
సాక్షి, తిరుపతి: నటుడు మంచు మోహన్‌బాబు మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా కోర్టుకు వచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో 2019లో అప్పటి ప్రభుత్వం మోహన్‌బాబుపై కేసు నమోదు చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో 2019లో మదనపల్లి హైవేపై మోహన్‌బాబు ఫ్యామిలీ ఆందోళన చేసింది. దీంతో ఆరోజు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. అయితే న్యాయస్థానం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 20కు వాయిదా వేసింది.
చదవండి: (మీరు అధికారంలో ఉంటే బీసీలకు జడ్పీ చైర్మన్ వచ్చుండేదా?: కొడాలి నాని)