లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచినా తమను పట్టించుకోకుండా పక్క పార్టీ వారికి కోట్ల రూపాయలు ఆఫర్ చేయడంపై తెలుగుదేశం జెడ్పీటీసీ సభ్యులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌పై గెలిచిన జెడ్పీటీసీలు మా సంగతేంటని పార్టీ నేతలను నిలదీసినట్లు సమాచారం. తమకు కూడా రూ.30 లక్షలు చొప్పున ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.
పశ్చిమ ప్రకాశానికి చెందిన ఓ జెడ్పీటీసీ, తూర్పు ప్రకాశానికి చెందిన మరో జెడ్పీటీసీ వైఎస్సార్ సీపీతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థ్ధిగా మన్నె రవీంద్ర పేరును ప్రతిపాదించడంతో ఈ పదవిని ఆశించిన ఈదర వర్గం అసంతృప్తిగా ఉంది. ఆ వర్గం దెబ్బ తీస్తుందా.. అన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. బలాబలాలు సమానంగా ఉండటంతో లాటరీ తప్పదన్న సంశయం వారిని పట్టిపీడిస్తోంది. ఎన్నికల సంఘం కూడా సీరియస్‌గా స్పందించడంతో టీడీపీకి గొంతులో వెలక్కాయపడ్డట్లయింది. ఎన్నిక వాయిదా వేస్తే వైఎస్సార్ సీపీ నుంచి ఒకరిని తమ వైపు తిప్పుకోవచ్చన్న పాచిక పారకపోవడం... సొంత పార్టీ నుంచే అసంతృప్తులు తలెత్తడంతో వారిలో ఆదివారం జరిగే ఎన్నికపై నీలినీడలు అలుముకున్నాయి.
మెజార్టీ వైఎస్సార్ సీపీకి ఉన్నా...
ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 31 జెడ్పీటీసీ స్థానాలు రాగా తెలుగుదేశం పార్టీకి 25 స్థానాలు మాత్రమే వచ్చిన సంగతి తెలి సిందే. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అధికారం దక్కడంతో ఎలాగైనా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా నాయకత్వం ఆ దిశగా అడుగులు వేసింది. వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన జెడ్పీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేసింది.
బీసీ సంఘాల ఆగ్రహం
బీసీ వ్యక్తి జెడ్పీ చైర్మన్ కాకుండా అడ్డుకోవడంపై జిల్లా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓసీ జనరల్‌కు కేటాయించిన సీటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ కులాలకు చెందిన విద్యావంతుడైన డాక్టర్ నూకసాని బాలాజీకి ఇవ్వాలని నిర్ణయించింది. బీసీలకు పదవి దక్కడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ.. బీసీ నేతను ఓడిం చేందుకు చేస్తున్న కుయుక్తులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
బేరసారాలు ఇలా...
రూ.60 లక్షల నుంచి కోటీ 20 లక్షల రూపాయల వరకూ బేరసారాలు జరిపారు. కొత్తపట్నం జెడ్పీటీసీకి రూ.60 లక్షలు, కంభం జెడ్పీటీసీకి కోటి 20 లక్షల రూపాయల వరకూ ఇచ్చారంటూ తెలుగుదేశం పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు. చివరకు డబ్బుకు కక్కుర్తి పడిన ఆ ముగ్గురిని తమ వైపునకు తిప్పుకున్నారు. తొలుత ఏడుగురికిపైగా తమ వైపు వస్తారంటూ తెలుగదేశం నాయకులు ప్రచారం చేసుకున్నారు.
అటు వైపు ముగ్గురు మాత్రమే అడుగులు వేయడంతో కథ అడ్డం తిరిగింది. కలెక్టర్ సమక్షంలోనే అరాచకం సృష్టించారు. అర్ధవీడు జెడ్పీటీసీ సభ్యురాలికి కోటి రూపాయలు ఇస్తామంటూ ఆఫర్ చేసినా తనకు బీఫాం ఇచ్చిన పార్టీకే కట్టుబడి ఉంటానని ఆమె స్పష్టం చేయడంతో ఈ నెల 5న జరిగిన జెడ్పీ సమావేశంలో హైడ్రామా సృష్టించి ఎన్నిక వాయిదా పడేలా చేశారు. ఆ తర్వాత కూడా వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ కుటుంబ సభ్యులను ప్రలోభపెట్టారు.
ప్రత్యేక పరిశీలకుడి రాక...
జెడ్పీ చైర్మన్ ఎంపిక కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడిని పంపించనున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లాపరిషత్ ఎన్నికల ప్రక్రియపై సుధాకర్‌రెడ్డి అనే న్యాయవాది వేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించి ప్రత్యేక పరిశీలకునితో పాటు ఎన్నిక ప్రక్రియను వీడియో తీయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. జిల్లాలో మీడియాను సైతం దూరంగా ఉంచాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
టీడీపీ జెడ్పీటీసీల్లో అసంతృప్తులు
Published Fri, Jul 11 2014 2:10 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement