ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(2023) లో మట్టికథ సినిమా మూడు అవార్డులకు ఎంపికైంది. అజయ్ వేద్ హీరోగా కనకవ్వ, బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో పవన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మట్టి కథ’. అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. పల్లెటూరి కుర్రోడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయి? మట్టిలోని మధురానుభూతి ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి దరఖాస్తు చేయగా మూడు అవార్డులకు ఎంపికైంది. బెస్ట్ ఇండియన్ ఫ్యూచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీల్లో విజేతగా నిలిచింది.
(చదవండి: లియో సినిమాలో ముగ్గురు హీరోయిన్లు!)
ఇదే ఇండో ఫ్రెండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇటీవల బలగం సినిమాకు అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్డర్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలో నటుడు ప్రియదర్శి ఎంపికయ్యాడు. ఇప్పుడు అదే కేటగిరీలో మట్టి కథ సినిమా హీరో అజయ్ వేద్.. ఉత్తమ నటుడిగా ఎంపిక కావటం మూవీపై అంచనాలను పెంచేసింది. అంతే కాదు.. ఇదే ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో.. మమ్మనీతమ్ అనే తమిళ సినిమాకు హీరో విజయ్ సేతుపతి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ సినిమాల సరసన ఇప్పుడు మట్టి కథ నిలవడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment