మహానేతకు వైఎస్ విజయమ్మ నివాళి | YS Vijayamma Tribute to YS Rajasekhara Reddy at Idupulapaya | Sakshi
Sakshi News home page

మహానేతకు వైఎస్ విజయమ్మ నివాళి

Published Sun, Mar 16 2014 8:42 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

మహానేతకు వైఎస్ విజయమ్మ నివాళి - Sakshi

మహానేతకు వైఎస్ విజయమ్మ నివాళి

పులివెందుల: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. ఈ ఉదయం బెంగుళూరు నుంచి ఇడుపులపాయ చేరుకున్న వైఎస్‌ఆర్ సమాధి వద్దకు వెళ్లారు. మహానేతకు ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆమె అనంతపురం జిల్లాకు బయలుదేరారు.

కదిరి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని విజయమ్మ ప్రారంభించనున్నారు. ‘జన పథం’ పేరుతో కదిరిలో మున్సిపల్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. మధ్యాహ్నానికి పుట్టపర్తికి చేరుకుంటారు. అక్కడ రోడ్డు షో నిర్వహించి.. సాయంత్రం ఐదు గంటలకు హిందూపురం చేరుకుని రోడ్డు షో నిర్వహిస్తారు. పార్టీ విధానాలను ప్రజలకు వివరించడానికి నేటి నుంచి ఐదు రోజుల పాటు వైఎస్ విజయమ్మ జిల్లాలో పర్యటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement