
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంపై తెరకెక్కుతోన్న చిత్రం ‘యాత్ర’. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు రోజులు ప్యాచ్‌వర్క్ మినహా పూర్తయింది. డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘తన పాలనతో ప్రజల హృదయాల్లో చెర గని ముద్ర వేసుకున్నారు రాజశేఖర రెడ్డిగారు.
60 రోజుల్లో 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలు.. అక్కచెల్లెళ్ల బాధలు.. రైతుల ఆవేదన తెలుసుకున్నారు వైఎస్‌గారు. ఈ సినిమా ఆయన ఇమేజ్‌కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. వైఎస్‌గారి తండ్రి రాజారెడ్డిగారి పాత్రలో జగపతిబాబు నటించారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment