
పులివెందుల వైఎస్ రాజారెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న వైఎస్ విజయమ్మ
సాక్షి, పులివెందుల: వైఎస్ రాజారెడ్డి 22వ వర్ధంతి సందర్భంగా ఆయనకు కుటుంబసభ్యులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. పులివెందుల రాజారెడ్డి ఘాట్‌లోని వైఎస్ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో పాటు కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజారెడ్డి మెమోరియల్ పార్కులోని ఆయన విగ్రహం వద్ద అంజలి ఘటించారు. జీసెస్ చారిటీస్‌లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ మనోహర్ రెడ్డి, దివంగత వివేకానందరెడ్డి కుమార్తె సునీత,అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment