నల్లగొండ: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతోపాటు డబ్బు, మద్యం సరఫరా, ఉచితాలపై పోలీస్, సర్వేలెన్స్ బృందాల ద్వారా పటిష్ట నిఘా ఉంచామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్ తెలిపారు. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌హెచ్ అజయ్ బందూ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్, ఐటీ, వాణిజ్య, పోలీస్ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఎస్పీ అపూర్వరావుతో కలిసి కలెక్టర్ కర్ణన్ హాజరై మాట్లాడారు.
పోలీసులు, ఇతర సర్వే లెన్స్ టీమ్‌ల ద్వారా మొత్తం రూ.42,00,46,385 విలువైన నగదు, బంగారం, మద్యం, వస్తువులు సీజ్ చేసినట్లు తెలిపారు. అందులో రూ.11,02,1319 నగదును, రూ.27,01,35,625 విలువ గల బంగారు, వెండి, ఆభరణాలు.. రూ.2,89,22,622 విలువ గల 1,27,548 లీటర్ల మద్యం, 6,66,37 డ్రగ్స్, 22,77,398 విలువైన ఉచితాలకు సబంధించిన సొమ్మును తనిఖీల్లో స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్పరెన్సులో ఎస్.పి.అపూర్వ రావు,ఎం.సి.సి.నోడల్ అధికారి, స్పెషల్ కలెక్టర్(భూ సేకరణ) హరి సింగ్ , ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్,ఇతర అధికారులు పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్ల పరిశీలన
తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో కౌంటింగ్ కేంద్రాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ.కర్ణన్, జిల్లా ఎస్పీ అపూర్వరావు పరిశీలించారు. స్ట్రాంగ్‌రూముల వద్ద భద్రత విషయమై సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారి వెంట పీఆర్ ఎస్‌ఈ తిరుపతయ్య, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment