
నాగర్‌కర్నూల్ క్రైం: ఓ సివిల్ కాంట్రాక్టర్‌పై కొందరు దుండగులు యాసిడ్‌తో దాడికి పాల్పడ్డారు. కాంట్రాక్టర్ సుధాకర్‌రెడ్డి నాగర్ కర్నూల్‌లో నివాసముంటున్నాడు. సోమవారం నలుగురు దుండగులు ఇంట్లో ప్రవేశించి ఆయన భార్య స్వాతిరెడ్డి చేతులను వెనక్కి కట్టేశారు.
సుధాకర్‌రెడ్డి నోటికి బట్ట కట్టి ముఖంపై యాసిడ్ చల్లి పరారయ్యారు. సుధాకర్‌రెడ్డిని పొరుగువారు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మంగళవారం ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వ్యాపారంలో సుధాకర్‌రెడ్డి భాగస్వామి అయిన స్నేహితుడు ఘటన జరిగిన సోమవారం ఉదయమే ఇంటికి వచ్చి వెళ్లడంతో అతడిపై అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టారు.