సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో చంద్రబాబు ఎన్నికల కోడ్ అతిక్రమించారు. వందలాది వాహనాల కాన్వాయ్‌తో ర్యాలీ నిర్వహించారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి ర్యాలి చేపట్టిన తెలుగుదేశం శ్రేణులు.. వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. టీడీపీ నాయకులు వాహనాలను అడ్డం పెట్టడంతో బేగంపేట నుంచి పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్‌లో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. అంబులెన్స్‌కు సైతం సైడ్ ఇవ్వకుండా వాహనాలు అడ్డుపెట్టి ర్యాలీ నిర్వహించారు. టీడీపీ శ్రేణుల ఓవర్ యాక్షన్‌పై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, నిన్న తాత్కాలిక బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు తొలిరోజే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించినా ఖాతరు చేయలేదు. జైలు నుంచి బయటకు రాగానే మైకు అందుకున్నారు. కోర్టు.. ఆయన వయసు, అనారోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుని షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీన్ని గొప్ప విజయంగా, నిజం గెలిచిందని, ధర్మం నిలబడిందని చెప్పుకుంటూ చంద్రబాబును ఊరేగింపుగా తరలించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఈటల సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment