
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి ఈసీ మరోసారి క్లీన్‌చిట్ ఇచ్చింది. గుజరాత్‌లోని పటాన్‌లో ఏప్రిల్ 21న నిర్వహించిన ప్రచారంలో మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని ఈసీ తేల్చింది. పటాన్‌లోని ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ.. ఐఏఎఫ్ వింగ్ కమాండర్‌ను సురక్షితంగా విడుదల చేసేందుకు పాక్‌పై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. కాగా, ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఒకరు మోదీకి క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అలాగే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ వయనాడ్(కేరళ) నుంచి పోటీ చేయడంపై బీజేపీ చీఫ్ అమిత్ షా ఏప్రిల్ 1న నాగపూర్‌లో చేసిన మెజారిటీ–మైనారిటీ వ్యాఖ్యలపై క్లీన్‌చిట్ ఇవ్వడానికి సదరు ఎన్నికల కమిషనర్ అంగీకరించలేదని వెల్లడించాయి.