tuberculosis disease
-
భారత్‌లోనే టీబీ కేసులు అత్యధికం!: డబ్ల్యూహెచ్ఓ నివేదిక
దేశాల్లో క్షయ వ్యాధి కేసులు పెరుగుతున్నాయంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేప్(డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు దేశాల వారిగా పెరుగుతున్న క్షయ వ్యాధి కేసుల, మరణాల సంఖ్యను నివేదికలో వెల్లడించింది. 2022లో ప్రపంచంలోనే అత్యధిక టీబీ కేసులు భారత్‌లోనే నమోదైనట్లు తన నివేదికలో వెల్లడించింది. సుమారు 30 దేశాల్లో దాదాపు 87 శాతం కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోని మొత్తం టీబీ కేసుల్లో దేశంలోనే దాదాపు 28 లక్షలకు పైగా కేసులు నమోదయ్యయని వారిలో సుమారు మూడు లక్షల మంది ఈ వ్యాధి కారణంగా చనిపోయినట్లు పేర్కొంది. మంగళవారం(నవంబర్ 07న) డబ్యూహెచ్‌వో అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. భారత్ తర్వాత ఇండోనేషియా(10%), చైనా(7.1%), పాకిస్తాన్(5.7), నైజీరియా(4.5%), బంగ్లాదేశ్(3.6%) డిమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(3.0%) కేసులు ఉన్నట్లు తెలిపింది. ఐతే భారత్ ఈ టీబీ కేసులను తగ్గించడంలో కూడా పురోగతి సాధించనట్లు నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉండగా, 2015లో ఒక లక్ష మందిలో సుమారు 258 రోగులు ఉండగా అది కాస్తా 2022లో 199కి పడిపోయింది. కానీ ఈ రేటు ఇప్పటికి ప్రపంచ సగటు ప్రతీ ఒక లక్ష మందికి 133తో పోలిస్తే చాలా అత్యధికంగా ఉందని పేర్కొంది. ఇక క్షయ వ్యాధి కారణంగా భారత్ మరణాలు 12%(అంటే ప్రతి వంద మందికి 12 మంది ఈ వ్యాధితో మరణించారు) మరణాలు సంభవించాయి. ఈ సంఖ్య ప్రపంచ సగటు 5.8 కంటే ఎక్కువుగా ఉంది. కాగా, సింగపూర్‌లో అత్యల్పంగా మరణాలు సంభవించగా చైనా మాత్రం 4% మరణాలతో 14వ స్థానంలో నిలిచింది. నిజానికి ఈ క్షయ వ్యాధి నయం చేయగలిగనప్పటికి, నిర్థారించడంలో ఆలస్యమైతే మరణాలు సంభవించే అవకాశం ఎక్కువ. ఈ పరిస్థితి కోవిడ్ మహమ్మారి తర్వాత మరింత ఎక్కువైంది. అంతేగాదు దాదాపు 192 దేశాల్లో సుమారు 75 లక్షల మందికి పైగా ప్రజలు టీబీతో బాధపడుతున్నారంటూ డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. (చదవండి: ఫైర్ డిటెక్షన్ పరికరాన్ని కనిపెట్టిన భారత సంతతి విద్యార్థి!) -
టీబీ వ్యాధిని ముందుగానే గుర్తించాలి
- డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డెరైక్టర్ పల్లవి - లిల్లీ ఎండీఆర్-టీబీ సంస్థ సహకారంతో కెమిస్టులకు ప్రత్యేక శిక్షణ ఎంజీఎం : టీబీ వ్యాధిని ముందుగానే గుర్తించినట్లరుుతే కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందకుండా ఉంటుందని డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డెరైక్టర్ పల్లవి అన్నారు. గురువారం స్థానిక డ్రగ్ కంట్రోల్ కార్యాలయంలో ‘టీబీ వ్యాధిని అరికట్టేందుకు కెమిస్టుల పాత్ర’పై లిల్లీ ఎండీఆర్-టీబీ సంస్థ ప్రతినిధులు పల్లవితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా టీవీ వ్యాధిని అరికట్టడంతోపాటు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లిల్లీ ఎండీఆర్-టీబీ అనే స్వచ్ఛంద సంస్థ కెమిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. టీబీ వ్యాధి మొదట దగ్గుతో మొదలై జ్వరం, బరువు తెగ్గడం లక్షణాలు కలిగి ఉంటాయని పేర్కొన్నారు. అలాగే కెమిస్టులు ప్రిస్కిప్షన్ లేకుండా ముందులు ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కెమిస్టులకు అవగాహన : లిల్లీ ఎండీఆర్-టీబీ ప్రతినిధులు టీబీ వ్యాధిని అంతమొందించడంతోపాటు అరికట్టడంలో కెమిస్టుల పాత్ర కీలకమని లిల్లీ ఎండీఆర్-టీబీ ప్రతినిధులు సూచించారు. దగ్గుతో బాధపడుతున్న వారు నామమాత్రపు మందులు వాడడం వల్ల వ్యాధి పెరిగే అవకాశంతోపాటు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా లిల్లీ ఎండీఆర్-టీబీ సంస్థ కెమిస్టులకు టీబీ వ్యాధి లక్షణాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మెడికల్ షాపునకు వెళ్లిన వ్యక్తి జబ్బు నయం కాకపోతే.. ఆర్ఎంపీ వద్దకు, మరో వైద్యుడి వద్దకు వెళ్తున్నారని, ఇలా వ్యాధికి సరైన మందులు అందకపోవడంతో వ్యాధి ప్రభావం పెరిగే ఆవకాశం స్పష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. టీబీ వ్యాధిని ప్రాథమిక దశలోనే అరికట్టేందుకు కెమిస్టులకు శిక్షణా కార్యక్రమాలతోపాటు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులు సంబంధిత వైద్యులు చెప్పిన కోర్సును వాడినప్పుడు మాత్రమే ఆ వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చన్నారు. లేదంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయన్నారు. జిల్లాలో 103 మంది కెమిస్టులకు అవగాహన కల్పించగా.. 70 మంది సంస్థ ద్వారా పనిచేసేందుకు నిర్ణరుుంచినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 530 మందిని కెమిస్టులు టీబీ అనుమానితులుగా గుర్తించి వైద్య పరీక్షలు చేయించగా.. ఇందులో 44 మందికి పాజిటివ్ నివేదిక వచ్చిందని పేర్కొన్నారు. కెమిస్టులు ఇలాగే ముందుకు సాగితే టీబీ వ్యాధిని అరికట్టవచ్చని వారు పేర్కొన్నారు. -
ఎస్తేర్ అనూహ్య కేసు విచారణలో జాప్యం
* ఘటన జరిగి ఏడాది పూర్తి * నిందితునికి టీబీ వ్యాధి సాక్షి ముంబై: ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య కేసు విచారణ జాప్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సంఘటన జరిగి ఇప్పటికే ఏడాది పూర్తయింది. మరోవైపు కేసుకు సంబంధించి ప్రధాన ఆధారాలుగా భావించిన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ ఇంతవరకు లభించలేదు. ఇక ఈ కేసులో నిందితుడైన చంద్రబాన్ సానప్ అలియాస్ లౌక్యాకు టీబీ వ్యాధి సోకిందని వె ళ్లడైంది. ఈ నేపథ్యంలో కేసు విచారణ జాప్యం కానుందని తెలుస్తోంది. ఎస్తేర్ అనూహ్య కేసు ముంబైతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. గత ఏడాది జనవరి అయిదవ తేదీన విజయవాడలో రెలైక్కిన అనూహ్య కుర్లా నుంచి అదృశ్యమై కంజూర్‌మార్గ్-భాండూప్ రోడ్డుపక్కన పొదలలో 16న శవమైతేలిన సంగతి తెలిసిందే. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని అక్కడ లభించిన బట్టల ఆధారంగా గుర్తించారు. ఈ సంఘటనతో ముంబైలో మహిళల భద్రతపై తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. తెలుగు సంఘాలతోపాటు అనేక స్వచ్ఛంద, రాజకీయ సంస్థలు నిరసనలను వ్యక్తం చేస్తు ర్యాలీలు నిర్వహించాయి. ఎట్టకేలకు నిందితుడు చంద్రబాన్‌ను మార్చి రెండవ తేదీన పట్టుకున్నారు. ఘటన జరిగిన 85 రోజులకు మే 26వ తేదీన పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ సంఘటన జరిగి సంవత్సరం పూర్తి అయినప్పటికీ కేసు విచారణ మాత్రం కొనసాగుతోంది. నిందితుడు చంద్రబాన్ సానప్కు టీబీ సోకిందని తెలియడంతో, అతడిని విచారణ కోసం కోర్టులో హాజరుపరచవద్దని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో 2014 డిసెంబరు 22వ తేదీ నుంచి నిందితున్ని కోర్టులో హాజరుపరచడంలేదు. -
దోమల నియంత్రణకు వినియోగించే చేపలు?
1. జంతువుల నుంచి మానవులకు సోకే వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? జూనూసిస్ (Zoonosis) 2. మానవునిలో సాధారణ ఫ్లూ చికిత్సలో వాడే ఔషధాలు? అమాంటడిన్, రిమాంటడిన్ 3. మానవునికి సోకే బర్డ ఫ్లూ, స్వైన్ ఫ్లూ చికిత్సలో వాడే ప్రత్యేక ఔషధాలు? టమీఫ్లూ (ఒసెల్టామవిర్), రెలెంజ (జనామవిర్) 4. ప్రపంచ మధుమేహ దినోత్సవం? నవంబరు 14 5. ‘ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్’ ఎక్కడ ఉంది? బ్రసెల్స్, బెల్జియం 6. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ 7. ప్రపంచ క్షయ దినోత్సవం? మార్చి 24 8. {పపంచవ్యాప్తంగా మధుమేహ రోగులు అత్యధికంగా ఉన్న దేశం? చైనా (భారత్, అమెరికా వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి) 9. గర్భాశయ ముఖ క్యాన్సర్ (ఇ్ఛటఠిజీఛ్చి ఇ్చఛ్ఛిట) కారక వైరస్? హ్యూమన్ పాపిల్లోమ వైరస్ 10. దేశంలో తొలిసారిగా ఏ్ఛఞ్చ్టజ్టీజీట ఆ గ్చఛిఛిజ్ఛీను ఎప్పుడు ప్రారంభించారు? 1997 11. భారత్‌లో తొలిసారిగా ఎయిడ్సను ఎప్పుడు, ఎక్కడ కనుగొన్నారు? 1986, చెన్నై 12. క్షయ రోగులపై సమగ్ర సమాచారాన్ని అందించే డేటాబేస్? నిక్షయ్ 13. ప్రపంచ పార్కిన్‌సన్‌స దినోత్సవం? ఏప్రిల్ 11 14. ఈ ఏడాది చైనాలో మానవునికి సంక్రమించిన కొత్త బర్డ ఫ్లూ వైరస్‌గా దేన్ని గుర్తించారు? H10N8 15. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ వైరాలజీ ఎక్కడుంది? పుణే 16. చికున్ గున్యా వ్యాధి కారకం? చిక్‌వి (Chikv) (ఇది ఒక టోగా వైరస్ ఆల్ఫావైరస్, ఆర్బోవైరస్) 17. మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని తొలిసారిగా కనుగొన్నవారు? సర్ రొనాల్డ్ రాస్ 18. {r-Mోమా వ్యాధి కారకం? క్లామిడియ ట్రకోమ్యాటిస్ 19. సిఫిలిస్ అనే లైంగికంగా సంక్రమించే వ్యాధి కారకం? ట్రిపొనిమా ప్యాలిడం 20. ప్రపంచ ఆరోగ్య సంస్థ డెరైక్టర్ జనరల్? మార్గరెట్ చాన్ 21. హెచ్ఐవీని తొలిసారిగా కనుగొన్నవారు? ల్యూక్ మారిటనీర్, ఫ్రాంకోమస్ బార్సినోస్సీ (1983లో) 22. శరీరంలో ఏ కీలక తెల్ల రక్తకణాలపై HIV ప్రత్యేకంగా దాడి చేస్తుంది? ఖీ4 లింఫోసైట్స్ 23. పరాగ రేణువుల అలర్జీ ద్వారా వచ్చే జ్వరం? హే జ్వరం 24. అలర్జీ కారక వయ్యారిభామ (మాచర్లకంప) శాస్త్రీయ నామం? పార్థీనియం హిస్టిరోఫోరస్ 25. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కడుంది? న్యూఢిల్లీ 26. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటెరిక్ డిసీజెస్ ఎక్కడుంది? కోల్‌కతా 27. క్షయ బ్యాక్టీరియా ఏ ఆకారంలో ఉంటుంది? దండాకారం (బాసిల్లస్) 28. నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? పుణే 29. 'Typbar' పేరుతో ఒక సరికొత్త 'Typho id Conjugate Vaccine' ను దేశంలో ఏ ఫార్మా కంపెనీ విడుదల చేసింది? భారత్ బయోటెక్ 30. అమ్మవారు వ్యాధి నివారణకు ఇచ్చే టీకా? వారిసెల్లా టీకా 31. తామర, కాండిడియాసిస్, మైసిటిస్మస్, అథ్లెట్స్ఫుట్ అనే వ్యాధులు ఏ కారకాల ద్వారా వ్యాపిస్తాయి? శిలీంధ్రాలు 32. ప్రముఖ ఆస్ట్రోఫిజిస్ట్ స్టీఫన్ హాకింగ్సకు ఉన్న వ్యాధి? అమయాట్రాపిక్ లాటిరల్ స్ల్కిరోసిస్/ లవ్గ్రెఫిగ్ వ్యాధి 33. {r-Mోమా వ్యాధి వల్ల ఏ అవయవం ప్రభావితమవుతుంది? కన్ను 34. క్షయను సమగ్రంగా నియంత్రించి, నివారించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈైఖీ (Directly Observed Treatment Shortcourse) కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1995 35. ప్రపంచ మలేరియా దినోత్సవం? ఏప్రిల్ 25 36. మలేరియా వ్యాధి చికిత్స కోసం 2012లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సరికొత్త ఔషధం? సిన్రియం (పైపరాక్విన్) 37. ఎయిడ్స ప్రబలత చాలా తక్కువ ఉన్న ప్రాంతాల్లో అధిక ప్రాధాన్యతతో అవగాహన కల్పించే ఉద్దేశంతో Red Ribbon Express (RRE) తొలిసారిగా ఎప్పుడు ప్రారంభమైంది? డిసెంబరు 1 , 2007 38. హషిమొటో వ్యాధి ఏ అవయవానికి చెందింది? అవటు గ్రంథి 39. గనేరియా వ్యాధి కారకం? నిస్సేరియా గనేరియా 40. టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణ కోసం చేసే పరీక్ష? వైడల్ టెస్ట్ 41. సిఫిలిస్ వ్యాధి నిర్ధారణ కోసం నిర్వహించే పరీక్ష? VDRL (వెనెరల్ డిసీజ్ రీసెర్చ ల్యాబొరేటరీ టెస్ట్) 42. వేరుశనగ, ఇతర పప్పుదినుసుల్లో ఉండే హానికారక శిలీంధ్ర విష పదార్థాలు? అఫ్లటాక్సిన్స 43. గర్భాశయ ముఖ క్యాన్సర్ కారక వైరస్‌ను తొలిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త? హరాల్డ్ జర్ హాసన్ 44. బొట్యులిజం/ఫుడ్ పాయిజనింగ్ వ్యాధి కారకం? క్లాస్ట్రీడియం బొట్యులినం 45. కోరింత దగ్గు (Whoopling Cough) వ్యాధి కారకం? బోర్తుటెల్లా పెర్తుసిస్ 46. గర్భిణుల ఆహారంలో ఫోలిక్ ఆమ్లం (ఆ9 విటమిన్ లోపం ద్వారా శిశువులో వచ్చే వ్యాధి? స్పైన్ బెఫైడ్ 47. పార్కిన్‌సన్‌స వ్యాధిలో నాడీ క్షీణత ద్వారా ఏర్పడని కీలక న్యూరోట్రాన్సమీటర్? డోపమైన్ 48. పోలియో కారక వైరస్? పికోర్న వైరస్ 49. భారత్‌లో 'Expanded Programme on Immunization' అనే టీకా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1978 50. అతి పెద్ద బ్యాక్టీరియం ఏది? ఎపులోపిసియం ఫిషల్ సోని (50 Microns పరిమాణం) 51. క్షయ నివారణకు నవజాత శిశువునకు అందించే టీకా? BCG (బాసిల్లస్ కాల్మేట్ గ్వెరిన్) 52. ధమనుల్లో కొవ్వు పేరుకుని, అవి గట్టిబడి ఇరుకుగా మారడం వల్ల వచ్చే వ్యాధి? అథెరో స్ల్కిరోసిస్ 53. మ్యాడ్ కౌ వ్యాధి కారకం? ప్రయాన్ 54. నిలకడ నీటిలో దోమలు పెట్టిన గుడ్ల నుంచి ఏర్పడే డింభకాలను నియంత్రించడానికి వినియోగించే డింభకాహార చేపలు? గాంబూసియా అఫినిసిస్, మెనో అండ్ ట్రౌట్ 55. ఆహారంలో ప్రోటీన్ల లోపం ద్వారా చిన్నారుల్లో ఏర్పడే శారీరక మాంద్యత? క్వాషియోర్కార్ 56. గవద బిళ్లల కారక వైరస్? మార్బిల్లి వైరస్ 57. జపనీస్ ఎన్సిఫలైటిస్ వ్యాధి వల్ల ఏ అవయవం వాపు చెందుతుంది? మెదడు 58. క్షయ చికిత్సలో వాడే ఔషధాలు? ఐసోనియాజిడ్, పైరాజినమైడ్, ఇథాంబ్యుటాల్ 59. షిజెల్లోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాధి ప్రధాన లక్షణం? జిగట విరేచనాలు 60. కలరా వ్యాధి చికిత్సలో వాడే ఔషధం? టెట్రాసైక్లిన్ 61. తొలిసారిగా చికున్‌గున్యా వ్యాధిని ఏ దేశంలో గుర్తించారు? టాంజానియా (1953) 62. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఏ భాగానికి అత్యధికంగా క్యాన్సర్ సోకుతుంది? పురుష గ్రంథి (Prostate gland) 63. కలరా బ్యాక్టీరియా సాధారణంగా జీర్ణ నాళంలోని ఏ భాగంలో అభివృద్ధి చెందుతుంది? చిన్నపేగు 64. లేని దృశ్యాలను, శబ్దాలను అనుభూతి పొందే మానసిక వ్యాధి? స్కిజోఫ్రీనియ 65. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ ఎక్కడుంది? బెంగళూరు 66. గవద బిళ్లలు ఏ అవయవానికి సోకుతాయి? పెరోటిడ్ రకపు లాలాజల గ్రంథులు 67. ప్లేగు వ్యాధి కారకం? ఎర్సీనియపైస్టిస్ 68. కుష్టు వ్యాధి కారకం? మైకోబ్యాక్టీరియం లెప్రే -
బెంజీన్ ముప్పు
=గేటర్ గజగజ =పెరుగుతున్న వాహన కాలుష్యమే కారణం =క్యాన్సర్, గుండెపోటు, టీబీ వ్యాధులు ప్రబలే అవకాశం సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌పై ‘బెంజీన్’ భూతం కోరలు చాస్తోంది. వాతావరణంలో ఈ మూలకం మోతాదు శ్రుతి మించుతోంది. ‘సిటీ’జనుల్లో క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలడానికి కారణమవుతోంది. క్యూబిక్ మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములు దాటకూడని ఈ మూలకం వార్షిక మోతాదు గ్రేటర్లో ఇపుడు 8.4 మైక్రోగ్రాములకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. మహానగరంలో వాహనాల సంఖ్య 38 లక్షలకు చేరుకోవడం.. ఇందులో పదేళ్లకు మించిన కాలం చెల్లిన వాహనాలు సుమారు 10 లక్షల మేర ఉండడంతో నగరం పొగచూరుతోంది. మరోవైపు కల్తీ ఇంధనాల వాడకం పెరగడం, పెట్రోలు, డీజీలు వంటి పెట్రో ఉత్పత్తులను విచక్షణారహితంగా వినియోగిస్తుండటం వెరసి బెంజీన్ భూతం జడలు విప్పుతోందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవధులు దాటితే అనర్థమే తీయటి వాసన గల బెంజీన్ మూలకం మోతాదు అవధులు దాటితే అనర్థమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అతి త్వరగా గాలిలో ఆవిరిగా మారుతుంది. దీనికి మండే స్వభావమూ అధికమే. ఈ మూలకం విచ్ఛిన్నం అయ్యేందుకు 10-30 ఏళ్లు పడుతుంది. అంటే వాతావరణంలో సుదీర్ఘకాలం దీని ప్రభావం ఉంటుందన్నమాట. ఇది గాలి ప్రవాహం ద్వారా ఒక చోట నుంచి మరొక చోటకు తరలి వెళుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావం అధికంగా ఉన్న చోట క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలుతాయని పీసీబీ శాస్త్రవేత్త వీరన్న ‘సాక్షి’కి తెలిపారు. వాహన కాలుష్యంతోనే ముప్పు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం అన్నిరకాల వాహనాలు (ద్విచక్రవాహనాలు, కార్లు, జీపులు, బస్సులు, ఆటోలు) కలిపి 38 లక్షలున్నాయి. ఇందులో పదేళ్లకు పైబడిన వాహనాలు పదిలక్షల మేర ఉన్నాయి. ఈ వాహనాల సామర్థ్యం దెబ్బతినడంతో వీటి నుంచి విపరీతంగా పొగ వెలువడుతుంది. ఫలితంగా నగరంలో కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. అలాగే సిటీలో పెట్రోలుతో నడిచే వాహనాలకు ఏటా 5400 లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్ వాహనాలకు 12వేల లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. పైగా వాహనాల జాబితాలో ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ప్రతిరోజు 600 కొత్త వాహనాలు రిజిష్టర్ అవుతున్నట్లు రవాణా అధికారుల అంచనా. కానీ మహానగరంలో రహదారులు 8 శాతం మేరకే అందుబాటులో ఉండడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగి ఇంధన వినియోగం అధికమౌతోంది. కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఈ వాయుకాలుష్యంలో బెంజీన్ మోతాదు కూడా ఏటేటా పెరుగుతూ ఉంది. కాగా 2015 నాటికి వాహనాల సంఖ్య 45 లక్షలకు చేరుకోనున్నట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలతో పోల్చుకుంటే ప్రస్తుతానికి నగరంలో వాహనాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వాహన సాంద్రత మాత్రం ఎక్కువగానే ఉంది. పరిశ్రమలు సైతం.. ప్లాస్టిక్, డిటర్జెంట్, క్రిమిసంహారకాలు, రబ్బరు, బల్క్‌డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లోనూ బెంజీన్ మోతాదు ఎక్కువగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి కళ్లుగప్పి పారిశ్రామికవర్గాలు విడుదల చేస్తున్న వాయువుల్లో బెంజీన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. క్యాన్సర్ ప్రబలడం తథ్యం బెంజీన్ కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు, మూత్రకోశ క్యాన్సర్లు ప్రబలే ప్రమాదం ఉంది. నగరంలో ఇటీవల ఈ క్యాన్సర్ల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మాస్క్‌లు ధరించినా అవి గాలిని పూర్తిగా ఫిల్టర్ చేయలేవు. కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చేయాలి. కల్తీ ఇంధనాల వినియోగం తగ్గించాలి. వాహనాల్లో యూరో-4 ప్రమాణాలను తప్పనిసరి చేస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది. - డాక్టర్ మోహనవంశీ, క్యాన్సర్ వైద్యనిపుణుడు, ఒమేగా ఆసుపత్రి