పులివెందులలో వైఎస్ రాజారెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్ విజయమ్మ, కుటుంబ సభ్యులు
పులివెందుల: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి 22వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం ఉదయం పులివెందులలోని వైఎస్ సమాధుల తోటలో ఉన్న వైఎస్ జయమ్మ, వైఎస్ రాజారెడ్డిల ఘాట్ వద్ద వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, పులివెందుల వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు.
రాజారెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఉన్న వైఎస్ వివేకా సమాధి వద్ద, ఇతర కుటుంబీకుల సమాధులకు వైఎస్ విజయమ్మ పూలమాలలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. కాగా, కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్సార్‌సీపీ నేత పోచిమిరెడ్డి మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో దివంగత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment