మిర్యాలగూడ టౌన్: పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల తరఫున ఓటరు పరిశీలనలో పోలింగ్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకం అని చెప్పవచ్చు. పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లు బోగస్ వారా..? లేక నిజమైనా ఓటరా..? అని నిశితంగా పరిశీలిస్తారు. ఆయా పార్టీల అభ్యర్థు లు అత్యంత విశ్వాస పాత్రులుగా ఉన్నవారిని మాత్రమే ఏజెంట్లుగా నియమించుకుంటారు.
నిబంధనలు ఇవే..
► పోలింగ్ కేంద్రాల్లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు సంబధించిన పోలింగ్ ఏజెంట్లకు ప్రాధాన్య క్రమంలో కుర్చీలను వేస్తారు.
► ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రతి అభ్యర్థి తరఫున ఒక పోలింగ్ ఏజెంట్, ఇద్దరు రిలీఫ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు.
► పోలింగ్ ఏజెంట్ల ఫారంలో పోటీ చేస్తున్న అభ్యర్థి లేదా అతని ఎన్నికల ఏజెంట్‌గా నియమితులైన వారికి ఏజెంట్ల పాసును జారీ చేస్తారు.
► ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు పాసులను జారీ చేసినా ఒక్కరు మాత్రమే బూత్‌లో కూర్చోవటానికి అనుమతి ఇస్తారు. ఓటరు జాబితాను బయటకు తీసుకెళ్లేందుకు వీలు ఉండదు.
► పోలింగ్ ఏజెంట్లు ఓటరుగా నమోదై ఉండి, ఎన్నికల సంఘం ఫొటో గుర్తింపు కార్డు కూడా కలిగి ఉండాలి.
► పోలింగ్ ఏజెంట్లుగా నియమితులైన వారు ఓటింగ్ సమయానికి గంట ముందుగానే పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యంగా వెళ్లినా అధికారులు వారి పనులను వారు కొనసాగిస్తారు. ఆలస్యం అయితే ఓటింగ్ యంత్రాల సీల్‌లో ఏజెంటు సంతకం చేయడం, పరిశీలన చేయలేకపోతారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈవీఎంల సీలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన తరువాతనే సంతకం చేయాలి.
► పోలింగ్ ఏజంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్, వైర్‌లెస్, కార్డ్‌లెస్ పరికరాలను తీసుకెళ్లరాదు. పార్టీ కండువాలు, గుర్తులను ధరించవద్దు. ఓట్లు వేయని ఓటర్ల సంఖ్యను సూచించి వెలుపలికి పంపడం వంటివి చేయవద్దు.
► పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి కదలిక, తతంగాన్ని పోలింగ్ ఏజెంట్లు నిశితంగా పరిశీలించి ఏ మాత్రం అనుమానం కలిగిన అధి కారులకు ఫిర్యాదు చేయవచ్చు.
ఇది చదవండి: దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్న కోస్గి.. దీనికి కారకులు ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment