
అక్కినేని అఖిల్ రాక
ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ సోమవారం రాజమండ్రి వచ్చారు. ఇటీవల తల్లిని కోల్పోయిన ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్‌ను పరామర్శించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు వెళ్తూ కొద్దిసేపు రాజమండ్రి షెల్టాన్ హోటల్లో బస చేశారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు విమానంలో అఖిల్, అక్కినేని అభిమాన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.సర్వేశ్వరరావు వచ్చారు. చాగల్లు వెళ్లి వీవీ వినాయక్‌ను పరామర్శించిన అనంతరం సాయంత్రం 3.15 గంటలకు తిరిగి విమానంలో హైదరాబాద్ వెళ్లారు. టౌన్‌వైడ్ నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ 30వ వార్డు ఇన్‌చారి ్జకాటం రజనీకాంత్ తదితరులు అఖిల్‌కు మధురపూడి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అక్కినేని అఖిల్ పూర్తి స్థాయిలో హీరోగా నటించనున్న సినిమాకు వినాయక్ దర్శకత్వం వహించనున్నారు.
- రాజమండ్రి కల్చరల్