న్యూఢిల్లీ: చైనా రాజధాని బీజింగ్‌లో జరిగే సమావేశాలకు సమావేశానికి సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరీ, సురవరం సుధాకర్‌రెడ్డిలను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ఆహ్వానించింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు ‘ప్రపంచ రాజకీయ పార్టీలతో సీపీసీ చర్చలు’ పేరిట ఈ సమావేశాలు జరగనున్నాయి.
గురువారం చైనాకు బయలుదేరి వెళ్లనున్న ఏచూరీ, సుధాకర్‌రెడ్డిలు ఇందులో భాగంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలతో భేటీ అవుతారు. ఈ సమావేశాలకు 120 దేశాలనుంచి దాదాపు 200 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment