న్యూఢిల్లీ: రాష్ట్రవిభజనపై నిరసనగా సీమాంధ్రలో పెద్దఎత్తునా ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్ర మంత్రులు కూడా పార్లమెంటును విభజన సెగతో కాకపుట్టించారు. గత రెండు రోజులుగా పార్లమెంట్‌లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర మంత్రులు సమైక్యా నినాదాలతో పార్లమెంట్‌లో హొరెత్తిస్తున్నారు.
కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై తాము రెండు రోజులుగా పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించామన్నారు. దీనిపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయమై రేపు కూడా సమావేశమవుతామని హర్షకుమార్ తెలిపారు. సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా ఉన్న విషయాన్ని అధిష్టానం గుర్తించిందన్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలు కలిసి ఆందోళన చేస్తున్నారని ఆయన తెలిపారు. అవసరమైనప్పుడు మంత్రులు కూడా సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొంటారని హర్షకుమార్ చెప్పారు.
గత 2 రోజులుగా పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నాం: ఎంపీ హర్షకుమార్
Published Tue, Aug 6 2013 11:26 PM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement