రేపు సీపీఎం సభ | Tomorrow CPM meeting | Sakshi
Sakshi News home page

రేపు సీపీఎం సభ

Published Tue, Apr 22 2014 3:00 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

రేపు సీపీఎం సభ - Sakshi

రేపు సీపీఎం సభ

  • హాజరుకానున్న సీతారాం ఏచూరి
  •  వరంగల్, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వరంగల్ నగరంలోని ఇస్లామియా కళాశాల మైదానంలో సీపీఎం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి హాజరుకానున్నారు. జిల్లాలో  సీపీఎం అభ్యర్థులు ఆరు స్థానా ల్లో పోటీచేస్తున్న విషయం తెలిసిందే. వరంగల్ తూర్పు అసెం బ్లీ నియోజకవర్గ స్థానంలో మెట్టు శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు.

    ప్రజాసేవ చేసేవారిని, సమస్యలపై ఉద్యమించేవారిని ఎన్నికల్లో గెలిపించాలని కోరుతున్నారు.  కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ‘తూర్పు’లో జరిగిన రోడ్‌షో, బహిరంగసభలో పాల్గొన్నారు.

    తాజాగా భారీ సభ నిర్వహించి పార్టీ నాయకులు, శ్రేణులను భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు పట్టున్న కార్మిక, కర్షక, గుడిసెవాసులతోపాటు వివిధ సంఘాల శ్రేణులను కదిలించేందుకు ఈ సభ ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ చెప్పారు. సభకు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement