అప్పుల భారం మరో అన్నదాతను బలితీసుకుంది. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం పాతపాడులో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సాగు కోసం అప్పుల పాలైన సుధాకర్‌రెడ్డి (42) శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరేసుకుని మృతి చెందాడు. శనివారం ఉదయం ఇది గమనించిన కుటుంబ సభ్యులు భోరున విలపించారు. స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.