తెలంగాణ అంశంపై కాంగ్రెస్ చర్చలు జరుపుతుంది: దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. బిల్లుతయారీకి సమయానికి రాజీ సూత్రం తీసుకొస్తామని ఆయన అన్నారు. రాజ్యాంగపరంగా అన్ని విధివిధానాలను అనుసరిస్తామని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించుకుంటామని ఉద్యోగులకు హామీ ఇస్తున్నామంటూ దిగ్విజయ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సెటిలయిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని ఆయన తెలిపారు.
రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలతో చర్చలు జరిపేందుకు ఇప్పటికీ ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ ఓ కమిటీ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై తొలుత క్యాబినెట్ భేటీ అవుతుంది అని దిగ్విజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై తీర్మానం చేయాలని కేంద్రం అసెంబ్లీకి సూచిస్తుంది. తీర్మానం తర్వాత కేంద్రం ఓ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పారు. ఓ వైపు విభజన ప్రక్రియ అధికారికంగా కొనసాగుతూనే ఉంటుందని, మరోవైపు పార్టీ అందరి అభిప్రాయాలు తెలుసుకుంటుందని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.