
హీరో అభిరామ్, హీరోయిన్ రూప
సుధాకర్ రెడ్డి, కీర్తీ లత, అభిరామ్, రూప, అంజి బాబు, రాజవ్వ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. రమేశ్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఏబీ సినిమాస్, నిహల్ ప్రొడక్షన్స్‌పై బత్తిని కీర్తీలత గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కరీంనగర్ జిల్లాలోని మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
రమేశ్ చెప్పాల మాట్లాడుతూ.. ‘‘నవ్వించడమే లక్ష్యంగా తీస్తున్న చిత్రమిది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. ఆ హాట్ టాపిక్ ఆధారంగా కథ సిద్ధం చేశా. కథలోని నేటివిటీ పోకూడదని పూర్తిగా ఆర్గానిక్ (స్థానికులు) నటీనటులతో రియాలిటీగా నిర్మిస్తున్నాం’’ అన్నారు. బత్తిని కీర్తిలతో రాజా నరేందర్ చెట్లపెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment