- సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో 20 మంది ఎర్రచందనం కూలీలను కాల్చి చంపడం, తెలంగాణలో ఉగ్రవాద కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న ఐదుగురు ఖైదీల ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. ఇంతవరకు కీలకమైన ఎర్రచందనం స్మగ్లర్‌ను అరెస్ట్ చేయకపోగా 20 మంది కూలీలను మాత్రం కాల్చి చంపారన్నారు. ఈ స్మగ్లర్లకు సహాయపడడంలో అధికార పార్టీ నాయకులకు సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయన్నారు. అలాగే, సూర్యాపేటలో ఉగ్రవాదుల చేతుల్లో పోలీసులు హతమైనందున.. ప్రతీకార హత్యలుగానే ఐఎస్‌ఐ ఉగ్రవాదులను చంపినట్లు కనిపిస్తోందన్నారు.