అంతర్వేదిలో...అఖిల్ స్క్రిప్ట్ | VV Vinayak to direct Akkineni Akhil? | Sakshi
Sakshi News home page

అంతర్వేదిలో...అఖిల్ స్క్రిప్ట్

Published Tue, Dec 16 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

అంతర్వేదిలో...అఖిల్ స్క్రిప్ట్

అంతర్వేదిలో...అఖిల్ స్క్రిప్ట్

అక్కినేని అఖిల్‌ను కథానాయకునిగా పరిచయం చేసే బాధ్యతను తనపై ఉంచిన హీరో నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. శ్రీ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు మంగళవారం తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో విలేకరులకు వినాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో సినిమా స్క్రిప్టును పూజలో ఉంచాం. ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. వెలిగొండ శ్రీనివాస్ అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు. కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నారు. అమోల్ రాథోడ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తుతం కథానాయిక ఎంపిక జరుగుతోంది. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతాం. అభిమానులు కోరుకునే మాస్, మసాలా అంశాలన్నీ ఇందులో ఉంటాయి. అఖిల్‌లో మంచి నటుడు ఉన్నాడు’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement