టీబీ వ్యాధిని ముందుగానే గుర్తించాలి
- డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డెరైక్టర్ పల్లవి
- లిల్లీ ఎండీఆర్-టీబీ సంస్థ సహకారంతో కెమిస్టులకు ప్రత్యేక శిక్షణ
ఎంజీఎం : టీబీ వ్యాధిని ముందుగానే గుర్తించినట్లరుుతే కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందకుండా ఉంటుందని డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డెరైక్టర్ పల్లవి అన్నారు. గురువారం స్థానిక డ్రగ్ కంట్రోల్ కార్యాలయంలో ‘టీబీ వ్యాధిని అరికట్టేందుకు కెమిస్టుల పాత్ర’పై లిల్లీ ఎండీఆర్-టీబీ సంస్థ ప్రతినిధులు పల్లవితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా టీవీ వ్యాధిని అరికట్టడంతోపాటు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లిల్లీ ఎండీఆర్-టీబీ అనే స్వచ్ఛంద సంస్థ కెమిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. టీబీ వ్యాధి మొదట దగ్గుతో మొదలై జ్వరం, బరువు తెగ్గడం లక్షణాలు కలిగి ఉంటాయని పేర్కొన్నారు. అలాగే కెమిస్టులు ప్రిస్కిప్షన్ లేకుండా ముందులు ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
కెమిస్టులకు అవగాహన : లిల్లీ ఎండీఆర్-టీబీ ప్రతినిధులు టీబీ వ్యాధిని అంతమొందించడంతోపాటు అరికట్టడంలో కెమిస్టుల పాత్ర కీలకమని లిల్లీ ఎండీఆర్-టీబీ ప్రతినిధులు సూచించారు. దగ్గుతో బాధపడుతున్న వారు నామమాత్రపు మందులు వాడడం వల్ల వ్యాధి పెరిగే అవకాశంతోపాటు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా లిల్లీ ఎండీఆర్-టీబీ సంస్థ కెమిస్టులకు టీబీ వ్యాధి లక్షణాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మెడికల్ షాపునకు వెళ్లిన వ్యక్తి జబ్బు నయం కాకపోతే.. ఆర్‌ఎంపీ వద్దకు, మరో వైద్యుడి వద్దకు వెళ్తున్నారని, ఇలా వ్యాధికి సరైన మందులు అందకపోవడంతో వ్యాధి ప్రభావం పెరిగే ఆవకాశం స్పష్టంగా ఉంటుందని పేర్కొన్నారు.
టీబీ వ్యాధిని ప్రాథమిక దశలోనే అరికట్టేందుకు కెమిస్టులకు శిక్షణా కార్యక్రమాలతోపాటు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులు సంబంధిత వైద్యులు చెప్పిన కోర్సును వాడినప్పుడు మాత్రమే ఆ వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చన్నారు. లేదంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయన్నారు. జిల్లాలో 103 మంది కెమిస్టులకు అవగాహన కల్పించగా.. 70 మంది సంస్థ ద్వారా పనిచేసేందుకు నిర్ణరుుంచినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 530 మందిని కెమిస్టులు టీబీ అనుమానితులుగా గుర్తించి వైద్య పరీక్షలు చేయించగా.. ఇందులో 44 మందికి పాజిటివ్ నివేదిక వచ్చిందని పేర్కొన్నారు. కెమిస్టులు ఇలాగే ముందుకు సాగితే టీబీ వ్యాధిని అరికట్టవచ్చని వారు పేర్కొన్నారు.