలను పూర్తిగా కొలిచి సర్వే పూర్తిచేశారు. ఆ గ్రామాల్లో సర్వే పూర్తికి సంబంధించిన నంబర్ 13 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ గ్రామాలకు కొత్త రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి రానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 351 గ్రామాల్లో రీ సర్వే పూర్తిచేశారు. విజయనగరం జిల్లాలో 181, అనకాపల్లిలో 143, చిత్తూరులో 125, కాకినాడలో 121, నెల్లూరు జిల్లాలో 118 గ్రామాల్లో భూముల కొలత పూర్తయింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా రెండుగ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి చేయగలిగారు. ఆ జిల్లాలో వ్యవసాయ భూములు కొండలు, గుట్టల్లో ఉండడం, మొబైల్ సిగ్నల్స్ అందకపోవడంతో డ్రోన్ల ద్వారా సర్వేచేయడం ఇబ్బందికరంగా మారింది. అందుకే అక్కడ త్వరలో డీజీపీఎస్ సర్వే చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఐదుగ్రామాలు, నంద్యాల జిల్లాలో 11, ఎన్టీఆర్ జిల్లాలో 14, పశ్చిమగోదావరి జిల్లాలో 16 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయింది. ఇక్కడా డీజీపీఎస్, ఏరియల్ సర్వేకి ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో 1,329 గ్రామాల్లో పూర్తికానున్న సర్వే త్వరలో మరో 1,329 గ్రామాల్లో రీ సర్వే పూర్తికానుంది. కొద్దిరోజుల్లోనే ఈ గ్రామాలకు సంబంధించిన 13 నంబర్ నోటిఫికేషన్లు జారీచేయనున్నారు. రీ సర్వేకి సంబంధించి రైతులు, భూ యజమానుల నుంచి 18,387 వినతులు, అభ్యంతరాలు వచ్చాయి. వాటిలో 18,277 వినతులను మొబైల్ మేజిస్ట్రేట్ బృందాలు పరిష్కరించాయి. ఇప్పటివరకు 6,533 గ్రామాల్లో డ్రోన్‌సర్వే పూర్తయింది. అందులో 3,258 గ్రామాలకు సంబంధించి అభివృద్ధి చేసిన డ్రోన్ ఛాయాచిత్రాలను సర్వే బృందాలకు అందించారు. వాటి ఆధారంగా 2,273 గ్రామాల్లో క్షేత్రస్థాయి నిజనిర్ధారణ (గ్రౌండ్ ట్రూతింగ్) పూర్తయింది. 2,022 గ్రామాల్లో గ్రౌండ్ వ్యాలిడేషన్ (హద్దుల నిర్దారణ) పూర్తిచేశారు. విభాగాల వారీగా రీ సర్వేను అనుకున్న దానికంటె వేగంగా నిర్వహిస్తున్నట్లు సర్వే, సెటిల్మెంట్ అధికారులు చెబుతున్నారు. -
ఏపీ: ఎవరూ వేలెత్తి చూపకుండా సంపూర్ణ భూసర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల రీ సర్వే మహాయజ్ఞం ఫలాలు ప్రజలకు పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. సర్వేలో నాణ్యత చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఒక గ్రామంలో రీ సర్వే చేసిన తర్వాత తమదైన ముద్రతో అన్ని రకాలుగా ఈ ప్రక్రియను ముగించాలన్నారు. భూ వివాదాలు, తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావడమే రీసర్వే లక్ష్యమన్నారు. సర్వే ఎక్కడా అసంపూర్తిగా మిగిలిపోయిందన్న మాటే రాకూడదన్నారు. ప్రజలను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచేలా, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపేలా రీసర్వే ఉండాలని స్పష్టం చేశారు. అప్పుడే ఈ బృహత్తర కార్యక్రమానికి సార్థకత లభిస్తుందన్నారు. సర్వేతో రెవెన్యూ వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రక్షాళన కావడంతోపాటు రికార్డులు, డేటా స్వచ్ఛీకరణ జరుగుతుందని తెలిపారు. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష’ పథకంపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం జగన్ సర్వే ప్రక్రియకు సంబంధించి కీలక సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ప్రణాళికాబద్ధంగా.. రీససర్వేలో నాణ్యత చాలా ముఖ్యం. ఈ మహాయజ్ఞం ఫలాలు ప్రజలకు సంపూర్ణంగా అందాలి. ఎక్కడా కూడా సర్వే అసంపూర్తిగా మిగిలిపోయిందన్న మాట రాకూడదు. మొబైల్ ట్రిబ్యునళ్లు, సరిహద్దులు, సబ్డివిజన్లు.. ఇవన్నీ చాలా క్రమ పద్ధతిలో ముందుకు సాగాలి. సర్వే చేస్తున్నప్పుడు ఉత్పన్నమైన సమస్యలను అత్యంత ప్రణాళికా బద్ధంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ సర్వే ద్వారా రెవెన్యూ వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రక్షాళన అవుతుంది. రికార్డులు, డేటా స్వచ్ఛీకరణ జరుగుతుంది. ఈ అంశాలను అధికారులు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. వేలెత్తి చూపలేని విధంగా.. రీ సర్వే ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని కొంతమంది పనిగట్టుకుని ఈ కార్యక్రమంపై దుష్ఫ్రచారం చేస్తున్నారు. అపోహలు సృష్టించేలా వ్యవరిస్తున్నారు. తద్వారా ఈ గొప్ప ప్రయత్నాన్ని నీరుగార్చి విశ్వసనీయతను దెబ్బతీసే యత్నాలు చేస్తున్నారు. 100 ఏళ్ల తర్వాత భూముల రీ సర్వే చేస్తున్నాం. దీనికోసం కొన్ని వేల మందిని నియమించి రూ.కోట్లు వెచ్చించి అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేశాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా సర్వే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దోషాలు, తప్పులతో ఒక్క హక్కు పత్రం కూడా రైతులకు వెళ్లకూడదు. సర్వే పూర్తైన ప్రతి గ్రామంలో 5 శాతం రికార్డులను ఆర్డీవోలు, ఒక శాతాన్ని జేసీలు వెరిఫికేషన్ చేయాలి. అది పూర్తైన తరువాతే హక్కు పత్రాలను జారీ చేయాలి. గ్రామ సచివాలయంలో సర్వే పూర్తి కాగానే అక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు కావాలి. పై అధికారులు గ్రామాలను సందర్శించడం వల్ల అందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తారు. సిబ్బందిలో జవాబుదారీతనం పెరుగుతుంది. అర్బన్‌లో జనవరి నుంచి.. పట్టణ ప్రాంతాల్లో సర్వే ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో 15,02,392 ఎకరాల్లో చేపట్టే సర్వేలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సర్వే పూర్తైన తర్వాత ఇక్కడ కూడా పత్రాల వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు. వచ్చే జనవరిలో సర్వే ప్రక్రియ ప్రారంభించి మే నెల నుంచి హక్కు పత్రాల పంపిణీ ప్రారంభమయ్యేలా ముందుకు సాగుతామని అధికారులు తెలిపారు. 2023 ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. కచ్చితమైన విధానాలతో.. భూ యజమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా సర్వే జరుగుతోందని సమీక్షలో ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. పక్కా మార్గదర్శకాలతో తప్పులు, పొరపాట్లు లేని విధంగా హక్కు పత్రాలు జారీ చేస్తామన్నారు. సర్వే ప్రక్రియలో ఏ దశలో అభ్యంతరాలు వ్యక్తమైనా పరిష్కరించే వ్యవస్థలను బలోపేతం చేస్తామని చెప్పారు. సమగ్ర సర్వే ద్వారా భూ యజమానుల హక్కులను తరతరాలు కాపాడటంతోపాటు ఆక్రమణలు, కబ్జాలు, రికార్డుల్లో అవకతవకలు లాంటి వాటికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడుతుందన్నారు. కేవలం 5 సెంటీమీటర్ల వ్యత్యాసంతో కచ్చితమైన పద్ధతుల్లో సర్వే జరుగుతుందన్నారు. ఇప్పటివరకూ 6,037 గ్రామాల్లో డ్రోన్లు ఎగరవేశామని, ఇందులో 1,545 గ్రామాల్లో రెవిన్యూ రికార్డులు కూడా ఖరారయ్యాయని తెలిపారు. ప్రతి నెలా 13,335 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని లక్ష్యంగా చేసుకుని సర్వే చేస్తున్నామని వివరించారు. డ్రోన్లు ఎగరవేయడానికి అనువుగాలేని ప్రాంతాల్లో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా సర్వే చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యామన్నారు. నవంబర్ మొదటి వారంలో తొలివిడత గ్రామాల్లో హక్కు పత్రాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. సమీక్షలో విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూ శాఖ (సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్) కమిషనర్ సిద్దార్ధ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఐజీ వి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
క్యూఆర్ కోడ్‌లో భూమి
సాక్షి, అమరావతి: బ్రిటీష్ కాలం నాటి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి వివాదాలకు శాశ్వతంగా తెరదించే లక్ష్యంతో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా భూముల రీ సర్వే కార్యక్రమాన్ని శరవేగంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ముద్రించనుంది. దీన్ని స్కాన్ చేయడం ద్వారా భూ కమతం, విస్తీర్ణం, ఎలాంటి భూమి, మ్యాప్ తదితర వివరాలన్నీ తెలుసుకోవచ్చు. రీ సర్వేలో ఆక్షాంశాలు, రేఖాంశాలతో (జియో కో–ఆర్డినేట్స్) భూమి హద్దులను నిర్ధారిస్తున్నారు. భూమికి నలువైపులా వీటిని సూచించడం ద్వారా విస్తీర్ణాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు. వీటి ఆధారంగా రైతుల పట్టాదార్ పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు. ప్రస్తుతం ఒక సర్వే నంబర్‌కి ఒక ఎఫ్ఎంబీ ఉండగా, నలుగురైదుగురు భూ యజమానులుంటే ఉమ్మడిగా ఒక మ్యాప్ కేటాయిస్తున్నారు. రీ సర్వే తర్వాత ప్రతి భూమిని (సెంటు భూమి విడిగా ఉన్నా సరే) సర్వే చేసి ప్రత్యేకంగా రాళ్లు పాతుతారు. దానికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ఇస్తారు. ఆ సర్వే నంబర్లో ఎంత మంది ఉంటే అందరి మ్యాప్‌లు విడివిడిగా పొందుపరుస్తారు. ప్రతి భూ యజమానికి తమ భూములపై ఎవరూ సవాల్ చేయడానికి వీలు లేని శాశ్వత హక్కులు లభిస్తాయి. 70 బేస్ స్టేషన్లతో కార్స్ నెట్వర్క్ జీపీఎస్ కార్స్ నెట్వర్క్ (కంటిన్యుస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ నెట్వర్క్) ద్వారా భూములను కొలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 బేస్ స్టేషన్లు శాటిలైట్ రేడియో సిగ్నళ్లను స్వీకరించి కచ్చితమైన అక్షాంశ, రేఖాంశాలను సెంట్రల్ కంట్రోల్ స్టేషన్‌కు పంపుతాయి. కార్స్, డ్రోన్, రోవర్ సహాయంతో భూములను కచ్చితంగా కొలుస్తారు. తద్వారా ప్రతి స్థిరాస్తి కొల తలు, హద్దులు, విస్తీర్ణం, భూ కమత పటం ల్యాండ్ రిజిస్టర్లో డిజిటల్ రూపంలో నమోదవుతాయి. వీటితో మ్యాప్‌లో క్యూఆర్ కోడ్ రూపంలో పొందుపరుస్తారు. నకిలీలు, ట్యాంపరింగ్‌కు తెర ప్రతి భూమికి (ల్యాండ్ పార్సిల్) ఒక విశిష్ట సంఖ్య కేటాయించి భూమి వివరాలతోపాటు భూ యజమాని ఆధార్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ సేకరించి భూ రికార్డులో భద్రపరుస్తారు. భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. డూప్లికేట్ రికార్డులు, ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు. ఆయా భూముల క్రయ విక్రయాలు జరిగిన వెంటనే రికార్డుల్లో ఆటోమేటిక్‌గా మారిపోతాయి. తద్వారా భూ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ ఆధారిత భూ సమాచార వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీనిద్వారా ఎవరైనా తమ భూమిని మ్యాప్‌తో సహా చూసుకోవడానికి వీలుంటుంది. సర్వేతో ఇవీ ప్రయోజనాలు.. ► ప్రతి ఆస్థికి యజమాని గుర్తింపు ► రికార్డుల్లో పదిలంగా ఆస్తి హక్కులు ► ఆ ఆస్తిని మరొకరు ఇతరులకు విక్రయించే అవకాశం ఉండదు ► పకడ్బందీగా హద్దులు, కొలతలు ► క్షేత్రస్థాయిలో భూమి ఏ ఆకారంలో ఉందో రికార్డుల్లో అలాగే ఉంటుంది ► ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఆస్తి వివరాలు తెలుసుకోవచ్చు ► హద్దు రాళ్లు తొలగించినా, గట్టు తెగ్గొట్టినా మీ ఆస్తి డిజిటల్ రికార్డుల్లో భద్రంగా ఉంటుంది. ► భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం, సంపూర్ణ హక్కుతో ఉంటుంది. సంపూర్ణ హక్కులు, రక్షణే లక్ష్యం స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా భూముల రీ సర్వే నిర్వహిస్తున్నాం. రీ సర్వేతో అస్తవ్యస్థంగా ఉన్న రికార్డుల ప్రక్షాళన జరుగుతుంది. వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం డిజిటల్ రికార్డులు తయారవుతాయి. దళారీ వ్యవస్థకు ఆస్కారం ఉండదు. ప్రస్తుతం సర్వే నెంబర్ల వారీగా హద్దు రాళ్లు లేకపోవడంతో సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నాయి. రీ సర్వేలో ప్రతి సర్వే నెంబరును ఉచితంగా సర్వే చేస్తున్నాం. వైఎస్సార్ జగనన్న హద్దురాళ్లు ఏర్పాటు చేస్తాం. ప్రతి భూమిపై సంబంధిత యజమానికి సంపూర్ణ హక్కు, రక్షణ కల్పించడమే రీ సర్వే ఉద్దేశం. – సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ -
6 జిల్లాల్లో జగనన్న భూరక్ష సర్వే ఫోర్స్
సాక్షి, అమరావతి: భూముల రీసర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం జగనన్న భూరక్ష సర్వే ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆరు జిల్లాల్లో 2,225 బృందాలను ఏర్పాటు చేసింది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ బృందాలు పనిచేస్తున్నాయి. ఈ జిల్లాల పరిధిలో భూమి ఎక్కువ ఉంది. సర్వేకు ఎక్కువ మంది సిబ్బంది అవసరం ఉండడంతో ఈ బృందాలను నియమించారు. అవసరం మేరకు ఈ జిల్లాల్లోని కొందరిని డిప్యూటేషన్‌పై పక్క జిల్లాల బృందాల్లో నియమించారు. ప్రతి బృందంలో ఇద్దరు గ్రామ సర్వేయర్లు, ఒక వీఆర్వో, ఒక వీఆర్ఏ ఉంటారు. ఈ బృందం ప్రతిరోజూ 20 నుంచి 30 ఎకరాల్లో క్షేత్ర స్థాయి సర్వే చేయాలి. రోజుకు 50 వేల ఎకరాల సర్వే ఈ బృందాల ద్వారానే రోజుకు 50 వేల ఎకరాల సర్వేకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటివరకు ఏ జిల్లాల పరిధిలోని ఉద్యోగులతో ఆ జిల్లాల్లోనే సర్వే చేయించారు. సర్వే జరిగే గ్రామంలో 20 నుంచి 30 మంది సర్వేయర్లు, ఒక వీఆర్వో, ఒక వీఆర్ఏతో కూడిన బృందాన్ని వినియోగించారు. గ్రామంలో క్షేత్ర స్థాయి సర్వే పూర్తయ్యాక మరో గ్రామానికి ఈ బృందాలను పంపుతున్నారు. పక్క మండలాల్లోని సర్వేయర్లను కూడా వినియోగిస్తున్నారు. ఈ బృందాలు కొన్ని నెలలుగా అవిశ్రాంతంగా రీసర్వేలో నిమగ్నమయ్యాయి. ప్రధానంగా గ్రామ సర్వేయర్లే కీలకం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 11,118 గ్రామ సర్వేయర్లను వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. రీసర్వేలో వీరే అత్యంత కీలకంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వారు లేకపోతే రీసర్వే పట్టాలెక్కడం కూడా సాధ్యమయ్యే పని కాదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గ్రామానికి ఒక సర్వేయర్ ఉండాలని ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో వీరిని నియమించింది. ఈ గ్రామ సర్వేయర్లే వైఎస్సార్ జగనన్న భూహక్కు, భూరక్ష పథకానికి వెన్నెముకలా నిలబడ్డారు. వారితోనే వేల బృందాలను నియమించి రీసర్వే చేయిస్తున్నారు. -
4,500 గ్రామాల్లో ఎగిరిన డ్రోన్లు
సాక్షి, అమరావతి: భూముల చరిత్రను తిరగరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వే చురుగ్గా సాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 17,460 గ్రామాల్లోని 1.22 లక్షల చదరపు కిలోమీటర్లకు గాను.. 4,547 గ్రామాల్లోని 25 వేల చదరపు కిలోమీటర్లలో డ్రోన్ సర్వే పూర్తయింది. 22.43 లక్షల ఎకరాల భూములను కొలిచారు. డ్రోన్ల ద్వారా తీసిన ఫొటోలను మెరుగు పరిచి ఇచ్చే ఓఆర్ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్)లు 2,101 గ్రామాలకు సంబంధించినవి సర్వే బృందాలకు అందాయి. ఈ బృందాలు వాటిని, క్షేత్ర స్థాయిలో భూములను పోల్చి చూస్తూ రీ సర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి ఈ జనవరి నాటికి కేవలం 1,118 గ్రామాల్లో మాత్రమే డ్రోన్ సర్వే పూర్తయింది. కరోనా కారణంగా గత సంవత్సరం సుమారు వెయ్యి గ్రామాల్లో మాత్రమే డ్రోన్ సర్వే చేయగలిగారు. కానీ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ నిర్దేశించడం, సీఎం వైఎస్ జగన్ రీ సర్వేపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో 7 నెలల్లో 3,500 గ్రామాల్లో డ్రోన్ సర్వేను పూర్తి చేయగలిగారు. ఇంకా వేగంగా చేసేందుకు డ్రోన్ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నారు. ప్రస్తుతం 20 డ్రోన్లు వినియోగిస్తుండగా, సెప్టెంబర్ నుంచి కొత్తగా మరో 20 డ్రోన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 18 లక్షల ఎకరాల్లో క్షేత్ర స్థాయి నిజ నిర్ధారణ ► డ్రోన్ సర్వే ద్వారా ఇచ్చిన ఓఆర్‌ఐలను సంబంధిత రైతుల సమక్షంలో భూమిపైన సరిహద్దులతో పోల్చి చూసే గ్రౌండ్ ట్రూతింగ్ (క్షేత్ర స్థాయి నిజ నిర్ధారణ) ప్రక్రియ సుమారు 1,600 గ్రామాల్లో పూర్తయింది. ఈ గ్రామాల్లో 18 లక్షలకుపైగా ఎకరాల్లో గ్రౌండ్ ట్రూతింగ్‌ను పూర్తి చేశారు. ► ఈ సంవత్సరం జనవరి నాటికి కేవలం 310 గ్రామాల్లో 2.6 లక్షల ఎకరాల్లో మాత్రమే గ్రౌండ్ ట్రూతింగ్‌ను చేయగలిగారు. కానీ ఆగస్టు నాటికి 1,600 గ్రామాల్లో 18 లక్షల ఎకరాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందంటే సర్వే ఎంత వేగంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. 1,100 గ్రామాల్లో సరిహద్దుల నిర్ధారణ ► గ్రౌండ్ ట్రూతింగ్ తర్వాత చేపట్టే గ్రౌండ్ వాలిడేషన్ (సరిహద్దుల నిర్థారణ) 1,100 గ్రామాల్లో పూర్తయింది. 9 లక్షల ఎకరాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. జనవరి నాటికి 260 గ్రామాల్లో మాత్రమే గ్రౌండ్ వాలిడేషన్ చేశారు. ఆ తర్వాత సర్వే వేగం పుంజుకోవడంతో తక్కువ సమయంలోనే 800 గ్రామాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ► మరోవైపు రీ సర్వే సుమారు వెయ్యి గ్రామాల్లో పూర్తయింది. ఈ గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు 13 నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. ఈ గ్రామాల్లో 8 లక్షల ఎకరాలకు సంబంధించి సర్వే పూర్తవడంతో ఆ గ్రామాల్లో కొత్త భూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. జనవరి నాటికి 110 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి కాగా, ప్రస్తుతం వెయ్యి గ్రామాల్లో పూర్తయింది. ► గ్రౌండ్ వాలిడేషన్ పూర్తయ్యాక ఇప్పటి వరకు రైతులు, భూ యజమానుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల అభ్యంతరాలు వచ్చాయి. మొత్తం 5.50 లక్షలకుపైగా ల్యాండ్ పార్సిల్లో కేవలం 3 శాతం మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. వాటిలో 95 శాతానికిపైగా అభ్యంతరాలను మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు పరిష్కరించాయి. -
విమానాలతో ఏరియల్ సర్వే ద్వారా భూముల కొలత.. దేశంలోనే తొలిసారి
సాక్షి, అమరావతి: వందేళ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భూముల రీ సర్వే చేపట్టిన ప్రభుత్వం దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు దేశంలోనే తొలిసారిగా విమానాలను ఉపయోగించనుంది. ఇప్పటికే డ్రోన్లతో ఆధునిక తరహాలో రీ సర్వే చేయిస్తున్న ప్రభుత్వం.. దాన్ని ఇంకా ఆధునికంగా నిర్వహించేందుకు ఏరియల్ రీ సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం డ్రోన్ల ద్వారా నిర్వహిస్తున్న సర్వేలో 120 మీటర్ల ఎత్తు నుంచి చిత్రాలు (ఓఆర్ఐ) తీస్తున్నారు. అయితే ప్రయోగాత్మకంగా విమానం ద్వారా 1,500 మీటర్ల ఎత్తు నుంచి ఫొటోలు (ఓఆర్ఐ) తీయించారు. అవి మంచి నాణ్యతతో ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఎక్కువ పిక్సెల్స్‌తో, ఎక్కువ పరిధిని కవర్ చేసే కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ఒక రోజులో 200 నుంచి 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని విమానాల ద్వారా రీ సర్వే నిర్వహించారు. ఈ చిత్రాలు ఎక్కువ వ్యాసార్థంలో ఉంటాయి. ఎక్కువ పరిధిలోని భూమి ఒకే చిత్రంలో అత్యంత నాణ్యతగా రావడం వల్ల రీ సర్వే సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయి ఏరియల్ సర్వే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 13,953 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏరియల్ సర్వే నిర్వహించడానికి సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ టెండర్లు పిలిచింది. ఎల్1గా నిలిచిన ముంబైకి చెందిన జెనిసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీకి ఏరియల్ సర్వే బాధ్యత అప్పగించారు. ఈ సంస్థే నంద్యాలలో ప్రయోగాత్మకంగా ఏరియల్ సర్వే చేపట్టింది. వాటిని హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో పరీక్షించి అనుకున్న దానికంటే ఎక్కువ కచ్చితత్వంతో ఉన్నట్లు నిర్ధారించారు. ఐదు సెంటీ మీటర్ల తేడాతో కొలతలు కచ్చితంగా ఉన్నట్లు తేలింది. దీంతో సెప్టెంబర్ నుంచి ఈ సంస్థ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయి ఏరియల్ సర్వే మొదలు పెట్టనుంది. తనకు అప్పగించిన 13,953 చదరపు కిలోమీటర్లను రెండు విమానాలతో ఏరియల్ సర్వే ద్వారా కొలవనుంది. రోజుకు 200 – 300 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కొలవడానికి ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. అంటే 3 నెలల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తంలో ఏరియల్ సర్వే పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఏరియల్ సర్వేకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం అవసరాన్ని బట్టి మిగిలిన జిల్లాల్లో ఏరియల్ సర్వే కొనసాగించనున్నారు. గొలుసు నుంచి విమానం వరకు.. ► భూముల సర్వేను పాత కాలంలో చైన్ (గొలుసు), టేపులతో నిర్వహించే వారు. 1900 నుంచి బ్రిటీష్ హయాంలో ఈ విధానంలోనే సర్వే జరిగింది. చాలా కాలం ఈ విధానంలోనే భూములను కొలిచేవారు. ► టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) విధానంలో జియో కో – ఆర్డినేట్స్ ద్వారా భూముల కొలత ప్రారంభమైంది. శాటిలైట్లు వచ్చాక డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ద్వారా భూముల కొలత నిర్వహిస్తున్నారు. ► శాటిలైట్లను మరింతగా వినియోగించుకునే క్రమంలో జీఎన్ఎస్ఎస్ (గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్) రోవర్స్ అందుబాటులోకి రావడంతో వాటి ద్వారా భూముల సర్వే నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మరింత ఆధునికంగా సీఓఆర్ఎస్ (కంటిన్యుయస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్) నెట్వర్క్ ద్వారా జీఎన్ఎస్ఎస్ రోవర్లతో సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం డ్రోన్లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో వాటితో సర్వే చేయడం ప్రారంభించారు. తొలిసారి విమానాలతో.. ► గతంలో మైనింగ్, జాతీయ రహదారుల కోసం కొన్ని రాష్ట్రాల్లో విమానాల ద్వారా ఏరియల్ సర్వే చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు అడుగులు ముందుకు వేసి దేశంలోనే తొలిసారిగా ఏకంగా విమానాలతో ఏరియల్ సర్వే ద్వారా భూముల కొలిచే పద్ధతికి శ్రీకారం చుట్టింది. తద్వారా భూములను కొలిచే విధానాల్లో కొత్త చరిత్రకు నాంది పలికింది. ► ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం కింద చేస్తున్న రీ సర్వేలో ఈటీఎస్ నుంచి విమానాల వరకు అన్నింటినీ వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆధునిక విధానాలతో ముందుకు వెళుతోంది. ఏరియల్ సర్వేతో మంచి ఫలితం ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఏరియల్ సర్వేలో మంచి ఫలితం వచ్చింది. కొలతలు కచ్చితంగా ఉన్నట్లు సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. వర్షాలు తగ్గాక, పూర్తి స్థాయిలో ఏరియల్ సర్వే నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రీ సర్వే విజయవంతంగా సాగుతోంది. డ్రోన్ల ద్వారా ఇప్పటికే వేగంగా సర్వే నిర్వహిస్తున్నాం. విమానాలతో సర్వే చేయడం ద్వారా ఇంకా వేగంగా సర్వే చేసే అవకాశం ఉంటుంది. అందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు రీ సర్వే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. – సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ -
చురుగ్గా భూముల రీ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. దాదాపు వెయ్యి గ్రామాల్లో ఇప్పటికే రీ సర్వే పూర్తయ్యింది. ఆ మేరకు నంబర్ 13 నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. మరో వెయ్యి గ్రామాల్లో అక్టోబర్ నాటికి రీ సర్వే పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పటికి మొత్తంగా 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి.. కొత్త భూముల రికార్డులు తయారు చేయాలనే లక్ష్యంతో సిబ్బంది, అధికారులు పనిచేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు 1,977 గ్రామాల్లో ఓఆర్ఐ(ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్) జారీ ప్రక్రియను పూర్తి చేశారు. డ్రోన్ల ద్వారా భూములను కొలిచి.. వాటి చిత్రాలు జారీ చేసిన తర్వాతే సర్వే బృందాలు తమ పని ప్రారంభిస్తాయి. ఆ తర్వాత రైతుల సమక్షంలో క్షేత్ర స్థాయి నిజనిర్థారణ చేస్తారు. ఇలా ఇప్పటివరకు 1,200 గ్రామాల్లో క్షేత్రస్థాయి నిజనిర్ధారణ కూడా పూర్తయ్యింది. సర్వే పూర్తయ్యాక భూ యజమానుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించేందుకు కూడా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నియమించిన మొబైల్ మెజిస్ట్రేట్లు ఇప్పటివరకు 10,421 అభ్యంతరాలను సామరస్యంగా పరిష్కరించాయి. అలాగే రీ సర్వేను వేగంగా నిర్వహించేందుకు ఇటీవల ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్‌బుక్ రూల్స్‌కు సవరణలు చేయాలని నిర్ణయించి ప్రాథమిక నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. రీసర్వే పూర్తయిన తర్వాత తయారు చేసే కొత్త రెవెన్యూ రికార్డుల రూపకల్పనలో ఈ సవరణలు ఉపయోగపడతాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మరోవైపు మంత్రివర్గ ఉపసంఘం ప్రతి నెలా అప్పటివరకు జరిగిన సర్వేను సమీక్షించి అవసరమైన సూచనలిస్తోంది. సీఎం వైఎస్ జగన్ కూడా రీ సర్వే కార్యక్రమంపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. గడువు లోగా దాన్ని పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో రీ సర్వే కోసం ప్రస్తుతం 21 డ్రోన్లు పనిచేస్తుండగా, సకాలంలో పనులు పూర్తి చేసేందుకు మరో 10 డ్రోన్లు సమకూర్చుకోనున్నట్లు సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థ జైన్ తెలిపారు. -
రీ సర్వే కోసం ఆధునిక శిక్షణ
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే నేపథ్యంలో సర్వేయర్లు, రెవెన్యూ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక శిక్షణ అందిస్తోంది. ఏపీ సర్వే అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సర్వే సెటిల్మెంట్ శాఖలో పనిచేస్తున్న 94 మందిని ఎంపిక చేసి డ్రోన్ పైలట్ సర్వే, డ్రోన్ డెస్టినేషన్ సర్వేల్లో ప్రముఖ సంస్థల ద్వారా శిక్షణ అందించింది. గురుగాం సంస్థ ద్వారా 35 మందికి, ట్రినిటీ సంస్థతో 53 మందికి, సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో ఆరుగురికి డ్రోన్ పైలట్ సర్వేలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ తీసుకున్న వారిని 26 జిల్లాల్లో డ్రోన్ పైలట్, కో పైలట్లుగా ఉపయోగించుకుంటున్నారు. అలాగే వీరి ద్వారా.. ఆయా జిల్లాల్లోని మండలాల వారీగా పలువురిని ఎంపిక చేసి శిక్షణ ఇప్పించారు. రాష్ట్రంలోని మొత్తం 679 మండలాల్లో ఒక్కో ట్రైనర్ ఉండేలా.. గ్రామ సర్వేయర్లలో 679 మందిని ఎంపిక చేశారు. క్యూ–జీఐఎస్ సాఫ్ట్వేర్ ద్వారా ల్యాండ్ పార్సిల్ మ్యాప్, గ్రామ మ్యాప్‌లు రూపొందించే వీరికి మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ అందించారు. ఆయా మండలాల్లోని మిగిలిన సర్వేయర్లకు కూడా డ్రోన్ పైలట్, డెస్టినేషన్ సర్వేలపై వీరు శిక్షణ ఇస్తున్నారు. వీరందరి ద్వారా ప్రస్తుతం డ్రోన్ సర్వే వేగంగా, విజయవంతంగా జరుగుతోంది. అలాగే రీ సర్వేలో కీలకమైన గ్రౌండ్ ట్రూతింగ్(క్షేత్ర స్థాయి నిజనిర్ధారణ), గ్రౌండ్ వ్యాలిడేషన్‌కు ప్రతి మండలంలో ఒక ట్రైనర్ అందుబాటులో ఉండేలా శిక్షణ పూర్తి చేశారు. ఇదే శిక్షణను అఖిల భారత స్థాయి అధికారుల నుంచి గ్రామ రెవెన్యూ అధికారుల వరకూ ఇస్తున్నారు. నల్సార్ వర్సిటీతో మొబైల్ మెజిస్ట్రేట్లకు.. రీ సర్వేలో వచ్చే అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ మేజిస్ట్రేట్ వ్యవస్థలో పనిచేసే వారికి నల్సార్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. న్యాయపరమైన అంశాలను సమర్థంగా పరిష్కరించేలా డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లకు ఈ శిక్షణ అందించారు. అన్ని విధానాలపై విజయవంతంగా శిక్షణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అవసరమయ్యేలా సాంప్రదాయ, ఆధునిక, క్షేత్ర స్థాయి ప్రత్యక్ష సర్వే విధానాలపై సర్వేయర్లకు విజయవంతంగా శిక్షణ ఇచ్చాం. దీని వల్లే రీ సర్వే విజయవంతంగా కొనసాగుతోంది. – సీహెచ్వీఎస్ఎన్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్, ఏపీ సర్వే అకాడమీ -
3 దశల్లో భూముల రీసర్వే పూర్తికి ప్రణాళిక
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని మూడు దశల్లో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మొదటి దశలో 5,300, రెండో దశలో 5,700, మూడో దశలో 6,460 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేయడానికి కసరత్తు జరుగుతోంది. సర్వే ప్రక్రియలో చేపట్టాల్సిన నాలుగు కీలక పనుల్ని ఎప్పటిలోగా పూర్తి చేయాలో కూడా షెడ్యూల్ రూపొందించారు. డ్రోన్ సర్వే పూర్తి చేసి ఆ ఫొటోలను ఇవ్వడం, క్షేత్ర స్థాయి సర్వే, సర్వే పూర్తయినట్లు ప్రకటించే నోటిఫికేషన్ (నంబర్ 13), వైఎస్సార్ జగనన్న భూహక్కు పత్రం జారీకి ఈ షెడ్యూల్ ఇచ్చారు. మొదటి దశ గ్రామాల్లో వచ్చే ఏడాది జూలై 31, రెండో దశ గ్రామాల్లో వచ్చే ఏడాది ఆగస్టు 30, మూడో దశ గ్రామాల్లో వచ్చే ఏడాది నవంబర్ 30 నాటికి భూ హక్కు పత్రాలు జారీ చేయనున్నారు. ప్రస్తుతం 2,562 రెవెన్యూ గ్రామాల్లో (4,593 ఆవాసాలు) డ్రోన్ సర్వే పూర్తయింది. వాటిలో 1,272 రెవెన్యూ గ్రామాల డ్రోన్ ఫొటోలను సర్వే బృందాలకు అందించారు. ఇప్పటివరకు దాదాపు వెయ్యి గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. ప్రస్తుతం 67 డ్రోన్లు వినియోగిస్తుండగా త్వరలో వాటి సంఖ్యను పెంచనున్నారు. బాగా పనిచేసిన జిల్లాలు.. రీసర్వేలో కీలకమైన క్షేత్ర స్థాయి నిజ నిర్థారణలో బాగా పనిచేసిన జిల్లాలుగా శ్రీకాకుళం, అన్నమయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, విజయనగరం, తిరుపతి జిల్లాలను రెవెన్యూ ఉన్నతాధికారులు గుర్తించారు. పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, పార్వతీపురం మన్యం జిల్లాలు ఇంకా సీరియస్‌గా దృష్టి సారించాల్సి ఉందన్నారు. గ్రామాల్లో సర్వేను విజయవంతంగా పూర్తి చేయడంలో శ్రీకాకుళం, తిరుపతి, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు బాగా పనిచేయగా.. ఎన్టీఆర్, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలు బాగా పనిచేయాల్సి ఉందని తేల్చారు. మార్గదర్శకాలు జారీ.. షెడ్యూల్ ప్రకారం సర్వే పూర్తి చేయడానికి యంత్రాంగానికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా గ్రామాల్లో డ్రోన్లు ఎగరేయకముందే గ్రామ రికార్డులను అప్డేట్ చేయాలని సూచించింది. ప్రతి గ్రామంలో చేపట్టిన సర్వేను 5 నెలల్లో పూర్తి చేసి.. భూముల రిజిస్ట్రేషన్లను సంబంధిత గ్రామ సచివాలయాల్లో ప్రారంభించాలని ఆదేశించింది. ఈ గడువు ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదని స్పష్టం చేసింది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో వైఎస్సార్ భూ హక్కు పత్రాల జారీని పకడ్బందీగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 15న 41 ఆవాసాల్లో హక్కు పత్రాలు జారీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
ఏపీ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు.. ఇక సులభంగా మ్యుటేషన్లు
సాక్షి, అమరావతి: భూ యాజమాన్య హక్కులకు సంబంధించి మ్యుటేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు పలు అంశాలపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు స్పష్టతనిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) సాయిప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. ముందే సబ్ డివిజన్ తప్పనిసరి మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వారు దానికి ముందే సర్వే నెంబర్‌ను సబ్ డివిజన్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేశారు. సబ్ డివిజన్ ప్రక్రియ పూర్తై రికార్డుల్లో సర్వే నెంబర్లు, పేర్లన్నీ ఆ ప్రకారం ఉన్నట్లు నిర్థారించుకున్న తర్వాతే మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభించాలని తహశీల్దార్లకు సూచించారు. పాస్బుక్ల జారీ కూడా మ్యుటేషన్ సమయంలోనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. మ్యుటేషన్‌తోపాటు పాస్‌బుక్ కోసం దరఖాస్తు స్వీకరించి రెండింటినీ ఒకేసారి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములపై.. ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యుటేషన్ చేయరాదని సూచించారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో చేయాల్సి వచ్చినప్పుడు ఆ బాధ్యతను పూర్తిగా జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. అది కూడా కలెక్టర్ల నుంచి వచ్చిన ఫైలు ఆధారంగా చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తహశీల్దార్లకు ఉన్న ఈ అధికారాన్ని జేసీలకు బదలాయించారు. వారసత్వ వివాదాలకు సంబంధించి మ్యుటేషన్ల విషయంలో ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను తహశీల్దార్ అదే సమయంలో ఇవ్వాలని నిర్దేశించారు. మ్యుటేషన్ చేసుకునే సమయంలోనే ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను దరఖాస్తుదారుడు ఇచ్చినప్పుడు మళ్లీ ఆ కుటుంబం గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చుక్కల భూములు, అసైన్డ్ మ్యుటేషన్‌పై స్పష్టత చుక్కల భూముల చట్టం వచ్చే నాటికి 12 సంవత్సరాలు దాటి సంబంధిత భూములు దరఖాస్తు చేసుకున్న వారి స్వాధీనంలోనే ఉన్నట్లు రికార్డుల ప్రకారం నిర్థారణ అయితే వాటికి మ్యుటేషన్ చేయవచ్చని సూచించారు. తీర్పులు వెలువడిన కేసులు, కోర్టు ద్వారా వేలం పాట నిర్వహించిన ఆస్తులను కొనుగోలు చేసిన వారికి వెంటనే యాజమాన్య హక్కులు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. అసైన్డ్ భూములకు సంబంధించి రికార్డుల్లో ఉన్న వ్యక్తులే మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే చేయాలని, మూడో వ్యక్తి ఎవరైనా దరఖాస్తు చేస్తే తిరస్కరించాలని స్పష్టం చేశారు. భూముల రీ సర్వే పూర్తయిన చోట సర్వే పూర్తయినట్లు జారీ చేసే 13 నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే అప్పటివరకు ఉన్న మ్యుటేషన్ దరఖాస్తులను క్లియర్ చేయాలని నిర్దేశించారు. మ్యుటేషన్ దరఖాస్తులను చిన్న కారణాలతో తిరస్కరించకూడదని, ఎందుకు తిరస్కరించారో స్పష్టమైన కారణాలు చూపాలని, ఇంకా ఏ డాక్యుమెంట్లు కావాలో స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. మ్యుటేషన్ కోసం వచ్చే దరఖాస్తుల్లో 45 శాతం తిరస్కారానికి గురవుతుండడంతో పలు అంశాలపై స్పష్టత ఇస్తూ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. -
భూ సర్వేపై 26 నుంచి శిక్షణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద చేపట్టిన రీ సర్వే కోసం ఈ నెల 26వ తేదీ నుంచి విడతల వారీగా 1,294 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల కమిషనర్ సిద్ధార్థజైన్ తెలిపారు. సహాయ విభాగ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సహాయకులకు 15 రోజులపాటు శిక్షణ ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. సామర్లకోటలోని సర్వే ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా కారణంగా అందరికీ ఒకేసారి శిక్షణ ఇచ్చే అవకాశం లేకపోవడం వల్ల జిల్లా స్థాయిలో ప్రతి బ్యాచ్‌కు 60 మందిని ఎంపిక చేసి విడతల వారీగా శిక్షణ ఇప్పిస్తున్నట్టు తెలిపారు. శిక్షణ ముగింపులో ప్రతి బ్యాచ్‌కు సర్వే నిర్వహణ పరీక్ష మాదిరిగానే థియరీ, ప్లాటింగ్‌పై తుది పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఈ పరీక్షలను పర్యవేక్షించడానికి సంబంధిత జాయింట్ కలెక్టర్ల ద్వారా రెవెన్యూయేతర విభాగం నుంచి పరిశీలకులను నియమిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న భూ పునర్ వ్యవస్థీకరణ కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని సంప్రదాయక సర్వేతో పాటు సిలబస్‌లో కొత్త విషయాలను ప్రవేశపెట్టామని తెలిపారు. ఈటీఎస్, డీజీపీఎస్, నెట్వర్క్, ఎస్ఓపీ, గ్రౌండ్ ట్రూతింగ్, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్, గ్రౌండ్ ధ్రువీకరణ వంటి అధునాతన అంశాలను సిలబస్‌లో చేర్చామని వివరించారు. -
భూముల రీసర్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీసర్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని రాష్ట్రస్థాయి స్టీరింగ్, ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో భూముల రీసర్వే ప్రాజెక్టుకు సంబంధించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న అర్బన్ సర్వే పైలట్ ప్రాజెక్టు పూర్తి కానుండగా, త్వరలోనే ఇతర పట్టణాలకు విస్తరించనున్నామని ఆశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సర్వే, సెటిల్మెంట్, భూమి రికార్డుల కమిషనర్ సిద్దార్థ జైన్ మాట్లాడుతూ..రీసర్వే పనులకు అవసరమైన పరికరాల కొనుగోలు టెండర్లను వెంటనే పిలవాలని కమిటీ నిర్ణయించిందన్నారు. సరిహద్దుల వద్ద భూరక్ష రాళ్లను వెంటనే ఏర్పాటు చేసేందుకు స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. -
5 నిమిషాల్లోనే ల్యాండ్ రికార్డులు
సాక్షి, అమరావతి: దేశంలో వందేళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సమగ్ర రీసర్వేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పకడ్బందీగా, లోపరహితంగా పూర్తిచేస్తామని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్‌కుమార్ చెప్పారు. దార్శనికతతో కూడిన ఈ బృహత్తర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని విధాలా సాంకేతిక సహకారం అందించడంతోపాటు సర్వే సిబ్బందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా ఇస్తామని ప్రకటించారు. విజయవాడలో బుధవారం ఆయన రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నీరబ్‌కుమార్‌ప్రసాద్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణిలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో భూసర్వే చేపట్టి జాతీయ స్థాయిలో సర్వే మ్యాపులు రూపొందించే పనిలో ప్రపంచంలోనే పురాతన సంస్థగా సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ అతి పెద్ద సర్వే కార్యక్రమంలో తమను భాగస్వాములను చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేకంగా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రీసర్వే కోసం నాలుగు రకాలైన సహకారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 14 వేలమంది సర్వేయర్లు ఉన్నారని, వారికి శిక్షణ ఇస్తే రాష్ట్రంలో నైపుణ్యంగల మానవ వనరులు పుష్కలంగా ఉన్నట్లవుతుందని తెలిపారు. ఇందుకోసం విశాఖపట్నం కేంద్రంగా సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. అంతర్జాతీయ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేపట్టడం అభినందనీయమని చెప్పారు. దీనివల్ల అక్షాంశాలు, రేఖాంశాల ప్రాతిపదికగా కొలతలు అత్యంత లోపరహితంగా వస్తాయన్నారు. తిరుపతిలో సర్వే అకాడమీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్ల ప్రయివేటు సర్వేయర్లకు కూడా శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో రీసర్వేలో వినియోగించిన పరికరాలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినవేనని, వీటిలో ఎలాంటి లోపం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ల్యాండ్ పార్సిల్‌కు విశేష గుర్తింపు సంఖ్య భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నీరబ్‌కుమార్‌ప్రసాద్ మాట్లాడుతూ అటవీ భూములు మినహా పొలాలు, గ్రామకంఠాలు, పట్టణ ఆస్తులను సర్వేచేసి ప్రతి ల్యాండ్ పార్సిల్‌కు విశేష గుర్తింపు సంఖ్య ఇస్తామని తెలిపారు. భూ రికార్డులు స్వచ్ఛీకరించి మూడుదశల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 3,500 గ్రామాల్లో స్వచ్ఛీకరణ చివరిదశకు వచ్చిందని తెలిపారు. ఈ సర్వేవల్ల సరిహద్దులు పక్కాగా తెలుస్తాయని, 30 –40 ఏళ్ల వరకు భూ వివాదాలకు ఆస్కారం ఉండదని చెప్పారు. ప్రజలకు మేలు చేయాలనే ఉన్నతాశయంతోనే సీఎం జగన్మోహన్రెడ్డి భారీ ఖర్చుకు వెనుకాడకుండా రీసర్వేకి శ్రీకారం చుట్టారని తెలిపారు. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి మాట్లాడుతూ ప్రజలపై నయాపైసా కూడా భారం మోపకుండా సర్వే చేయడంతోపాటు సర్వే రాళ్లను కూడా ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే చేసినందున ఈనెల 21న రీసర్వేని ప్రారంభించి రైతులకు పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆ గ్రామంలో 800 మంది రైతులుండగా 35 మంది మాత్రం కొలతలపై అభ్యంతరం తెలిపారన్నారు. జాయింట్ కలెక్టరు సంప్రదింపులు జరపగా 17 మంది సమ్మతించారని, 18 మంది మాత్రమే అభ్యంతరం చెబుతున్నారని తెలిపారు. సమగ్ర భూసర్వేకి సర్వే ఆఫ్ ఇండియా సహకారం సీఎం సమక్షంలో ఎంవోయూ రాష్ట్రంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం కింద చేపడుతున్న సమగ్ర భూసర్వేకి సర్వే ఆఫ్ ఇండియా సంపూర్ణ సహాయ సహకారాలు అందించనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్ సమక్షంలో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్, రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సాహ్ని, సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ నీరబ్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి పాల్గొన్నారు. -
‘భూ’ చరిత్రలో సువర్ణాధ్యాయం
అదే ఊళ్లోనే సర్వేయర్ ఉంటాడు. రికార్డులన్నీ డిజిటల్ రూపంలోనూ భద్రంగా ఉంటాయి. యజమానికి హార్డ్ కాపీ ఇస్తారు. ఏవైనా వివాదాలు తలెత్తినా ప్రతి మండలంలో ఓ ట్రైబ్యునల్ ఉంటుంది. భవిష్యత్తులో అదే ఊళ్లోనే క్రయవిక్రయాలు జరుపుకోవచ్చు. అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శాశ్వత హక్కులు కల్పించాక ఎలాంటి వివాదాలు వచ్చినా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని హక్కుదారుడికి నష్ట పరిహారం చెల్లిస్తుంది. భూముల రీ సర్వే చరిత్రాత్మక కార్యక్రమం. ఇంటి స్థలం, పొలం.. ప్రతి స్థిరాస్తిని పక్కాగా సర్వే చేసి, రికార్డుల్లో నమోదు చేసి.. తొలుత యజమానులకు దానిపై తాత్కాలిక హక్కు (టెంపరరీ టైటిల్) ఇస్తాం. రెండేళ్ల పాటు ఈ రికార్డు గ్రామ సచివాలయంలో ఉంచి, ప్రజల నుంచి అభ్యంతరాలు ఆహ్వానిస్తాం. ఎవరి నుంచి అభ్యంతరాలు రానిపక్షంలో ఆ భూములపై యజమానులకు శాశ్వత హక్కులు (పర్మినెంట్ టైటిల్) ఇస్తాం. సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అతి పెద్ద సమగ్ర భూ రీసర్వే కార్యక్రమం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – సర్వే ఆఫ్ ఇండియా కలిసి భారీ స్థాయిలో చేపడుతున్న ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూరక్ష’ కార్యక్రమానికి ఈనెల 21న శ్రీకారం చుట్టనున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ అంశాలపై మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్థిరాస్తిని సర్వే చేసి, హద్దులు నిర్ణయించి.. శాశ్వత హక్కు (కంక్లూజివ్ టైటిల్) కల్పించే ఈ కార్యక్రమం ప్రతి దశలో పకడ్బందీగా జరిగేలా చూడాల్సిన కీలక బాధ్యత కలెక్టర్లపై ఉందని స్పష్టం చేశారు. రీసర్వే తర్వాత అన్ని రకాల రెవిన్యూ, రిజిస్ట్రేషన్ సేవలు వార్డు, గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. దేశంలో ఎక్కడా, ఎప్పుడూ ఇంత పెద్ద స్థాయిలో సర్వే జరగలేదని, గ్రామాల్లో తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు ఈ బృహత్తర కార్యక్రమంతో పరిష్కారమవుతాయని చెప్పారు. దీంతో భూ వివాదాలకు తావుండదని, ఫలితంగా గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని వివరించారు. భూ యజమానులకు న్యాయమైన, చట్టబద్ధమైన శాశ్వత హక్కులు లభిస్తాయని, భావితరాలకు సైతం మంచి వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ ► ఒక మంచి బృహత్తర కార్యక్రమం మొదటి దశకు మనం ఈనెల 21న శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియా కలిసి 70 బేస్ స్టేషన్లు పెడుతున్నాయి. సర్వే ఆఫ్ ఇండియా నెట్‌వర్క్‌లో ఇవి భాగంగా ఉంటాయి. కొలతల్లో అత్యంత కచ్చితత్వం వస్తుంది. (ఒక పాయింట్‌ను బేస్‌గా తీసుకుంటే ఎన్నిసార్లు మార్చినా 2 సెంటీమీటర్లు అటు ఇటుగా అనగా అతిసూక్ష్మ తేడా మాత్రమే ఉంటుంది) ► ఇందుకోసం అత్యాధునిక కార్స్ టెక్నాలజీ, డ్రోన్లు, రోవర్లు వాడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు సర్వే చేస్తున్నాం. ఈనెల 21న 5 వేల గ్రామాల్లో శ్రీకారం ► మొదటి దశ కింద ప్రతి మండలంలో కొన్ని చొప్పున రాష్ట్రంలోని 5 వేల రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 21వ తేదీన రీసర్వే ప్రారంభించి వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేస్తాం. ► రెండో దశ కింద ప్రతి మండలంలో కొన్ని చొప్పున ఆగస్టు 2021న 6,500 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే ప్రారంభించి 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తాం. ► మిగిలిన గ్రామాల్లో మూడో విడత కింద జూలై 2022న ప్రారంభించి జూన్ నెలకు పూర్తి చేస్తాం. దీంతో రాష్ట్రమంతా రీసర్వే పూర్తవుతుంది. ► మొదటి విడత సర్వే పూర్తయిన గ్రామాల్లోని సచివాలయాల్లో ఈ రికార్డుల ప్రకారం రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభిస్తారు. అక్కడే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. కలెక్టర్లది కీలక బాధ్యత ► ఈ కార్యక్రమంలో కలెక్టర్లపై కీలక బాధ్యత ఉంది. వీటన్నింటినీ కలెక్టర్లు దగ్గరుండి చూసుకోవాలి. సర్వేకు సన్నద్ధతపై జాగ్రత్తలు తీసుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ అథారిటీని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా స్థాయిలో ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. అప్పిలేట్ ట్రైబ్యునల్స్‌ను కూడా రిటైర్డ్ న్యాయమూర్తులతో ఏర్పాటు చేస్తాం. ► డ్రోన్ల ద్వారా సర్వే మొదలుపెట్టే సమయానికి గ్రామాల సరిహద్దులు, వాటి మార్కింగ్స్‌ను పూర్తి చేయాలి. ప్రతి మండలంలో ఒక డ్రో¯Œన్, డేటా ప్రాసెసింగ్, రీసర్వే బృందాలను కలెక్టర్లు ఏర్పాటు చేయాలి. ► సర్వే వల్ల జరిగే మేలు గురించి ప్రతి ఒక్కరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. భూ వివాదాలకు రీసర్వే, ల్యాండ్ టైట్లింగ్ శాశ్వత పరిష్కార మార్గాలు. వీటి వల్ల ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది. ► గ్రామ, వార్డు వాలంటీర్ల సహాయంతో ప్రతి ఒక్కరికీ ఈ విషయాలు తెలియజెప్పే కార్యక్రమాన్ని ఈనెల 11వ తేదీ వరకు కొనసాగించండి. ఈ నెల 14 నుంచి 19 వరకు గ్రామ సభలు పెట్టండి. ► వారికి కావాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదన్న బాధతో ఎల్లో మీడియా సమగ్ర సర్వేకు వ్యతిరేకంగా దుష్ప్రచారం సాగిస్తోంది. రీసర్వే జరగడం, ప్రభుత్వానికి మంచిపేరు రావడం ఎల్లో మీడియాకు, విపక్షానికి ఇష్టం లేనందున ఇలా చేస్తున్నాయి. అందువల్ల ఈ పథకం ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసి, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలి. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్, వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు ► వందేళ్ల తర్వాత రీసర్వే జరుగుతుండటం వల్ల కొన్ని చోట్ల కొన్ని వివాదాలు వస్తాయి. అందువల్ల వీటి పరిష్కారానికి ప్రతి మండలంలో ఒక మొబైల్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తాం. 660 మొబైల్ మెజిస్ట్రేట్ ట్రైబ్యునల్స్ అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తాయి. ► 100 ఏళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతోంది. గత వందేళ్లలో జనాభా నాలుగైదు రెట్లు పెరిగింది. కుటుంబాలు విడిపోయాయి. పెద్దలు చనిపోయి వారి వారసులు భూములు అనుభవిస్తున్నారు. ఈ మేరకు రికార్డులు అప్డేట్ కాలేదు. క్షేత్ర స్థాయిలో ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ► రికార్డుల స్వచ్ఛీకరణ ద్వారా మొత్తం రికార్డుల్లో నమోదు చేస్తాం. సర్వే చేసి సరిహద్దు రాళ్లు నాటిస్తాం. ఆ కార్డులో క్యూర్ఆర్ కోడ్ ఉంటుంది. హార్డ్ కాపీ కూడా ఇస్తారు. ప్రతి ల్యాండ్ పార్సిల్‌కు ఒక నంబరు కేటాయిస్తాం. ల్యాండ్ పార్సిళ్లు, మ్యాపులు కూడా గ్రామంలో అందుబాటులో ఉంచుతాం. ► రికార్డులన్నింటినీ డిజిటలైజేష¯Œన్ చేస్తాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో స్థిరాస్తుల మ్యాపులు, డిజిటల్ రికార్డులు అందుబాటులో ఉంచుతాం. ► 14 వేల మంది సర్వేయర్లును ప్రభుత్వం నియమించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న వీరందరికీ అత్యాధునిక సర్వేపై శిక్షణ కార్యక్రమం సాగుతోంది. ఇప్పటికే 9,400 మందికి శిక్షణ పూర్తయింది. మిగిలిన వారికి వచ్చే ఏడాది జనవరి 26 నాటికి శిక్షణ కార్యక్రమం పూర్తి చేస్తాం. -
భూ రక్షకు ఢోకా లేదిక
సమగ్ర భూ సర్వే వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ఇది విప్లవాత్మక చర్య. ప్రజలపై నయాపైసా కూడా భారం పడదు. మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. రైతుల ప్రయోజనార్థం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. గత వందేళ్లలో ఎక్కడా రీసర్వే చేయలేదు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. – సీఎం వైఎస్ జగన్ ఎన్నెన్నో ఉపయోగాలు ► ప్రస్తుతం యజమానులకు భూములపై ఊహాజనితమైన హక్కులు మాత్రమే ఉన్నాయి. రీసర్వే తర్వాత శాశ్వత హక్కులతో కూడిన (ల్యాండ్ టైటిలింగ్) కార్డు అందజేస్తారు. ఈ కార్డులో ఆధార్ తరహాలో విశేష గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్) ఉంటుంది. ► ఇందులో యజమాని పేరు, ఫొటో, క్యూ ఆర్ కోడ్ ఉంటాయి. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆయా రైతులకు సంబంధించిన ఆస్తుల (భూమి) కొలతలు, సమగ్ర సమాచారం కనిపిస్తుంది. ► సర్వే పూర్తయిన తర్వాత డిజిటలైజ్డ్ కెడస్ట్రల్ మ్యాపులు రూపొందిస్తారు. గ్రామంలోని ప్రతి కమతం, భూమి వివరాలు ఈ మ్యాప్‌లో ఉంటాయి. వీటి ప్రకారం ప్రతి సర్వే నంబరుకు సర్వే రాళ్లు నాటుతారు. ► ప్రతి గ్రామ సచివాలయంలో ఆ గ్రామానికి చెందిన డిజిటలైజ్డ్ ప్రాపర్టీ (ఆస్తి), టైటిల్ రిజిస్టర్లతోపాటు వివాదాల నమోదుకూ రిజిస్టర్లు ఏర్పాటు చేస్తారు. సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం విప్లవాత్మక మార్పులకు నాంది కానుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సమగ్ర భూముల రీసర్వే పూర్తికాగానే భూ యజమానులకు శాశ్వత భూ హక్కులతో కూడిన డిజిటల్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఎన్నో వివాదాలకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. భూ రికార్డులన్నీ డిజిటలైజ్ చేయడం వల్ల ట్యాంపరింగ్‌కు ఏమాత్రం అవకాశం ఉండదని.. పట్టణాలకు, నగరాలకు వెళ్లాల్సిన పని లేకుండా సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం’పై మంగళవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సమగ్ర భూ సర్వేను ఈ నెల 21 ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. సర్వే సిబ్బందికి శిక్షణ కోసం తిరుపతిలో కనీసం 50 ఎకరాల విస్తీర్ణంలో కళాశాల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సర్వే సందర్భంలోనే ఈ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం’పై మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లకు పక్కా ఏర్పాట్లు ► ఒక గ్రామంలో సర్వే పూర్తయి కెడస్ట్రల్ మ్యాపులు సిద్ధం కాగానే అదే గ్రామ సచివాలయంలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించాలి. ఆ మేరకు గ్రామ సచివాలయాల్లో కావాల్సిన మార్పులు చేసుకోవాలి. భూ వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన వాహనాలు, ఇతర మౌలిక ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. ► సర్వేలో పాల్గొనే సిబ్బందికి మంచి శిక్షణ, ఓరియెంటేష¯Œన్ ఇవ్వాలి. సర్వే పూర్తయ్యాక ఆ రికార్డులను ట్యాంపర్ చేయడానికి వీలులేని విధంగా పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో డిజిటలైజ్ చేసి భద్రపరచాలి. ► ఆ మేరకు సర్వే వ్యవస్థను పటిష్టంగా, మంచి సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేయాలి. భూ యజమానుల వద్ద హార్డ్ కాపీ ఉండేలా చూడాలి. 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల సర్వే ► రాష్ట్రంలోని 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల (1.26 కోట్ల హెక్టార్ల ) పరిధిలో ప్రతి సెంటు భూమి/స్థలం రీ సర్వే చేస్తారు. సుమారు 90 లక్షల మందికి చెందిన 2.26 కోట్ల ఎకరాలు రీసర్వేలో భాగంగా కొలుస్తారు. ► అటవీ ప్రాంతం మినహా గ్రామాలు, ఆవాసాలు, పట్టణాలు, నగరాల్లో ఈ పథకం కింద సర్వే నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,460 రెవెన్యూ గ్రామాలున్నాయి. మొదటి విడతలో 5,000, రెండో విడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో రీ సర్వే జరుపుతారు. ► పట్టణాలు, నగరాల్లోని 3345.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల ఓపెన్న్ప్లాట్లు, 40 లక్షల అసెస్మెంట్ల పరిధిలో సర్వే చేస్తారు. సర్వే ఆఫ్ ఇండియా సాంకేతిక సహకారం ► భూముల రీ సర్వేకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా పూర్తి స్థాయి సాంకేతిక సహకారం అందిస్తుంది. ఇందుకోసం సిబ్బందికి అవసరమైన శిక్షణ, సాంకేతిక నైపుణ్యం అందిస్తుంది. ఈ మేరకు సర్వే ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిదో తేదీ (బుధవారం) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కురుర్చుకోనుంది. ► ప్రతి మండలానికి ఒక డ్రోన్, డేటా ప్రాసెసింగ్, రీసర్వే బృందాలు ఉంటాయి. ఇప్పటికే 9,400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చారు. మిగిలిన వారికి కూడా త్వరలో శిక్షణ పక్రియ పూర్తి చేయనున్నారు. ► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించే కుట్ర ► ప్రజలకు ఇంత మేలు చేయాలని ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభిస్తుంటే ప్రతిపక్షం, దానికి కొమ్ము కాసే మీడియా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం ద్వారా దీనికి అవాంతరాలు కల్పించాలని కుట్ర పన్నింది. ఇందులో భాగంగానే దీనిపై విష ప్రచారానికి పూనుకుని తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. ► ఈ కుట్రపూరిత అసత్య వార్తలు, విష ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అపోహలు, అనుమానాలు సృష్టిస్తున్న అంశాలను గుర్తించి ప్రజలను చైతన్య పరుస్తూ, సమగ్ర సర్వే వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను తెలియజేయాలి. -
భూ సమగ్ర రీ–సర్వేకు.. ప్రతి గ్రామానికీ ఒక బృందం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర రీ–సర్వేకి రెవెన్యూ శాఖ పకడ్బందీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీన ప్రారంభించి మూడు దశల్లో అనగా 2023 ఆగస్ట్ నాటికి రీ–సర్వే పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి? సుమారు 120 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి చేపట్టదలచిన ఈ భారీ కార్యక్రమాన్ని ఎలా చేయాలనే అంశాలతో రెవెన్యూ శాఖ నివేదిక తయారు చేసింది. ► ప్రతి గ్రామానికీ ఇద్దరు గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ సహాయకుడు (వీఆర్ఏ)తో సర్వే బృందాన్ని తయారు చేయనుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 4,500 బృందాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ► రికార్డుల స్వచ్ఛీకరించనిదే రీ–సర్వే సాధ్యం కాదు. అందువల్ల భూ రికార్డుల పరిశీలనకు ప్రతి గ్రామానికి ఇద్దరు గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఓ)తో బృందాన్ని ఏర్పాటు చేయనుంది. ► వీఆర్ఓల బృందం పరిశీలించి ఆమోదించిన ల్యాండ్ రిజిస్టర్‌ను తహసీల్దార్ పరిశీలించి ఆమోదించే వ్యవస్థ ఉంటుంది. ► రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో 90 లక్షల మంది పట్టాదారులు (భూ యజమానులు) ఉన్నారు. ► 1.96 కోట్ల సర్వే నెంబర్ల పరిధిలో పట్టాదారులకు చెందిన 2.26 కోట్ల ఎకరాల భూమిని రీ–సర్వే చేయాల్సి ఉంది. ► మొదటి దశలో రాష్ట్రంలోని అన్ని మండలాలకు చెందిన 5 వేల గ్రామాల్లోనూ, రెండో దశలో 6,500, మూడో దశలో 5,500 గ్రామాల్లో భూముల సమగ్ర రీ–సర్వే ప్రక్రియ పూర్తి చేసేలా రెవెన్యూ శాఖ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. -
భూముల సమగ్ర రీసర్వేకు శ్రీకారం
సాక్షి, అమరావతి/మండపేట: రాష్ట్రంలో దాదాపు 120 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భూముల సమగ్ర రీ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో భూముల రీ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. జగ్గయ్యపేట మండలంలోని మొత్తం 25 గ్రామాల పరిధిలోగల 66,761 ఎకరాల భూములను రీసర్వే చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీంతో భూముల రీసర్వేకు సంబంధించి అధికారిక ప్రక్రియ ప్రారంభమైనట్లే. రీసర్వేకు బడ్జెట్లో నిధుల కేటాయింపు రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే నిర్వహిస్తామని ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చిన విషయం విదితమే. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వే కోసం బడ్జెట్లో నిధులు కేటాయించారు. భూముల సమగ్ర రీసర్వే, భూ యజమానులకు శాశ్వత భూహక్కుల కల్పన బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్ విభాగాల అధికారులు సర్వే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆధునిక సర్వే యంత్రాలను కొనుగోలు చేశారు. భూ రికార్డుల స్వచ్ఛీకరణ ప్రక్రియ చేపట్టారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి భూముల సమగ్ర రీసర్వే ప్రారంభించాలని నిర్ణయించి, నోటిఫికేషన్ జారీ చేశారు. బ్రిటిష్ సర్కారు హయాంలో... దేశవ్యాప్తంగా బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో భూములను సర్వే చేశారు. రాష్ట్రంలో 120 ఏళ్ల క్రితం భూములను సర్వే చేసి రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్(ఆర్ఎస్ఆర్) రూపొందించారు. తర్వాత కాలంలో తరాలు మారడం, కుటుంబాలు విడిపోవడం, జనాభా పెరగడం, భూములు చాలామంది చేతులు మారడం, భూకమతాల సైజు తగ్గడం వంటి వాటితో సబ్డివిజన్లు/ సర్వేనంబర్లు పెరిగిపోయాయి. భూ వివాదాలు సైతం పెరిగాయి. ఈ తరహా సమ్యల పరిష్కారానికి, భూ రికార్డుల సమగ్రతకు రీసర్వే చేపట్టాలని నిపుణులు సూచించినా గత పాలకులు పట్టించుకోలేదు. జగ్గయ్యపేట మండలంలో ఈ ప్రక్రియ పూర్తయ్యాక, ఈ అనుభవాలతో రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే నిర్వహించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. రైతులపై నయా పైసా కూడా భారం పడకుండా.. లోపభూయిష్టంగా మారిన భూ రికార్డులను ప్రక్షాళన చేసి, భూ యజమానులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూముల సమగ్ర రీసర్వేను ప్రారంభిస్తోందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టు అమలుకు రూ.2,000 కోట్ల వ్యయం అవుతున్నప్పటికీ రైతులు, భూ యజమానులపై నయాపైసా కూడా భారం పడకుండా మొత్తం ప్రభుత్వమే భరించనుందని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సర్వే, సరిహద్దుల చట్టం–1923 కింద భూముల సమగ్ర సర్వే కోసం సర్వే డైరెక్టర్ తయారు చేసిన నోటిఫికేషన్‌ను పిల్లి సుభాష్ చంద్రబోస్ బుధవారం తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి 30 ఏళ్లకోసారి రీసర్వే చేయాల్సి ఉండగా, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పారు. 11,158 మంది గ్రామ సర్వేయర్లను నియమించాం అమెరికా, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో వినియోగించిన ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోనే సమగ్ర రీ సర్వేకు వినియోగిస్తున్నట్టు పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. భూ యజమానులకు కచ్చితత్వాన్ని అందించే విధంగా క్రాస్ నెట్వర్క్ ద్వారా రీ సర్వే చేస్తారన్నారు. సర్వేయర్ల కొరతను అధిగమించేందుకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల ద్వారా 11,158 మంది గ్రామ సర్వేయర్లను నియమించి, వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. 2022 మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి చేసి, పటిష్టమైన నూతన రెవెన్యూ రికార్డులు రూపొందిస్తామని స్పష్టం చేశారు. -
భూముల సర్వే.. వచ్చే ఏడాది
వ్యవసాయ భూముల రీ సర్వేపై నిర్ణయం మార్చుకున్న సీఎం - రికార్డుల అస్తవ్యస్త నిర్వహణ, సాంకేతిక కారణాల వల్లే... - గ్రౌండ్ కంట్రోల్ నెట్వర్క్ ఏర్పాటుకు మరింత సమయం - శాటిలైట్ చిత్రాలు వర్షాకాలంలో సరిగా ఉండవనే అభిప్రాయం - రికార్డుల ప్రక్షాళనపై అధికారులతో మళ్లీ భేటీ కానున్న సీఎం - వెయ్యి మందికిపైగా ఐటీ అధికారులను నియమించే యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల రీ సర్వేపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆచితూచి అడుగులేస్తున్నారు. తొలుత సెప్టెంబర్ నుంచే ఈ సర్వే ప్రారంభించాలని నిర్ణయించినా భూ రికార్డుల అస్తవ్యస్త నిర్వహణ, సాంకేతిక కారణాలతోపాటు సర్వే ఏర్పాట్లకు కనీసం మూడు నెలల సమయం పడుతుందన్న అంచనా నేపథ్యంలో వచ్చే ఏడాదే ఈ సర్వే ప్రక్రియ చేపట్టాలని ఆయన నిర్ణయించారు. ఈలోగా భూ రికార్డులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, అందుకు రెవెన్యూ, వ్యవసాయ, గ్రామ రైతు చైతన్య కమిటీలు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ఆయన ఆదేశించారు. ప్రక్షాళనపై మరోసారి ‘క్లాస్’... భూ రికార్డుల ప్రక్షాళన, రైతు చైతన్య కమిటీల ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ త్వరలో మరోసారి రాష్ట్రంలోని వ్యవసాయ అధికారులతో సమావేశం కానున్నారు. రికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూశాఖకు అందించాల్సిన సహకారంతోపాటు రైతు కమిటీల ఏర్పాటులో అవలంబించాల్సిన పద్ధతులపై వ్యవసాయశాఖకు దిశానిర్దేశం చేయనున్నారు. భూ రికార్డులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నందున భవిష్యత్తులో సాఫ్ట్వేర్ సమస్యలు కూడా రాకూడదన్న ఆలోచనతో దాదాపు వెయ్యి మంది ఐటీ అధికారులనూ నియమించాలని సీఎం నిర్ణయించారు. ప్రతి ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాలతోపాటు రాష్ట్రస్థాయి రెవెన్యూ విభాగాలు, అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులను నియమించనున్నారు. చర్చోపచర్చల తర్వాతే... వాస్తవానికి భూ రికార్డుల ప్రక్షాళనతోపాటు రీ సర్వే కూడా వచ్చే ఖరీఫ్‌కల్లా పూర్తి చేయడం ద్వారా ఎకరానికి రూ. 4 వేల పెట్టుబడి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావించారు. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ నేతృత్వంలో మరో రెండు జిల్లాల కలెక్టర్లు, రంగారెడ్డి జిల్లా జేసీ, ముగ్గురు ఆర్డీవోలు, సర్వేశాఖ అధికారులతో కమిటీని నియమించారు. ఈ కమిటీతోపాటు ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితాసభర్వాల్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్. మీనా తదితర ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశమై సర్వే సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఇందుకోసం రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని మూడు గ్రామాల్లో నమూనా సర్వే కూడా నిర్వహించారు. ఈ చర్చల సారాంశంతోపాటు నమూనా సర్వే అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రీ సర్వేను ప్రస్తుతానికి వాయిదా వేయాలని సీఎం నిర్ణయించినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సాంకేతిక ఏర్పాట్లకు సమయం వల్లే... రెవెన్యూ ఉన్నతాధికారుల భేటీల్లో జరిగిన చర్చల ప్రకారం భూముల సర్వేకు చాలా పని ఉందని తేలింది. ముఖ్యంగా డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) పద్ధతిలో సర్వే నిర్వహించేందుకు భారీగా గ్రౌండ్ కంట్రోల్ నెట్వర్క్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి చదరపు కిలోమీటర్‌కు ఓ రిఫరెన్స్ టవర్ చొప్పున తెలంగాణవ్యాప్తంగా లక్షకుపైగా టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు సర్వేను వర్షాకాలంలో ప్రారంభిస్తే ఉపగ్రహ చిత్రాలు కూడా సరిగా రావనే అభిప్రాయం వ్యక్తమైంది. అక్టోబర్ తొలి లేదా రెండో వారం నుంచయితే ఉపగ్రహ చిత్రాల ద్వారా వచ్చే సర్వే మ్యాపులు సమగ్రంగా ఉంటాయని సాంకేతిక నిపుణులు తేల్చారు. వీటికితోడు సర్వే ఏజెన్సీల నియామకం, ఆయా ఏజెన్సీలకు స్థానిక పరిస్థితులపై అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో జరిగిన పొరపాటు వల్లే హరియాణా, గుజరాత్‌లలో సర్వే ప్రారంభమై పదేళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదని ఆయా ఏజెన్సీలతో మాట్లాడినప్పుడు అధికారులకు అర్థమైంది. మరోవైపు భూ రికార్డుల నిర్వహణ కూడా రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో రికార్డుల ప్రక్షాళన పూర్తి స్థాయిలో జరిగాకే రీ సర్వే చేపట్టాలని, రికార్డుల పని తర్వాత సర్వే సంగతి ఆలోచిద్దామని సీఎం చెప్పినట్లు సమాచారం.