రైతులు సబ్ డివిజన్‌కు దరఖాస్తు చేసుకుంటే, ఆ పని ఎప్పటికి అవుతుంది? వారు ఎంత శ్రమ పడాలి? ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరగాలి? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పటి దాకా నిర్దిష్ట సమాధానం లేదు. ఇకపై భూముల రీ సర్వే ద్వారా ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎవరైనా చెబుతారు.
సాక్షి, అమరావతి: వంద కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా 92 వేల మంది రైతుల పేర్లు భూముల రీ సర్వే ద్వారా కొత్తగా రెవెన్యూ రికార్డుల్లో నమోదయ్యాయి. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా వచ్చిన ఫలితమిది. భూమి వారిదైనా, ఆ భూమిని వారే సాగు చేసుకుంటున్నప్పటకీ రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటి వరకు వారి పేర్లు లేవు. ఇలాంటి 92 వేల మంది అడక్కుండానే, వారి భూములను ప్రభుత్వం రీ సర్వే చేసి, వారి పేర్లను రికార్డుల్లోకి ఎక్కించింది. ఆ భూముల్లో హద్దు రాళ్లు పాతించి, భూ హక్కు పత్రాలిచ్చింది.
రీ సర్వే ఎందుకని ప్రశ్నిస్తున్న వారికి ఇదే చక్కటి సమాధానం. మామూలుగా అయితే ఇది సాధ్యమా? సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో 2 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. 4.3 లక్షల సబ్ డివిజన్లు జరిగాయి. అంటే సుమారు 6.5 లక్షల రెవెన్యూ అంశాలు పరిష్కారమయ్యాయి. ఇవి కాకుండా ఈ గ్రామాల్లో 10 వేలకు పైగా వివాదాలను మొబైల్ మెజిస్ట్రేట్లు పరిష్కరించారు.
అలాంటిది 17 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తయితే లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా 47,276 చదరపు కిలోమీటర్ల మేర సర్వే చేశారు. 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశలు పూర్తయింది. అందులో 1,835 గ్రామాలకు సంబంధించిన 7,29,381 మంది రైతుల భూ హక్కు పత్రాలు జారీ అయ్యాయి.
అడుగడుగునా రైతుల భాగస్వామ్యం
సర్వే పూర్తయి ఆర్‌ఓఆర్ జారీ అయ్యాక కూడా తప్పులుంటే రైతులు అప్పీల్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
– జి.సాయిప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్,
Comments
Please login to add a commentAdd a comment