- ఒకేరోజు 1.05 లక్షల మొక్కలు నాటిన గ్రామస్తులు
సిద్దిపేట రూరల్: ‘శభాష్.. ఇబ్రహీంపూర్. లక్ష మొక్కలు నాటి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు. వాన దేవుడు కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాను’ అని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌లో ఒకేరోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డితో కలసి మంత్రి ప్రారంభించారు.
‘‘హరితహారంలో భాగంగా గ్రామంలో 2.10 లక్షలు మొక్కలు నాటనున్నారు. వాటిలో 1.05 లక్షల మొక్కలను ఒక్క రోజే నాటాం. దీంతో ఇబ్రహీంపూర్ చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది’’ అని తెలిపారు. ‘‘ఇబ్రహీంపూర్‌లో ఇంటింటి మరుగుదొడ్ల నిర్మించుకున్నారు. ఇంకుడు గుంతలు కూడా నిర్మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే ఆదర్శంగా నిలిచారు. ఇదే స్ఫూర్తి అంతటా కొనసాగాలి’’ అని మంత్రి కోరారు.
శభాష్.. ఇబ్రహీంపూర్
Published Mon, Jul 11 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM
Advertisement
Advertisement