
.ఐదుగురు మోసగాళ్లు అరెస్టు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోసాలకు, కిడ్నాప్‌లకు పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసి, వారి నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
అల్లూరుకు చెందిన దేవరకొండ విజయ్, శ్రావణ్, అంకయ్య, సునీల్, శ్యామ్యూల్ సులభమార్గంలో ధనార్జన చేయాలని అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. దొంగనోట్లు ఇస్తామని, తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ కడప, నల్గొండ, నె ల్లూరుతో పాటు పలు జిల్లాల్లో మోసాలకు పాల్పడి లక్షలాది రూ పాయలు దక్కించుకున్నారు.
కిడ్నాప్‌లకు పాల్పడి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. అల్లూరుకు చెందిన కిరణ్‌ను నగర శివారు ప్రాంతం ముత్తుకూరు రోడ్డులో కిడ్నాప్ చేశారు. వీరిపై రూరల్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. గురువారం