Matti Katha Movie
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 29 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం థియేటర్లలో 10కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నా అందులో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దీంతో ప్రేక్షకులు చూపు ఓటీటీలపై పడింది. అందుకు తగ్గట్లే ఈ వీకెండ్లో అంటే గురువారం, శుక్రవారం దాదాపు 29 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని చిత్రాలు మాత్రం స్పెషల్. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఇకపోతే ఈ వారం ఓటీటీల్లో 29 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. వీటిలో మార్క్ ఆంటోని, మట్టికథ, మిస్టేక్, ప్రేమ విమానం సినిమాలతో పాటు మిస్టర్ నాగభూషణం అనే వెబ్ సిరీస్.. తెలుగు ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంగ్లీష్, హిందీ సినిమాలు, సిరీసులు కూడా బోలెడన్ని ఉన్నాయి. ఇంతకీ ఓవరాల్ లిస్ట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (అక్టోబరు 13) జీ5 ప్రేమ విమానం - తెలుగు మూవీ అమెజాన్ ప్రైమ్ మార్క్ ఆంటోని - తెలుగు డబ్బింగ్ మూవీ ఇన్ మై మదర్స్ స్కిన్ - తగలాగ్ మూవీ ఎవ్రిబడీ లవ్ డైమండ్స్ - ఇటాలియన్ సిరీస్ ద బరియల్ - ఇంగ్లీష్ సినిమా హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్ - హిందీ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) హాట్ స్టార్ గూస్బంప్స్ - ఇంగ్లీష్ సిరీస్ సుల్తాన్ ఆఫ్ దిల్లీ - హిందీ సిరీస్ మథగమ్ పార్ట్ 2 -తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) నెట్‌ఫ్లిక్స్ ఇజగ్బాన్ - యోరుబా సినిమా కాసర్ గోల్డ్ - మలయాళ మూవీ ద కాన్ఫరెన్స్ - స్వీడిష్ చిత్రం క్యాంప్ కరేజ్ - ఉక్రేనియన్ సినిమా (అక్టోబరు 15) క్రిష్, త్రిష్ & బల్టిబాయ్: భారత్ హై హమ్ - హిందీ సిరీస్ (అక్టోబరు 15) గుడ్‌నైట్ వరల్డ్ - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) ఆహా మట్టికథ - తెలుగు సినిమా మిస్టేక్ - తెలుగు సినిమా సోనీ లివ్ సంతిత్ క్రాంతి సీజన్ 2 - మరాఠీ సిరీస్ ఫాంటమ్ - కొరియన్ సినిమా బుక్ మై షో టాక్ టూ మీ - ఇంగ్లీష్ మూవీ (అక్టోబరు 15) ద క్వీన్ మేరీ -ఇంగ్లీష్ చిత్రం (అక్టోబరు 15) ద ఈక్వలైజర్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) ఆపిల్ ప్లస్ టీవీ లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ - ఇంగ్లీష్ సిరీస్ లయన్స్ గేట్ ప్లే పాస్ట్ లైవ్స్ - ఇంగ్లీష్ సినిమా జియో సినిమా మురాఖ్ ద ఇడియట్ - హిందీ షార్ట్ ఫిల్మ్ రింగ్ - హిందీ షార్ట్ ఫిల్మ్ (అక్టోబరు 15) ద లాస్ట్ ఎన్వలప్ - హిందీ షార్ట్ ఫిల్మ్ (స్ట్రీమింగ్ అవుతోంది) ఈ-విన్ మిస్టర్ నాగభూషణం - తెలుగు సిరీస్ (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. గతవారం థియేటర్లు, ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజయ్యాయి. వాటి సంగతి పక్కనబెడితే ఈసారి మాత్రం ఏకంగా 35 వరకు కొత్త సినిమాలు/వెబ్ సిరీసులు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటిలో కొన్ని తెలుగు మూవీస్ ఉండగా.. దాదాపుగా హిందీ, ఇంగ్లీష్ చిత్రాలే ఉన్నాయి. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' 2.0.. హౌసులోకి ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్) అయితే ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల్లో ప్రేమ విమానం, మట్టి కథ సినిమాలతో పాటు మిస్టర్ నాగభూషణం, మథగమ్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇలా ఓవరాల్ గా 35 వరకు మూవీస్-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. ఇంతకీ ఇవన్నీ ఏయే ఓటీటీల్లో ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (అక్టోబరు 09-15 వరకు) అమెజాన్ ప్రైమ్ అవేర్నెస్ (స్పానిష్ సినిమా) - అక్టోబరు 11 ఇన్ మై మదర్స్ స్కిన్ (తగలాగ్ మూవీ) - అక్టోబరు 12 ఎవ్రిబడీ లవ్ డైమండ్స్ (ఇటాలియన్ సిరీస్) - అక్టోబరు 13 ద బరియల్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 13 నెట్‌ఫ్లిక్స్ మార్గాక్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 09 డైరీస్ సీజన్ 2 పార్ట్ 1 (ఇటాలియన్ సిరీస్) - అక్టోబరు 10 లాస్ట్ వన్ స్టాండింగ్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) - అక్టోబరు 10 బిగ్ వేప్: ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ జుల్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 11 వన్స్ అపాన్ ఏ స్టార్ (థాయ్ మూవీ) - అక్టోబరు 11 ప్యాక్ట్ ఆఫ్ సైలెన్స్ (స్పానిష్ సిరీస్) - అక్టోబరు 11 గుడ్‌నైట్ వరల్డ్ (జపనీస్ సిరీస్) - అక్టోబరు 12 ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 12 ఇజగ్బాన్ (యోరుబా సినిమా) - అక్టోబరు 13 కాసర్ గోల్డ్ (మలయాళ మూవీ) - అక్టోబరు 13 ద కాన్ఫరెన్స్ (స్వీడిష్ చిత్రం) - అక్టోబరు 13 క్యాంప్ కరేజ్ (ఉక్రేనియన్ సినిమా) - అక్టోబరు 15 హాట్ స్టార్ మథగమ్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబరు 12 గూస్బంప్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 13 సుల్తాన్ ఆఫ్ దిల్లీ (హిందీ సిరీస్) - అక్టోబరు 13 ఆహా మట్టికథ (తెలుగు సినిమా) - అక్టోబరు 13 జీ5 ప్రేమ విమానం (తెలుగు మూవీ) - అక్టోబరు 13 సోనీ లివ్ సంతిత్ క్రాంతి సీజన్ 2 (మరాఠీ సిరీస్) - అక్టోబరు 13 జియో సినిమా కోఫుకు (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 09 అర్మాండ్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 10 కమింగ్ ఔట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ టైమ్ మెషీన్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 11 ద లాస్ట్ ఎన్వలప్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 12 మురాఖ్ ద ఇడియట్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 13 రింగ్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 15 డిస్కవరీ ప్లస్ స్టార్ vs ఫుడ్ సర్వైవల్ (హిందీ సిరీస్) - అక్టోబరు 09 ఈ-విన్ మిస్టర్ నాగభూషణం (తెలుగు సిరీస్) - అక్టోబరు 13 బుక్ మై షో మిషన్ ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 11 టాక్ టూ మీ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 15 ద క్వీన్ మేరీ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 15 ఆపిల్ ప్లస్ టీవీ లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 13 లయన్స్ గేట్ ప్లే పాస్ట్ లైవ్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 13 (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న సుధీర్‌బాబు సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే!) -
ఆర్మూర్ హీరోకు అంతర్జాతీయ అవార్డు
ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లికి చెందిన అజయ్ వేద్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తాను హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా ‘మట్టి కథ’లో ఉత్తమ నటనకు గాను ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును కై వసం చేసుకున్నాడు. ఈమేరకు సదరు సంస్థ మంగళవారం అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఇప్పటి వరకు తమిళంలో మమ్మనీతం అనే సినిమాలో స్టార్ హీరో విజయ్ సేతుపతికి, బలగం సినిమాలో ప్రియదర్శికి మాత్రమే ద క్కింది. వీరి సరసన అజయ్ వేద్ నిలవడంతో మట్టి కథ సినిమాపై అటెన్షన్ బజ్ క్రియేట్ అయింది. సినీరంగంలో ప్రవేశం ఇలా.. ఆర్మూర్‌లోని మానస హైస్కూల్ కరస్పాండెంట్ గణేష్, పద్మ కుమారుడైన అజయ్ వేద్ తన బీటెక్, ఎంబీఏ పూర్తి చేసి రామానాయుడు స్టూడియోలో డిప్లొమా ఇన్ ఆక్టింగ్ పూర్తి చేసాడు. సినీ పరిశ్రమ లో అతనికి ఉన్న ఆసక్తితో పవన్ కడియాల దర్శకత్వంతో తెరకెక్కిన మట్టి కథ సినిమాలో హీరోగా అ వకాశం దక్కించుకున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రై లర్ ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్ర సాద్ విడుదల చేశారు. పల్లెటూరు అంటే పండు గలు, పబ్బాలకు ఇంటికి వచ్చి వెళ్లే ఊరు అన్నట్లు మారిపోయిన ఈ కాలంలో పల్లెటూరి కుర్రోడి ఆశ లు, ఆకాంక్షలు ఎలా ఉంటాయి, మట్టితో అనుబంధం, మట్టిలో మధురానుభూతి ఎలా ఉంటుంది అనే అంశంపై సినిమా నిర్మించారు మొదటి సినిమాలోనే అజయ్ వేద్ అంతర్జాతీయ అవార్డును కై వసం చేసుకోవడంతో తెలుగు సినిమా పరిశ్రమతో పాటు బంధువులు, తల్లిదండ్రులను అభినందిస్తున్నారు. -
‘మట్టి కథ’కు మూడు అంతర్జాతీయ అవార్డులు
ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(2023) లో మట్టికథ సినిమా మూడు అవార్డులకు ఎంపికైంది. అజయ్ వేద్ హీరోగా కనకవ్వ, బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో పవన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మట్టి కథ’. అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. పల్లెటూరి కుర్రోడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయి? మట్టిలోని మధురానుభూతి ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి దరఖాస్తు చేయగా మూడు అవార్డులకు ఎంపికైంది. బెస్ట్ ఇండియన్ ఫ్యూచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీల్లో విజేతగా నిలిచింది. (చదవండి: లియో సినిమాలో ముగ్గురు హీరోయిన్లు!) ఇదే ఇండో ఫ్రెండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇటీవల బలగం సినిమాకు అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్డర్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలో నటుడు ప్రియదర్శి ఎంపికయ్యాడు. ఇప్పుడు అదే కేటగిరీలో మట్టి కథ సినిమా హీరో అజయ్ వేద్.. ఉత్తమ నటుడిగా ఎంపిక కావటం మూవీపై అంచనాలను పెంచేసింది. అంతే కాదు.. ఇదే ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో.. మమ్మనీతమ్ అనే తమిళ సినిమాకు హీరో విజయ్ సేతుపతి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ సినిమాల సరసన ఇప్పుడు మట్టి కథ నిలవడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.