దేశాల్లో క్షయ వ్యాధి కేసులు పెరుగుతున్నాయంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేప్(డబ్ల్యూహెచ్‌ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు దేశాల వారిగా పెరుగుతున్న క్షయ వ్యాధి కేసుల, మరణాల సంఖ్యను నివేదికలో వెల్లడించింది. 2022లో ప్రపంచంలోనే అత్యధిక టీబీ కేసులు భారత్‌లోనే నమోదైనట్లు తన నివేదికలో వెల్లడించింది. సుమారు 30 దేశాల్లో దాదాపు 87 శాతం కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోని మొత్తం టీబీ కేసుల్లో దేశంలోనే దాదాపు 28 లక్షలకు పైగా కేసులు నమోదయ్యయని వారిలో సుమారు మూడు లక్షల మంది ఈ వ్యాధి కారణంగా చనిపోయినట్లు పేర్కొంది.
మంగళవారం(నవంబర్ 07న) డబ్యూహెచ్‌వో అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. భారత్ తర్వాత ఇండోనేషియా(10%), చైనా(7.1%), పాకిస్తాన్(5.7), నైజీరియా(4.5%), బంగ్లాదేశ్(3.6%) డిమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(3.0%) కేసులు ఉన్నట్లు తెలిపింది. ఐతే భారత్ ఈ టీబీ కేసులను తగ్గించడంలో కూడా పురోగతి సాధించనట్లు నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉండగా, 2015లో ఒక లక్ష మందిలో సుమారు 258 రోగులు ఉండగా అది కాస్తా 2022లో 199కి పడిపోయింది. కానీ ఈ రేటు ఇప్పటికి ప్రపంచ సగటు ప్రతీ ఒక లక్ష మందికి 133తో పోలిస్తే చాలా అత్యధికంగా ఉందని పేర్కొంది.
ఇక క్షయ వ్యాధి కారణంగా భారత్ మరణాలు 12%(అంటే ప్రతి వంద మందికి 12 మంది ఈ వ్యాధితో మరణించారు) మరణాలు సంభవించాయి. ఈ సంఖ్య ప్రపంచ సగటు 5.8 కంటే ఎక్కువుగా ఉంది. కాగా, సింగపూర్‌లో అత్యల్పంగా మరణాలు సంభవించగా చైనా మాత్రం 4% మరణాలతో 14వ స్థానంలో నిలిచింది. నిజానికి ఈ క్షయ వ్యాధి నయం చేయగలిగనప్పటికి, నిర్థారించడంలో ఆలస్యమైతే మరణాలు సంభవించే అవకాశం ఎక్కువ. ఈ పరిస్థితి కోవిడ్ మహమ్మారి తర్వాత మరింత ఎక్కువైంది. అంతేగాదు దాదాపు 192 దేశాల్లో సుమారు 75 లక్షల మందికి పైగా ప్రజలు టీబీతో బాధపడుతున్నారంటూ డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
(చదవండి: ఫైర్ డిటెక్షన్ పరికరాన్ని కనిపెట్టిన భారత సంతతి విద్యార్థి!)
Comments
Please login to add a commentAdd a comment