మాట్లాడుతున్న రాష్ట్రస్థాయి ప్రత్యేక సాధారణ పరిశీలకులు
మహబూబ్‌నగర్: శాసనసభ ఎన్నికలలో భాగంగా పంపిణీ చేసే ఓటరు సమాచార చీటీలను జాగ్రత్తగా పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నియమించిన రాష్ట్రస్థాయి ప్రత్యేక సాధారణ పరిశీలకులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ వి.నాయక్ తెలిపారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన ఓటరు సమాచారంతో పాటు మిగతా వాటిని కూడా సక్రమంగా పంపిణీ చేసేలా చూడాలన్నారు.
సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో జిల్లాలో ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న శాసనసభ ఎన్నికల పోలింగ్ సంసిద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు, అదేవిధంగా ఫిర్యాదుల సెల్‌కు వచ్చే అన్ని ఫిర్యా దులను ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేసి నిర్వహించాలని సూచించారు. సాధారణ పరిశీలకులు పోలింగ్ రోజున కంట్రోల్‌రూమ్‌కి వెళ్లి సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్ల జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు.
రాష్ట్రస్థాయి ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా మాట్లాడుతూ అదనపు బలగాలను రిజర్వ్‌లో ఉంచుకోవాలని, ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైనప్పు డు అత్యవసర సమయంలో వినియోగించుకునేలా పోలీస్ సిబ్బంది ఉండాలని సూచించారు. అన్ని పోలింగ్ బూతులు మ్యాపింగ్ చేయాలని, పోలింగ్ రోజు 144 సెక్షన్ విధించాలని, పోలింగ్ కేంద్రంలోకి ఎవరెవరిని అనుమతిస్తారో ప్రతి పోలింగ్ అధికారి ముందే తెలుసుకొని ఉండేలా అవగాహన కల్పించాలన్నారు.
పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి పంపించాలని, ఎవరైనా ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారం అందించినప్పుడు తక్షణమే సోషల్ మీడియా ద్వారా సరైన సమాచారం ఇచ్చే విధంగా సోషల్ మీడియా టీమ్‌ను అప్రమత్తం చేయాలని తెలిపారు.
♦ కలెక్టర్ జి.రవినాయక్ శాసనసభ ఎన్నికల నిర్వహణకు మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలలో చేసిన వివరాలను సమర్పించారు. జిల్లాలో 42మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 838 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొత్తగా ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డుల పంపిణీ, పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు, ఈవీఎంల ర్యాండమైజేషన్ ఫామ్ 12–డీ పంపి ణీ, హోం ఓటింగ్ అంశాలపై పవర్ పా యింట్ ప్రజంటేషన్ లో వివరించారు.
♦ ఎస్పీ హర్షవర్ధన్ మాట్లాడుతూ పోలీసుపరంగా మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాలను కలుపుకొని మొత్తం 881 కేంద్రాలకు సంబంధించి బందోబస్తును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో భాగంగా అంతర్ జిల్లా చెక్‌పోస్టుల ఏర్పాటు, అక్రమంగా తరలించే మద్యం, నగదు సీజ్ చేయడం, బైండోవర్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు సంజయ్‌కుమార్ మిశ్రా, పోలీస్ పరిశీలకురాలు ఇళక్కి యా కరునాగరన్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment