చంద్రంపాలెం హైస్కూల్ గ్రౌండ్‌లో పార్క్ చేసి ఉంచిన టీడీపీ జెండా కట్టిన వాహనం
మధురవాడ (భీమిలి): తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. మధురవాడలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆ పార్టీ మద్దతు అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు, ఆయన అనుచరులు చంద్రపాలెం పాఠశాలలోకి టీడీపీ జెండాలు కట్టిన నాలుగు వాహనాలతో ప్రవేశించారు.
అంతటితో ఆగకుండా స్టాఫ్ రూమ్‌లో ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే కొమ్మాది రిక్షా కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పాఠశాల పని వేళల్లో గొలగాని సన్యాసిరావు, గొల్లంగి ఆనందబాబు తదితరులు టీడీపీ టీ షర్టులు, కండువాలు వేసుకుని ప్రవేశించి ప్రచారం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment