
అఖిల్ సినిమాకు ముహూర్తం ఖరారు!
అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ సినిమాకు ముహూర్తం ఖరాయినట్టు తెలుస్తోంది. నవంబర్ 14న షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని ఫిలింనగర్ వర్గాల సమచారం. అఖిల్ కోసం సినిమా స్కిప్ట్ రెడీ చేసి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్... నాగార్జునకు కథ వినిపించారని చెబుతున్నారు. నాగార్జున కొన్ని మార్పులు సూచించారని సమాచారం. అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తిచేసి సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారట నిర్మాతలు.
అన్నపూర్ణ స్టూడియోస్, హీరో నితిన్ సోదరి ఈ సినిమాను నిర్మించే అవకాశముందంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, చోటా కె నాయడు కెమెరా అందించనున్నారు(ట). వెలిగొండ శ్రీనివాస్ కథ తయారుచేశారు. కోన వెంకట్, గోపీ మోహన్ మాటలు అందించనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.