వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుధాకర్ రెడ్డిపై దాడి జరిగింది.
కడప : వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుధాకర్ రెడ్డిపై దాడి జరిగింది. లింగాల మండలం గునకలపల్లిలో ప్రత్యర్థులు ఆయనపై బాంబులతో ఈరోజు తెల్లవారుజామున దాడి చేశారు. ఈ ఘటన నుంచి సుధాకర్ రెడ్డి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.