మరో సంచలనానికి సిద్ధమైన ఓలా....! | Ola Acquires Geospatial Technology Platform Geospoc | Sakshi
Sakshi News home page

Ola: మరో సంచలనానికి సిద్ధమైన ఓలా....!

Published Tue, Oct 5 2021 5:24 PM | Last Updated on Tue, Oct 5 2021 5:26 PM

Ola Acquires Geospatial Technology Platform Geospoc - Sakshi

మొబిలిటీ కంపెనీ ఓలా మరో సంచలనానికి తెర తీయనుంది. ఉపగ్రహచిత్రాలు, విజువల్‌ ఫీడ్స్‌, సహాయంతో ‘లివింగ్‌ మ్యాప్స్‌’ను అభివృద్ధి చేయడానికి ఓలా సన్నద్దమైంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలను ఓలా ముమ్మరం చేసింది. తాజాగా జియోస్పేషియల్‌ సర్వీసుల ప్రొవైడర్‌ జియోస్పోక్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం నెక్ట్స్‌ జనరేషన్‌ లోకేషన్‌ సాంకేతికతను ఓలా రూపొందించనుంది. ఈ సాంకేతికతతో రియల్‌ టైం, త్రీ డైమన్షనల్‌, వెక్టర్‌ మ్యాప్స్‌ను రూపొందించనుంది. 
చదవండి:  ఫేస్‌బుక్‌ యూజర్లకు మరో భారీ షాక్‌..!

మరింత వేగవంతం..!
వ్యక్తిగత వాహనాలలో మొబిలిటీని యాక్సెస్ చేయగల, స్థిరమైన, వ్యక్తిగతీకరించిన , సౌకర్యవంతంగా ఉండే లోకేషన్‌ టెక్నాలజీలను మరింత వేగవంతంగా అభివృద్ధి చేయడం కోసం జియోస్పోక్‌  ఓలాలో చేరినట్లు తెలుస్తోంది. ఓలా, జియోస్పోక్‌ కంపెనీలు సంయుక్తంగా తెచ్చే లోకేషన్‌ టెక్నాలజీ సహాయంతో ప్రజల రవాణాకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తోంది. లొకేషన్, జియోస్పేషియల్ టెక్నాలజీలు, అలాగే శాటిలైట్ ఇమేజరీలో రియల్ టైమ్ మ్యాప్స్‌గా 3 డి, హెచ్‌డి, వెక్టర్ మ్యాప్‌ల సహాయంతో రవాణా రంగంలో భారీ మార్పులను తేనుంది.  

డ్రోన్‌ మొబిలిటీకి ఎంతో ఉపయోగం..!
బహుళ-మోడల్ రవాణా కోసం  జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ కచ్చితంగా అవసరమని ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ లొకేషన్‌ టెక్నాలజీ సహాయంతో త్రీ డైమెన్షనల్‌ మ్యాప్స్‌ను రూపొందించడంతో డ్రోన్‌ వంటి ఏరియల్‌ మొబిలిటీ మోడల్స్‌కు ఎంతగానో ఉపయోగపడనుంది. 
చదవండి: ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు టీవీఎస్, టాటా పవర్ శుభవార్త!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement