kanakavva
-
‘మట్టి కథ’కు మూడు అంతర్జాతీయ అవార్డులు
ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(2023) లో మట్టికథ సినిమా మూడు అవార్డులకు ఎంపికైంది. అజయ్ వేద్ హీరోగా కనకవ్వ, బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో పవన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మట్టి కథ’. అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. పల్లెటూరి కుర్రోడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయి? మట్టిలోని మధురానుభూతి ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి దరఖాస్తు చేయగా మూడు అవార్డులకు ఎంపికైంది. బెస్ట్ ఇండియన్ ఫ్యూచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీల్లో విజేతగా నిలిచింది. (చదవండి: లియో సినిమాలో ముగ్గురు హీరోయిన్లు!) ఇదే ఇండో ఫ్రెండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇటీవల బలగం సినిమాకు అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్డర్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలో నటుడు ప్రియదర్శి ఎంపికయ్యాడు. ఇప్పుడు అదే కేటగిరీలో మట్టి కథ సినిమా హీరో అజయ్ వేద్.. ఉత్తమ నటుడిగా ఎంపిక కావటం మూవీపై అంచనాలను పెంచేసింది. అంతే కాదు.. ఇదే ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో.. మమ్మనీతమ్ అనే తమిళ సినిమాకు హీరో విజయ్ సేతుపతి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ సినిమాల సరసన ఇప్పుడు మట్టి కథ నిలవడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. -
కనకవ్వ: అన్నీ బతుకుపాటలే..
పాటల కవ్వంతో కష్టాలను చిలికిన కోయిలమ్మ కనకవ్వ! అన్నీ బతుకుపాటలే. బతుకుని.. మెతుకుని ఇచ్చిన పాటలు. పల్లె పదాలతో జీవితాన్ని పూదోట చేసుకున్న అవ్వ ఇప్పుడు..యూట్యూబ్ సింగర్! రెక్కల కష్టాన్ని నమ్ముకుంటూ జీవనం సాగించే కనకవ్వ తన కష్టాన్ని మర్చిపోవడానికి పాటను ఆసరా చేసుకుంది. పొద్దున లేచింది మొదలు పాటతోనే రోజు మొదలయ్యే కనకవ్వ జానపదాలు ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటున్నాయి. జానపదాలు, బతుకమ్మ పాటలు పాడే 63 ఏళ్ల కనకవ్వ సొంతూరు తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా బొడిగేపల్లి గ్రామం. వాడల్లో తిరుగుతూ పండ్లు అమ్ముకుంటూ, పొలాల్లో కూలిపనులకు వెళ్లే అవ్వ ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్‌లకు పాడుతూ, అందుకు తగ్గట్టు పాదం కదుపుతూ యూ ట్యూబ్‌లో సింగర్ కనకవ్వగా మారింది. ‘‘నర్సాపల్లి గండిలోన గంగాధారి ఆడినెమలి ఆటలకు గంగాధారి మగానెమలి మోసపోయే గంగాధారి’’ ‘‘కోలు కోలు కోలూ బతుకమ్మ పూలూ మా బతుకుళ్ల రంగు రంగు పూలూ..’’ ‘‘గెన్నెరామ గెన్నెరామ గెన్నెరామ గెట్టుమీద గున్నమామిడో పిల్లడో..’’ ‘‘గూట్లేమో కుసున్నాయి గురియవన్నె పావురాలు.. సక్కని కనుల వారజూడవో ఓ బాలయ్య..’ ‘‘సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో ... గుండెల్లో కొలువున్న గూడెం జాతర’ ఎన్నో పల్లె పదాలు. శ్రమైక జీవన సౌందర్యాలు. సంసార నావను దాటించడానికి రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కనకవ్వ జీవితమంతా ఈ పాటలే పూదోటగా మారి నడిపించాయి. ఇప్పుడా పాటలే ఆమెను పదిమందికి పరిచయం చేశాయి. ఆ పల్లెపాటల పందిరి కనకవ్వ మాటల్లోనే... ‘‘పండ్ల గంప ఎత్తుకొని వాడ వాడలా తిరుగుతా అమ్ముతుండేదాన్ని. ఆ బరువు తెలియకుండా ఉండటానికి పాటలు పాడేదాన్ని. నాతోడ ఐదుగురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు. నా చిన్నతనం అంతా మా అమ్మ పాటలల్లనే గడిచిపోయింది. అవి వింటూ, పాడుతూ పెరిగినం. బతుకమ్మల దగ్గర మా అమ్మ పాడకపోతే ఆట ఆగిపోయేది. అంత బాగ పాడేది. యాభై ఏళ్ల కిందటి మాట. ఇప్పటి లెక్కన సదువులా ఏమన్ననా.. పదేళ్ల పిల్లప్పుడే అమ్మనాయిన పెళ్లి చేసిన్రు. అత్తగారింట పాట అన్నీ కష్టాలే. పదేండ్ల ఆటలన్నీ పుట్టింట్లనే వదిలిపెట్టిన. ఇరవై ఏళ్లు నిండకముందే ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు పుట్టిన్రు. మా ఆయన బాలయ్య వ్యవసాయం చేసేటోడు. కానీ, ఏదీ అక్కరకు రాలేదు. ఆయన చేసిన కష్టం ఆయనకే సరిపోయేది. అదేమని అడిగితే.. పెద్ద పెద్ద గొడవలు. పిల్లలకు యేలకింత ముద్ద పెట్టాలని కూలిపనులకు పోయేదాన్ని. ఏ పనిల ఉన్న పాట మాత్రం ఆగలేదు. అదే నాకు కాస్త ఊరటినిచ్చేది. ఇల్లు ఊడుస్తా పాటనే, అన్నం వండతా పాటనే, పొలాలకు పోయినా పాటనే. బతకడానికి ఊరూరా తిరిగా! ఊళ్లో బతకడం కష్టమైతుందని హైదరాబాద్‌ల ధూల్‌పేటలో పదేండ్లు ఉన్న. చిన్నపిల్లలను పెద్ద పిల్లలకు అప్పజెప్పి ఇండ్లళ్ల పనులు చేసేదాన్ని. పిల్లలను బతికించుకుంట ఒక్కో పైస దాచిపెట్టేదాన్ని. అక్కణ్ణుంచి మా తమ్ముడు గోదావరిఖనిలో ఉంటే ఆడికిబోయిన. అక్కడ పండ్లు అమ్మేదాన్ని. కూలీ పనులకు పోయిన. ఏ పని చేసినా పిల్లల గురించే బతికిన. పిల్లలందరికీ పెళ్లిళ్లు అయినయి. వాళ్ల పిల్లలు కూడా పెద్దోళ్లు అయిన్రు. వాళ్లే ఇప్పుడు నన్ను మంచిగ సూసుకుంటున్రు. ఏడెనిమిది నెలల క్రితం నేను పాటలు పాడుతుంటే మా పిల్లలు సెల్ఫోన్ల తీసి, అవి టీవీల వాళ్లకు పెడితే, వాళ్లు రమ్మని పిలిచారు. అక్కడికెళ్లి పాడిన. దాంతో నా పాట అందరికీ తెలిసింది. పండ్ల గంప మూలకుపడ్డది ఎక్కడకన్న బోతే ఆడ నన్ను చూసినోళ్లు వెంటనే గుర్తుపడతరు. ‘నువ్వు కనకవ్వవు గదూ! నీ పాటలు శాన బాగుంటయ్ ’అని చెబుతుంటే మస్తు సంతోషమైతది. పండ్ల గంప మూలకు పడేసిన. పాటలు పాడేటానికి బోతున్న. ఇప్పుడు మోటు కష్టం లేదు. పాటపాడితే పేరొస్తుంది. నాలుగు పైసలొస్తున్నయి. నాకు ఏ సదువూ రాదు. పాటలు రాయలేదు. ఇన్నాళ్లు నాకు మతిల ఉన్న పాటలు పాడేదాన్ని. ఇప్పుడు వేరేవాళ్లు రాసిన పాటలుగిన పాడుతున్న. రాసినోళ్లు ఒకసారి పాడి వినిపిస్తే చాలు.. ఆ పదాలు గుర్తుపెట్టుకొని పాడేస్తున్న. ఇప్పుడు నన్ను సింగర్ కనకవ్వ అంటున్నరు. (నవ్వుతూ) సింగర్ అంటే ఏందో.. కానీ, నాకు వచ్చిన పదమల్లా పాటైంది. నా సొంతం పాటలే కాకుండా మరో పది పాటల దాకా పాడిన. మంచి పేరొచ్చింది. జీవితంల బాధలు ఎన్నో వస్తాయి పోతాయి. దిగులుపడవద్దు. ఒక రోజుకు అంతా మంచే జరుగుతది. ఓపిక పట్టాల’ అంటూ జానపదాల జల్లుతో వీనులవిందు చేసింది కనకవ్వ. నాగరిక ప్రపంచం ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాల్లోకి ఒదిగి తనను తాను వెతుక్కునే పనిలో ఎప్పుడూ ఉంటుంది. ఆ వెతుకులాటలో పల్లె తన కళను ఎప్పుడూ దోసిళ్ల కొద్ది నిండుగా అందిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ పల్లె కోయిలమ్మ కనకవ్వ రూపంలో మనల్ని అలరిస్తోంది. – నిర్మలారెడ్డి ఫొటోలు: నోముల రాజేష్ -
కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి
కారు, బైక్ ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిల్ల ఎక్స్ రోడ్డు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న తంగళ్లపల్లి గ్రామానికి చెందిన కనకవ్వ (50) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన ‘మిస్డ్‌కాల్’
కుత్బుల్లాపూర్: ఓ మిస్డ్ కాల్ అనుమానం రేపింది.. మహిళ మృతికి కారణమైంది.. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ప్రవీందర్‌రావు, బాధితులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం, ఎనగర్తి గ్రామానికి చెందిన కనకవ్వ(30)కు అదే మండలం ఆకారం గ్రామానికి చెందిన నర్సింహ(36)తో 2005లో వివాహం జరిగింది. ఎనిమిదేళ్ల పాటు స్వగ్రామంలోనే ఉన్న వీరు కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మండలం, గుండ్లపోచంపల్లికి వచ్చి నివాసముంటున్నారు. కనకవ్వ స్థానికంగా సీడ్స్ కంపెనీలో పనికి వెళ్తుండగా, నర్సింహ కారు డ్రైవర్. వీరికి నవ్వ(8) కుమార్తె ఉంది. భార్యపై అనుమానంతో నర్సింహ తరచు గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటలకు కనకవ్వ సెల్‌ఫోన్‌కు మిస్డ్ కాల్ వచ్చింది. దీంతో నర్సింహ ఆ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవడు చేశాడంటూ ఆమెను చితకబాదాడు. పక్కనే ఉంటున్న అత్తగారి ఇంటికి తరిమి కొట్టాడు. కనకవ్వ సృ్పహ కోల్పోయింది. పేట్ బషీరాబాద్ ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించగా తలకు తీవ్ర గాయాలు కావడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నర్సింహను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో వచ్చిన మిస్డ్ కాల్ నంబరు విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ప్రాణం తీసిన ‘మిస్డ్ కాల్’
కుత్బుల్లాపూర్: వేకువజామున వచ్చిన ఓ మిస్డ్ కాల్ మహిళ మృతికి కారణమైంది. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవీందర్రావు, బాధితులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం, ఎనగుర్తికి చెందిన కనకవ్వ(30)కు అదే మండలం ఆకారం గ్రామానికి చెందిన నర్సింహ(36)తో 2005లో వివాహం జరిగింది. ఎనిమిదేళ్ల పాటు స్వగ్రామంలోనే ఉన్న వీరు కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మండలం, గుండ్లపోచంపల్లికి వచ్చి ఉంటున్నారు. కనకవ్వ స్థానికంగా ఉన్న ఓ సీడ్స్ కంపెనీలో పనికి వెళ్తుండగా, నర్సింహ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి కుమార్తె నవ్వ(8) ఉంది. భార్యపై అనుమానంతో నర్సింహ తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటలకు కనకవ్వ సెల్‌ఫోన్‌కు మిస్డ్ కాల్ వచ్చింది. దీంతో నర్సింహ ఆ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవడు చేశాడంటూ ఆమెను తీవ్రంగా చితకబాదాడు. పక్కనే ఉంటున్న అత్తగారి ఇంటికి తరిమి కొట్టాడు. దెబ్బలకు తాళలేక కనకవ్వ స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెను పేట్ బషీరాబాద్‌లోని ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించగా తలకు తీవ్ర గాయాలు కావడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నర్సింహను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో వచ్చి న మిస్డ్ కాల్ నంబరుపై పోలీసులు ఆరా తీస్తున్నారు.