హను రాఘవపూడితో నితిన్ | Hanu ragavapudi to work with Nithin | Sakshi
Sakshi News home page

హను రాఘవపూడితో నితిన్

Published Thu, Aug 11 2016 1:33 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

హను రాఘవపూడితో నితిన్

హను రాఘవపూడితో నితిన్

అందాల రాక్షసి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి తరువాత కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో కమర్షియల్ సక్సెస్ను సాధించాడు. ఈ సక్సెస్తో స్టార్ హీరోల దృష్టిలో పడ్డ హను రాఘవపూడి, అక్కినేని వారసుడు అఖిల్ రెండో సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అయితే హను, అఖిల్లు వేరు వేరు నిర్మాణ సంస్థలకు సైన్ చేసి ఉండటంతో ఈ ఇద్దరి కాంబినేషన్ ఇప్పట్లో సెట్ అయ్యేట్టుగా కనిపించటం లేదు.

అందుకే గ్యాప్ తీసుకోవటం ఇష్టం లేని హను రాఘవపూడి, మరో యంగ్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల అ..ఆ.. సినిమాతో 50 కోట్ల మార్క్ను రీచ్ అయిన., నితిన్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్లో చేసేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement