సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే హడావుడిగా, అత్యంత బాధ్యతారహితం గా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీసుకొన్న ఈ నిర్ణయం బెడిసికొట్టడం ఖాయమని మంగళవారం పార్లమెంటు ప్రాంగణ ంలో విడివిడిగా మాట్లాడుతూ జోస్యం చెప్పారు.
ఈ నిర్ణయంతో సీమాంధ్ర నిరసనలతో హోరెత్తుతుండటానికి కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుం దన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య పెరుగుతున్న వైషమ్యాలను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దేనన్నారు. విభజనతో తలెత్తే కీలక సమస్యలను పరిష్కరించకుండా తొందరపాటుతో వ్యవహరిస్తుండడం వ ల్లే ప్రజల్లో ఆగ్రహావేశాలు, వైషమ్యాలు పెరుగుతున్నాయని ఏచూరి అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ తొలి నుంచీ సొంత వ్యవహారంగా చూస్తోందని వెంకయ్య ఆరోపించారు.
రాజకీయ లబ్ధికే కాంగ్రెస్ ‘టి’ నిర్ణయం: ఏచూరి, వెంకయ్య
Published Wed, Aug 7 2013 3:47 AM | Last Updated on Mon, Sep 17 2018 5:32 PM
Advertisement