- నివాళులర్పించిన జగన్, కుటుంబ సభ్యులు
కడప: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి వర్ధంతిని వైఎస్సార్ జిల్లా పులివెందులలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక లయోలా డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైఎస్ రాజారెడ్డి ఘాట్ వద్ద వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, డాక్టర్ ఎస్.పురుషోత్తమరెడ్డి తదితరులు జగన్‌తో కలిసి కొవ్వొత్తులు వెలిగించి కొద్దిసేపు మౌనం పాటించారు. వైఎస్ జయమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సమాధుల వద్ద కూడా నివాళులర్పించారు.
అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, కుమార్తె షర్మిల, కోడలు వైఎస్ భారతిరెడ్డి, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, వైఎస్ సోదరుడు వైఎస్ సుధీకర్‌రెడ్డి, సోదరి విమలమ్మ, వైఎస్ మేనత్తలు కమలమ్మ, రాజమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు ఇసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి డాక్టర్ సుగుణమ్మ, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్షుమ్మ, సతీమణి సమత, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి తదితరులు రాజారెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు.
ప్రత్యేక ప్రార్థనలు : పులివెందులలోని బాకరాపురంలో ఉన్న వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తొలుత వైఎస్ రాజారెడ్డి చిత్రపటం వద్ద జగన్డ్, విజయమ్మ నివాళులర్పించారు.