తొలుత జాప్యం.. తర్వాత ఎన్నికల కోడ్
కొత్త ప్రభుత్వం ఏర్పడగానే దరఖాస్తుల స్వీకరణ
66 లక్షల దరఖాస్తులు వచ్చినట్టుగా నమోదు
వెంటనే పరిశీలన, లబ్ధిదారుల గుర్తింపు చేపట్టకుండా పెండింగ్
పథకాన్ని అధికారికంగా ప్రారంభించిన నాలుగు రోజులకే నియమావళి
కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభించినా నాలుగైదు నెలల సమయం పట్టవచ్చని అంచనా
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుకు ప్రారంభమైనా.. వాటి నిర్మాణం మాత్రం ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇళ్ల నిర్మాణం కోసం కనీసం మరో ఐదు నెలల పాటు వారు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నా యి. ఆరు గ్యారంటీల్లో ఒకటిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 11న అట్టహాసంగా ప్రారంభించింది. భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించగా పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లో నే పథకాన్ని ప్రారంభించినట్టు మంత్రులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి పథకాలను లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వటమో, తొలి విడత ఆర్థిక సాయం కింద చెక్కు జారీ చేయడంతోనో ప్రారంభిస్తారు. కానీ ఇందిర మ్మ ఇళ్ల పథకాన్ని కేవలం ప్రారంభిస్తున్నట్టు పేర్కొ నటమే తప్ప ఇలాంటివేవీ లేకుండా, లబ్ధిదారుల ప్రస్తావనే లేకుండా సాగింది. వాస్తవానికి ఇప్పటివరకు లబ్ధిదారులను గుర్తించనేలేదు.
దరఖాస్తులు స్వీకరించినా..
ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబర్ నెలలోనే ప్రజా పాలన పేరుతో పేదల నుంచి వివిధ పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించింది. వీటిల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. 80 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, వాటిల్లో గతంలోనే ఇందిరమ్మ ఇళ్లను పొందిన దాదాపు 14 లక్షల మందికి సంబంధించిన దరఖాస్తులు కూడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. వెరసి 66 లక్షల దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చినట్టుగా రికార్డు చేశారు.
వాటిని స్క్రూటినీ చేసి ఇతర కారణాలతో అనర్హమైనవి ఉంటే తొలగించాల్సి ఉంది. ఆ తర్వాత అసలు దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని అప్పట్లో నిర్వహించకుండా పెండింగులో పెట్టారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హడావుడిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగు రోజులకే కోడ్ అమల్లోకి రావటంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. కోడ్ ముగిసినా..
Comments
Please login to add a commentAdd a comment