ఇక్కడ ఫొటోలో టోపీ మీద వాలిన తూనీగ కనిపిస్తోంది కదూ! అచ్చంగా తూనీగలాగానే కనిపిస్తున్నా, ఇది తూనీగ కాదు. తూనీగ ఆకారంలో రూపొందించిన పెండెంట్. ముమ్మూర్తులా తూనీగలనే పోలి ఉండే ఇలాంటి పెండెంట్లను జపానీస్ కంపెనీ ‘మికి లోకోస్’ ఇటీవల మార్కెట్‌లోకి తెచ్చింది. పీవీసీ మెటీరియల్‌తో తయారు చేసిన ఈ తూనీగ పెండెంట్లు జపాన్‌లోని ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
అంతేకాదు, ఈ తూనీగ పెండెంట్లతో మరో లాభం కూడా ఉంది. అదేంటంటారా? ఈ పెండెంట్లను వేసుకున్న వారికి దోమల బెడద తప్పుతోందట! వీటిని చూస్తేనే చాలు, దోమలు పరారవుతున్నట్లు జనాలు గుర్తించడంతో, వీటికి మరింతగా గిరాకీ పెరిగింది. (క్లిక్: ఈ ఇల్లుకు కరెంటు అక్కర్లేదు.. ఎందుకంటే..)
Comments
Please login to add a commentAdd a comment