Sitaram ecuri
-
ఏచూరీ, సుధాకర్‌రెడ్డిలకు చైనా ఆహ్వానం
న్యూఢిల్లీ: చైనా రాజధాని బీజింగ్‌లో జరిగే సమావేశాలకు సమావేశానికి సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరీ, సురవరం సుధాకర్‌రెడ్డిలను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ఆహ్వానించింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు ‘ప్రపంచ రాజకీయ పార్టీలతో సీపీసీ చర్చలు’ పేరిట ఈ సమావేశాలు జరగనున్నాయి. గురువారం చైనాకు బయలుదేరి వెళ్లనున్న ఏచూరీ, సుధాకర్‌రెడ్డిలు ఇందులో భాగంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలతో భేటీ అవుతారు. ఈ సమావేశాలకు 120 దేశాలనుంచి దాదాపు 200 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు. -
రేపు సీపీఎం సభ
హాజరుకానున్న సీతారాం ఏచూరి వరంగల్, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వరంగల్ నగరంలోని ఇస్లామియా కళాశాల మైదానంలో సీపీఎం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి హాజరుకానున్నారు. జిల్లాలో సీపీఎం అభ్యర్థులు ఆరు స్థానా ల్లో పోటీచేస్తున్న విషయం తెలిసిందే. వరంగల్ తూర్పు అసెం బ్లీ నియోజకవర్గ స్థానంలో మెట్టు శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రజాసేవ చేసేవారిని, సమస్యలపై ఉద్యమించేవారిని ఎన్నికల్లో గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ‘తూర్పు’లో జరిగిన రోడ్‌షో, బహిరంగసభలో పాల్గొన్నారు. తాజాగా భారీ సభ నిర్వహించి పార్టీ నాయకులు, శ్రేణులను భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు పట్టున్న కార్మిక, కర్షక, గుడిసెవాసులతోపాటు వివిధ సంఘాల శ్రేణులను కదిలించేందుకు ఈ సభ ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ చెప్పారు. సభకు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
రాజకీయ లబ్ధికే కాంగ్రెస్ ‘టి’ నిర్ణయం: ఏచూరి, వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే హడావుడిగా, అత్యంత బాధ్యతారహితం గా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీసుకొన్న ఈ నిర్ణయం బెడిసికొట్టడం ఖాయమని మంగళవారం పార్లమెంటు ప్రాంగణ ంలో విడివిడిగా మాట్లాడుతూ జోస్యం చెప్పారు. ఈ నిర్ణయంతో సీమాంధ్ర నిరసనలతో హోరెత్తుతుండటానికి కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుం దన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య పెరుగుతున్న వైషమ్యాలను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దేనన్నారు. విభజనతో తలెత్తే కీలక సమస్యలను పరిష్కరించకుండా తొందరపాటుతో వ్యవహరిస్తుండడం వ ల్లే ప్రజల్లో ఆగ్రహావేశాలు, వైషమ్యాలు పెరుగుతున్నాయని ఏచూరి అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ తొలి నుంచీ సొంత వ్యవహారంగా చూస్తోందని వెంకయ్య ఆరోపించారు.