వినాయక్ డైరెక్షన్లో నితిన్ | Nithin another movie with vv vinayak | Sakshi
Sakshi News home page

వినాయక్ డైరెక్షన్లో నితిన్

Published Sat, Jan 30 2016 1:33 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

వినాయక్ డైరెక్షన్లో నితిన్

వినాయక్ డైరెక్షన్లో నితిన్

దిల్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సాధించారు నితిన్, వినాయక్. ఈ సినిమా హీరోగా నితిన్కు మాస్ ఇమేజ్ తీసుకువస్తే, దర్శకుడిగా వినాయక్కు స్టార్ స్టేటస్ అందించింది.  ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందంటూ వార్తలు వినిపించినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే అఖిల్ సినిమాతో మరోసారి వినాయక్, నితిన్లు కలిసి పనిచేశారు.

నితిన్ నిర్మాతగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ సినిమాతో అక్కినేని నటవారసుడు వెండితెరకు పరిచయం అయ్యాడు. హీరోగా నితిన్కు మంచి బ్రేక్ ఇచ్చిన వినాయక్, నిర్మాతగా మారి చేసిన సినిమాకు మాత్రం నిరాశపరిచాడు. దీంతో నిర్మాతగా నితిన్ తొలి ప్రయత్నమే నష్టాలు మిగిల్చింది. ఇప్పుడు ఆ నష్టాలను పూడ్చేందుకు రెడీ అవుతున్నాడు వినాయక్.

ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా పనుల్లో బిజీగా ఉన్న వినాయక్, ఆ సినిమా తరువాత నితిన్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. అఖిల్ సినిమా తరువాత, నితిన్ ఫ్యామిలీతో కలిసి కనిపించని వినాయక్ తాజాగా స్పీడున్నోడు సెట్కు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి వచ్చాడు. దీంతో నితిన్, వినాయక్ల సినిమా కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కూడా నితిన్ తన సొంత బ్యానర్పై నిర్మించాడనికి రెడీ అవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement