![Extra Ordinary Man Producer Sudhakar Reddy About Salaar Movie Release Date - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/5/sudhakar.jpg.webp?itok=u5Qij1BS)
నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎక్స్‌ట్రా'. ఆర్డినరీ మ్యాన్’ అనేది ఉపశీర్షిక. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ తేదీని మొదట డిసెంబర్ 23న ప్రకటించారు. కానీ ఆ తర్వాత విడుదల తేదీ మార్చారు. దీనిపై నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడారు. సలార్ రావడం వల్లే రిలీజ్ డేట్స్ మార్చాల్సి వచ్చిందని తెలిపారు.
సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..'నాని హాయ్ నాన్న సినిమా మొదట డిసెంబర్ 22న రిలీజ్ డేట్ ఉంది. మా సినిమా కూడా 23న అనుకున్నాం.. కానీ అదే సమయంలో ప్రభాస్ సలార్ వచ్చింది. అందుకే మేం రిలీజ్ డేట్స్ సర్దుబాటు చేసుకున్నాం. ఎందుకంటే పెద్ద సినిమా రావడంతోనే మేం తప్పుకున్నాం. భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి.. అందుకు అనుగుణంగానే సర్దుకున్నాం. ఒక రోజు ముందు నాని 7వ తేదీన వచ్చేస్తున్నాడు. మేం 8న వస్తున్నాం. అంతే కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. పండగ తర్వాత డేట్స్ కుదరవని ముందే రిలీజ్ చేస్తున్నాం' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment