సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరగబోయే ప్రాంతంలో ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి చేదు అనుభవం ఎదురైంది. రామచంద్రాపురం మండలం కుప్పం బాదూరు గ్రామంలో ఓట్లు అభ్యర్థించడానికి వెళ్లిన నానిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, స్థానిక మహిళలు అడ్డుకున్నారు. రేపే పోలింగ్ జరుగుతున్నా.. ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికుల నుంచి నాని తీవ్ర నిరసనను ఎదుర్కొన్నారు.
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరించినా టీడీపీ అభ్యర్థి వాటిని ఖేతారుచేసి ప్రచారాకి వెళ్లారు. కాగా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్‌ఆర్ కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకట్రామపురం కాలురు, కుప్పం బాదురుల కేంద్రాల్లో రేపు రీపోలింగ్ జరుగనుంది. దీంతో ఆయా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
చంద్రగిరిలో టీడీపీ ప్రలోభాలు
Comments
Please login to add a commentAdd a comment