హిందూపురం పట్టణంలోని బెంగుళూరు రోడ్డులో ఉన్న ఇంటర్నేషన్ ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది.
హిందూపురం పట్టణంలోని బెంగుళూరు రోడ్డులో ఉన్న ఇంటర్నేషన్ ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. పెళ్లి కూతురికి సంబంధించిన నగలు చోరీకి గురయ్యాయి. హిందూపురం మండలం నీలగుంటపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి కుమారై అపర్ణ వివాహం, బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తితో గురువారం జరగనుంది. బుధవారం రాత్రి రిసెస్షన్ కార్యక్రమం జరిగింది. భోజనాలకు వెళ్లిన సమయంలో బ్యాగులో దాచిన 75 గ్రాముల బంగారు నగలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.