
అందుబాటులో ఉండే నేతలు కావాలి
కామన్ మ్యాన్ Voice
ఉన్న ఊరును వదిలి ఉపాధి కోసం నగరానికి వచ్చారు. పదేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఇదే ఇప్పుడు సొంతూరైంది. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడే ఓటేస్తున్నారు. కానీ బతుకు బండికి భరోసా మాత్రం దొరకలేదంటున్నాడు విద్యానగర్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి. ఏ నాయకుడూ ఇతవరకు సాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘బతుకు బండి లాగించడానికి చేసిన ప్రయత్నాలు కొన్ని విఫలమయ్యాయి. కుటుంబమంతా కష్టపడి పని చేస్తేనే ఫలితం ఉంటుందని నిర్ణయించుకుని మీర్చి బజ్జి బండి పెట్టా. నాతో పాటు భార్య, ఇద్దరు పిల్లలు కష్టపడతారు.
రోడ్డుపై కాస్త ఇబ్బంది కలిగితే అంతా చిర్రుబుర్రులాడుతుంటారు. పదే ళ్లుగా ఈ వ్యాపారాన్నే నమ్ముకొని బతుకున్నాం. మాకు నేతలు, ప్రభుత్వాలు తోడ్పాటు దొరకలేదు. ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నామే తప్ప తమలాంటి వారికి ఏవిధంగా అండగా నిలవాలనే ఆలోచన నాయకులకూ లేదు’ అని పేర్కొన్నాడు. ‘మాలాంటి చిరు బతుకులకు అండగా ఉండే నేతలు కావాలి. పొదుపు సంఘాలకు ఇచ్చే ప్రోత్సాహకాలు మాకూ ఇస్తే బాగుపడతాం. నాయకులు ఎన్నికలప్పుడే కాకుండా గెలిచాక కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతున్నాడు. - అంబర్‌పేట